Mosquito Bites : మీకు తెలుసా.. దోమలు వీళ్లన్నే ఎక్కువగా కుడతాయట.. ఎందుకంటే?
Mosquito Bites : దోమలు చూడ్డానికి చిన్నగా ఉన్నా కొన్ని కొన్ని సార్లు అవి కుడితే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇవి కుట్టడం వల్ల ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా వంటి అనేక రోగాలు వస్తాయి. అంతేకాదు ఈ దోమలు కుట్టడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. సైన్స్ ప్రకారం దోమలు కొంత మందిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. ఎందుకో తెలుసా..

Mosquito Bites : అసలు దోమలనేవే లేకుంటే ఎంత బాగుండునో.. ఇవి కుట్టి కుట్టి నా రక్తం అంతా తాగేసాయి అని దోమలను తిట్టిపోసే వారు చాలా మందే ఉన్నారు. అంతెందుకు ఈ దోమలు మనుషులను ఎలా చేరుకుంటాయి వంటి ఆలోచనలు కూడా వచ్చినవాళ్లు ఉన్నారు. అందులో ఇవి ఎవరి దగ్గరికీ వెళ్లకుండా నా రక్తాన్నే ఎక్కువగా తాగుతున్నాయని ఫస్ట్రేట్ అవుతూ ఉంటారు. అయితే మీకు తెలియని విషయం ఏమిటంటే దోమలు కొంతమందిని మాత్రమే ఎక్కువగా కుడతాయట. దానికి కారణం లేకపోలేదు. దోమలు వీళ్లనే ఎక్కువగా కుట్టడానికి శాస్త్రీయ కారణాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
వాస్తవానికి మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్ ద్వారానే దోమలు మనల్ని చేరుకోగలుగుతాయట. ఈ Carbon dioxide వాటికి 10 నుంచి 50 మీటర్ల దూరంలో ఉన్నా సరే ఈజీగా మనల్ని వెతుక్కుంటూ రాగలవు.
ఈ దోమలు మనల్ని 5 నుంచి 15 మీటర్ల దూరంలోంచి గుర్తించి చేరుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. దాని ద్వారానే మనం కనిపించిన వెంటనే అవి మన దగ్గరకు వస్తాయి. అయితే అవి మన దగ్గరికి రావడానికి ఒక మీటర్ దూరం ఉందనగా.. మన శరీర వేడిని బట్టి అవి మనల్ని కుట్టాలా? లేదా అని ఆలోచించుకుంటాయట.
దోమలు ఎవరిని ఎక్కువగా కుడతాయి: ఎవరి శరీరమైతే ఎక్కువగా లాక్టిక్ యాసిన్ వంటి రసాయనాలను రిలీజ్ చేస్తాయో వారినే ఎక్కువగా కుడతాయట. అయితే Scientific evidence ప్రకారం బ్లడ్ గ్రూప్ ‘o’ఉన్నవారినే దోమలు ఎక్కువగా కుడతాయి.
కాగా మానవ శరీరం కూడా దోమలను విపరీతంగా ఆకర్షిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అందులో శారీరక శ్రమ ఎవరైతే తక్కువగా చేస్తారో వారే ఎక్కువగా దోమల బారిన పడతారట. అలాగే ఒబెసిటీ సమస్యను ఎదుర్కొనే వారిని కూడా దోమలు ఎక్కువగా కుట్టే ప్రమాదం ఉంది.