- Home
- Life
- Halwa Recipe: కార్న్‌ఫ్లోర్‌తో 10 నిమిషాల్లో ముంబై కరాచీ హల్వా రెసిపీ.. నోట్లో వేస్తే కరిగిపోతుంది
Halwa Recipe: కార్న్‌ఫ్లోర్‌తో 10 నిమిషాల్లో ముంబై కరాచీ హల్వా రెసిపీ.. నోట్లో వేస్తే కరిగిపోతుంది
ఎక్కువ కష్టపడకుండా కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే హల్వా రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతుంది. ఈ ముంబై కరాచీ హల్వాను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ దీని ప్రాసెస్ ఇచ్చాము.
13

Image Credit : x
ముంబై కరాచీ హల్వా రెసిపీ ఎలా?
హల్వా పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతాయి. ఏ పండుగలకైనా ఇంట్లో స్వీట్ తప్పని సరి ఇక్కడ మేము కేవలం పది నిమిషాల్లోనే ముంబై కరాచీ హల్వా ఎలా చేయాలో చెప్పాము. తక్కువ సమయంలో ఇది తయారైపోతుంది. కార్న్‌ఫ్లోర్, పంచదార, నెయ్యితో చేసే ఈ స్వీట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
23
Image Credit : x
కరాచీ హల్వాకు కావాల్సిన పదార్థాలు
కార్న్‌ఫ్లోర్ (Cornflour): 1 కప్పు
పంచదార: 1.5 కప్పు
నీళ్లు: 4 కప్పులు (పిండి కలపడానికి 2 కప్పులు + పాకం కోసం 2 కప్పులు)
యాలకుల పొడి: 1/4 టీస్పూన్
ఆరెంజ్ ఫుడ్ కలర్ (Orange Food Colour): 2 చుక్కలు
నెయ్యి: 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు
డ్రై ఫ్రూట్స్: తరిగిన కిస్మిస్ & నట్స్
33
Image Credit : x
కరాచీ హల్వా రెసిపీ
- ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు కార్న్‌ఫ్లోర్ వేసి 2 కప్పుల నీళ్లు వేయాలి. ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఒక కళాయిని స్టవ్ మీద పెట్టి 1.5 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. పంచదార కరిగి మరిగిన తర్వాత, మంటను సిమ్‌లో పెట్టండి.
- ఇప్పుడు ముందుగా కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పంచదార పాకంలో కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలి.
- మిశ్రమం గట్టిపడి అద్దంలా మెరుస్తున్నప్పుడు, యాలకుల పొడి, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత నెయ్యి కొంచెం కొంచెంగా వేస్తూ హల్వా గిన్నెకు అంటుకోకుండా దగ్గరపడే వరకు కలపాలి.
- చివర్లో ముందుగా తరిగి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఒక ప్లేటుకు నెయ్యి రాసి హల్వాను సమానంగా పోసుకోవాలి. బాగా చల్లారాక, మీకు నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేయొచ్చు.
- అంతే, నోట్లో కరిగిపోయే ముంబై కరాచీ హల్వా రెడీ!
Latest Videos













