రొయ్యలను వండేటప్పుడు కామన్ గా చేసే తప్పులేంటో తెలుసా?
రొయ్యలను వండేటప్పుడు చాలా మంది కామన్ గా కొన్ని మిస్టేక్స్ ను చేస్తుంటారు. వాటివల్లే రొయ్యల కూర టేస్ట్ పోతుంది. అందుకు మనం రొయ్యలను వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాలతో పాటుగా విధేశీయులకు కూడా రొయ్యల కూరంటే మహా ఇష్టం. అందుకే వీటిని అవకాశమున్నప్పుడల్లా తెచ్చుకుని ఇష్టంగా లాగిస్తుంటారు. వీటిని అప్పుడప్పుడు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రొయ్యల కూర, వేపుపు ఇలా రొయ్యలను ఎలా వండుకుని తిన్నా బలే టేస్టీగా ఉంటుంది. రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ తో పోరాడగలదు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అంతేకాదు వీటిని తింటే మతిమరుపు సమస్య నుంచి ఈజీగా బయటపడతారు. అలాగే వీటిని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన కాల్షియం కూడా బాగా అందుతుంది. కాగా ఈ రొయ్యలతో చర్మం నిగారిస్తుంది. రొయ్యలతో మరెన్నోఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలిసిందే. అయితే రొయ్యలను వండేటప్పుడు కామన్ గా మనం చేసే మిస్టేక్స్ వల్ల రొయ్యల కూర టేస్టీగా కాదు. అంతేకాదు దీంతో రొయ్యలను నుంచి మనకు ఎటువంటి ఆరోగ్య లాభాలు జరగవు. మరి రొయ్యలను వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రొయ్యలను ఇతర ఆహారాల మాదిరిగా కరిగించుకోవచ్చు. అది ఎలాగంటే.. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే వాటిని నేరుగా వండకూడదు. వాటిని రాత్రి సమయంలో ఒక గిన్నెలో కొలాండర్ పెట్టి అందులో రొయ్యలను వేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. వీటిని జిప్ లాక్ బ్యాగ్ పెట్టుకోవాలి. లేదా కూల్ వాటర్ తో నిండిన గిన్నెలో పెట్టుకున్నా మంచిదే..
రొయ్యలను ఎలా ఉడికించాలి: ఇంట్లో రొయ్యలను వండేటప్పుడు చాలా మంది రెగ్యులర్ గా చేసే మిస్టేక్స్ యే చేస్తుంటారు. ముఖ్యంగా రొయ్యలను ఎలా ఉడికించుకోవాలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మనదేశంలో రుచికరంగా అవుతుందని రొయ్యలను మోతాదుకు మించి ఉడకబెడుతుంటారు. కానీ రొయ్యలను అతిగా ఉడికించడం వల్ల రుచి పెరుగుతుందనేది పూర్తిగా అవాస్తమేనంటున్నారు నిపుణులు. రొయ్యలను మందపాటి అడుగుభాగం ఉన్న గిన్నెలో ఉడికించుకోవాలి. అవి గులాబీ రంగులోకి మారితో రొయ్యలు ఉడికాయని అర్థం. లేదా రొయ్యలు ఉడుకుతున్నప్పుడు అవి సి ఆకారంలోకి వస్తే అవి సిద్దమయ్యాయని నిర్ధారించుకోవచ్చు. అదే 'O'ఆకారంలోకి మారడానికి సిద్దంగా ఉంటే అవి అతిగా ఉడికాయని అర్థం చేసుకోవచ్చు.
రొయ్యలను వండటం ఇదే మొదటి సారైతే.. మీరు రొయ్యల పెంకులను తీసేయకండి. పెంకులతో సహా రొయ్యలను వండటం వల్ల మీరు వాటిని అతిగా ఉడికించకుండా అవి సహాయపడతాయి. ఒకవేళ మీరు రొయ్యలను గ్రిల్ చేయాలనుకుంటే.. షెల్ ను తీసివేయకుండా ఉండటమే బెటర్. రొయ్యలను క్లీన్ చేయడం మీకు సరిగ్గా రాకపోతే.. వాటిని కొనుగోలు చేసిన దగ్గరే రొయ్యల నుంచి అవసరమైన వాటిని తొలగించమని చేపల వ్యాపారలకు చెప్పండి. దీనివల్ల వాటిని క్లీన్ చేసే బాధ తపుతుంది.
మార్కెట్లలలో కొనుగోలు చేసే రొయ్యలు ఆరోగ్యానికి మంచివి కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాటికి ఏవేవో కెమికల్స్ రాస్తుంటారు. అందుకే వీటికి బదులుగా అడవిలో పట్టుకున్న లేదా పొలాలల్లో పెంచిన వాటిని తినాలని సూచిస్తున్నారు. వీటివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి వస్తుందని నిపుణులు చెబతున్నారు. అదే రసాయాలతో నిండిఉన్న రొయ్యలను వండుకుని తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వంట టేస్టీగా కూడా రాదు.