MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gym Mistakes: వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగుతున్నారా..? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా..?

Gym Mistakes: వ్యాయామం చేసిన వెంటనే నీళ్లను తాగుతున్నారా..? మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా..?

Gym Mistakes: శరీరం  ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి జిమ్ముల్లో కసరత్తులు చేయడం చాలా అవసరం. అయితే వ్యాయామాలు చేసే వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 09 2022, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో చాలా మంది ఆహారపు అలవాట్లు సోమరులను చేసేవిగా.. విపరీతంగా బరువును పెంచేవిగా ఉన్నాయి. ఇక బరువును తగ్గించుకునేందుకు జిమ్ములకు కొంతమంది వెళితే.. మరికొంతమంది మాత్రం.. పెరిగితే పెరగని అదె తగ్గుతని నిర్లక్ష్యంగా ఉంటారు. దీనివల్ల ఒక్కటేమిటీ ఎన్నో రకాల రోగాలొస్తాయి. ఈ సంగతి పక్కన పెడితే ఆరోగ్యం కోసం రెగ్యులర్ గా జిమ్ములకు వెళ్లి కసరత్తులు చేస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వ్యాయామాలు చేసే వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

26

మన శరీరం 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. ఈ నీటి శాతం తగ్గితే.. గుండెల్లో మంట, వెన్ను నొప్పి, శరీర బలహీనత, తలనొప్పి, మైకము వంటి సమస్యలు వస్తాయి. దీంతో మనకు బాగా దాహం అవుతుంది. ఎందుకంటే శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు శరీరం ఇతర అవయవాల నుంచి నీటిని తీసుకోవడం ప్రారంభిస్తుంది. అందుకే దాహం వేసినా.. వేయకపోయినా నీటిని మాత్రం ఖచ్చితంగా తాగుతూ ఉండాలి. 
 

36


వ్యాయామం చేసేటప్పుడు నీళ్లను తాగొచ్చా?

ఎక్సర్ సైజ్లు చేసేటప్పుడు శరీరం బాగా అలసిపోతుంది. శక్తి కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. ఎక్కువ సేపు వ్యాయామాలు చేస్తే శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. దీంతో ఆ సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్సర్ సైజ్లు చేసిన వెంటనే నీటిని తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వ్యాయామాలు చేసి బాడీ టెంపరేచర్ బాగా పెరుగుతుంది. ఆ సమయంలో చల్లని నీళ్లను తాగడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. 
 

46

జిమ్ముల్లో కసరత్తులు చేసిన  తర్వాత శరీర చెమట మొత్తం ఆరిపోయేంత వరకు కొద్ది సేపటిదాక రెస్ట్ తీసుకోండి. శరీరం చల్లబడిన తర్వాతే నీళ్లను తాగండి. 
 

56

ముఖ్యంగా నీళ్లను ఫాస్ట్ గా తాగడకూడదు. మెల్లిమెల్లిగానే సిప్ చేయాలి. ఇంకొక విషయం నీళ్లను నిలబడి తాగకూడదు. వ్యాయామాలు చేసిన గంట నుంచి 2 గంటల వరకు ఫ్రిజ్ లో ఉండే నీళ్లను తాగకూడదు. 
 

66


వ్యాయామాలు అయిపోయిన తర్వాత మీరు తాగే నీటిలో కొంచెం పంచదార, ఉప్పును వేసుకుని తాగండి. ఈ వాటర్ ఎలక్ట్రోలైట్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. 

 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Salt Water Bath: నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఇన్ని లాభాలా? అయితే చేయాల్సిందే
Recommended image2
Eggplant: కొంచెం స్థలంలోనే వంగ మొక్కల్ని ఇలా పెంచండి
Recommended image3
Junk Food: జంక్ ఫుడ్ 60 రోజులు పాటు తినడం మానేయండి.. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved