Mother's Day: మదర్స్ డే రోజున అమ్మ కోసం చెయ్యాల్సిన కొన్ని పనులు ఇవే!
Mother's Day: సృష్టిలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ.. అమ్మ కోసం మనం ఎంత చేసినా అది తక్కువే అవుతుంది.. ఎందుకంటే తల్లులకు బిడ్డలు అంటే అమితమైన ప్రేమ.. ఆ ప్రేమను బిడ్డలు తిరిగి తల్లికి అందించినప్పుడు ఆమె కళ్లల్లోని ఆనందం (Happiness) మాటల్లో చెప్పలేనిది. మరి మే రెండవ ఆదివారం వచ్చే మదర్స్ డే (Mother's Day) రోజున తల్లులకు ఇష్టమైన ఈ చిన్న పనులను చెయ్యండి.. వారిని ఆనందంగా ఉంచండి..

అమ్మలు తమ పిల్లల కోసం ఆలోచిస్తూ తమ గురించి ఆలోచించుకోవడమే మర్చిపోతారు. పిల్లల కోరికలన్నీ తీర్చడం కోసం తమ ఆనందాలను దూరం చేసుకుంటారు. పిల్లల సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు. ఇలా స్వార్థం లేకుండా నిస్వార్థంగా (Selflessly) పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతున్న తల్లుల కోసం కేవలం మదర్స్ డే రోజునే వారిపై ప్రేమను వ్యక్తపరచడం (Expressing love) చేయకుండా ప్రతిరోజూ మీ అమ్మకు ఎప్పుడు ప్రత్యేకమైన చిన్న చిన్న పనులను క్రమం తప్పకుండా చేయండి.
అమ్మకు ఇష్టమైన పనులు చేయాలి: చాలా మంది అమ్మలకు ఇంటిని అందంగా (Beautifully) ఉంచుకోవాలని అనుకుంటారు. కానీ వారు ఇంటి పనులు చేయడంలో చాలా అలసిపోతారు. కనుక మదర్స్ డే రోజున మీరు ఇంటిని అందంగా అలంకరించి అమ్మ అనుకున్న విధంగా ఇంటిని సర్దండి. ఇలా చేస్తే అమ్మ ఆశ్చర్యపోతుంది (Wonders).
అమ్మకు ఇష్టమైన వస్తువులను బహుమతులుగా ఇవ్వాలి: ఎప్పటి నుంచో కొనాలనుకున్న మేకప్ వస్తువులనూ కానీ, వంటింటికి సంబంధించిన వస్తువులనూ కానీ, అమ్మకు ఇష్టమైన కలర్ చీరనూ కానీ బహుమతిగా ఇవ్వాలి. ఇలా అమ్మలకు ఇష్టమైన వస్తువులను (Favorite items) బహుమతిగా ఇచ్చినప్పుడు ఆమె చాలా సర్ప్రైజ్ (Surprise) గా ఫీల్ అవుతుంది.
అమ్మకు ఇష్టమైన వంటలను వండిపెట్టండి: ప్రతిరోజూ మనం అమ్మను అది వండిపెట్టమ్మా , ఇది వండిపెట్టమ్మా, నాకు అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం అని పలు రకాలుగా విసిగిస్తాం. అయితే మదర్స్ డే రోజున మాత్రం అమ్మలకు ఇష్టమైన వంటలను (Favorite dishes) మీరే స్వయంగా వండి అమ్మలకు తినిపించండి. అమ్మ కోసం మీరు ఎంతో ప్రేమగా చేసిన వంటలను ఆమె ఎంతో ఇష్టంగా తింటుంది (Eats like).
సర్ప్రైజ్ పార్టీని ప్లాన్ చేయండి: ఆమె మన గురించి ఆలోచిస్తూ తనకు ఇష్టమైన స్నేహితులను (Friends) కోల్పోయి ఉండవచ్చు. అందుకోసం మనం ఒక సర్ప్రైజ్ పార్టీని ఏర్పాటు చేసి తనకు ఇష్టమైన స్నేహితులను కలిసే విధంగా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే ఆమె మొహంలో ఆనందాన్ని మనం చూడవచ్చు. ఇది ఆమె జీవితంలో మరచిపోలేని ఒక మంచి సర్ప్రైజ్ పార్టీ (Surprise party) అవుతుంది.
మీ సమయాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వండి: అమ్మలకు పిల్లలు ఎటువంటి బహుమతులను ఇవ్వకపోయినా పిల్లలు ప్రేమగా పలకరించే పలుకులే గొప్ప బహుమతిగా (Great gift) భావిస్తుంది. కనుక అమ్మలతో కాసేపు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆమె కోసం సమయాన్ని కేటాయించాలి. ఆమెకు ఇష్టమైన ప్రదేశాలకు (Favorite places) తీసుకెళ్లండి.