- Home
- Life
- mothers day 2022: మదర్స్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసా..! దీని చరిత్ర తెలిస్తే దండం పెట్టకుండా ఉండలేరు
mothers day 2022: మదర్స్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసా..! దీని చరిత్ర తెలిస్తే దండం పెట్టకుండా ఉండలేరు
mothers day 2022: అమ్మ ప్రేమకు ఈ భూమ్మీద ఉన్న ప్రతి జీవీ బానిసే. అమ్మ మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభూతి.. వెలకట్ట లేని కష్టజీవి.. తన గురించి మర్చిపోయి.. కలలో కూడా తన బిడ్డల గురించే ఆలోచిందే దేవతామూర్తి. ఇలాంటి మహానుభావురాలకి వేవేల పాదాభివందనాలు చేసినా.. ఆమె రుణం మాత్రం మనం ఎప్పటికీ తీర్చుకోలేం.

Happy Mothers day
mothers day 2022 : అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా ఎన్నో రూపాల్లో ఆడది చేసే సేవకు, ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరూ వెలకట్టలేరు. ఈ లోకంలో ఖరీదు కట్ట లేని కష్టం ఎవరిదైనా ఉందంటే అది మన అమ్మ పడే కష్టమే. ఈ లోకంలో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు.. కానీ ప్రతి క్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడే మన అమ్మే నిజమైన దైవం.
ఈ భూమ్మీద అత్యంత పేదవాడు ఎవరంటే అమ్మప్రేమ దక్కని వాడే అంటారు పెద్దలు. అవును ఎంత కోటీశ్వరుడైనా అమ్మ ప్రేమ, అప్యాయతలు, అనురాగం దక్కని వాడంత దురదుష్టవంతుడు మరొక్కడు లేడు అంటుంటారు. ఎందుకంటే అమ్మలా మనల్ని చూసుకునే వారు ఎవరూ ఉండరేమో. బంధువులైనా.. తోబుట్టువులైనా.. ఆఖరికి నాన్న అయినా సరే.. అమ్మ ప్రేమ ముందు ఎవరూ సరితూగలేరు. అమ్మ ప్రేమ అంత గొప్పది మరి. మనకు తొలి గురువూ ఆమె. మన తొలిప్రేమా అమ్మే. చిన్న మాటల నుంచి..చేతులు పట్టి బుడి బుడి అడుగులు వెయించడం నుంచి మనకు ఎన్నో నేర్పిస్తుంది. ఏ కష్టమైనా సరే తన బిడ్డను చేరాలంటే ముందుగా తనని దాటి వెళ్లాల్సిందే. అంత గొప్పది అమ్మ.
అమ్మ ప్రేమను వర్ణించడానికి ఈ అక్షరాలు సరిపోవు. అమ్మ ప్రేమకు బానిసలు అవ్వకాతప్పదు. అమ్మ గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. మనం ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోలేం. అందుకే బతికి ఉన్నన్నాళ్లు మీ అమ్మకు కష్టకాలంలో అండగా నిలబడండి. బిడ్డలు పెద్దయ్యాకా నాకు నా బిడ్డ ఉన్నాడు అన్న భరోసా కల్పించండి. ప్రతి సంవత్సరం తల్లులు సెలవులు లేకుండా కుటుంబ భాద్యతను నెరవేరుస్తున్నందుకు వారి కృషికి నివాళులు అర్పించడానికి ఒక రోజు ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ప్రతి ఏడా రెండో ఆదివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు.
Mothers Day
ఎన్నో కష్టాలను భరించి, తమ పిల్లలకు ఓదార్పునిచ్చేందుకు 365 రోజులపాటు నిర్విరామంగా శ్రమించి, ప్రేమ, ఔదార్యం, త్యాగానికి ప్రతిరూపం తల్లి అని నమ్ముతారు. వారి ప్రశంసించడానికి , వారి నిస్వార్థమైన ప్రేమను గౌరవించడానికి మదర్స్ డే ఒక ప్రత్యేక సందర్భం. మరి దీనివెనకున్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mother's day
మదర్స్ డే 2022 ఎప్పుడు.. ప్రతి ఏడాది మదర్స్ డేను 5వ నెలలో రెండవ ఆదివారం నాడు జరుపుకుంటాం. ఇక ఈ సంవత్సరం ఈ ప్రత్యేక రోజు మే 8న వస్తుంది.
మదర్స్ డే చరిత్ర.. ప్రాముఖ్యత.. 1908 లో పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్ లో ఉన్న సెయింట్ ఆండ్రూస్ మెథడిస్ట్ చర్చిలో అన్నా జార్విన్ తన తల్లి స్మారక చిహ్నాన్ని నిర్వహించినప్పుడు మదర్స్ డేను మొదటిసారిగా జరుపుకున్నారు. మదర్స్ డేను యునైటెడ్ స్టేట్స్ లో గుర్తింపు పొందిన సెలవుదినంగా మార్చడానికి అన్నా జార్విన్ 1905 నుంచి ప్రచారం చేయడం ప్రారంభించింది.
అన్నా జార్విన్ తల్లి ఆన్ రీవ్స్ జార్వినన్ మరణించింది 1905 సంవత్సరంలోనే. ఆమె శాంతి కార్యకర్త. అలాగే ఆమె అమెరికన్ అంతర్యుద్ధంలో ఇరువైపులా గాయపడిన సైనికులను చూసుకుంది. అంతేకాదు ఆమె ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడానికి మదర్స్ డే వర్క్ క్లబ్ లను కూడా ఏర్పాటుచేసింది. అన్నా జార్విన్ తాను ప్రారంభించిన పనిని కొనసాగించడం ద్వారా తల తల్లిని గౌరవించాలనుకుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తల్లుల కోసం ఒక ప్రత్యేక రోజును సృష్టించాలనుకుంది. ఆమె కష్టానికి ప్రతిఫలంంగా దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత అంటే 1941 లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ తల్లులను గౌరవించడానికి మే నెలలో రెండో ఆదివారాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.