MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Business
  • Home Loan: హోమ్ లోన్ ఈఎంఐల నుంచి త్వరగా బయటపడటం ఎలా? ఈ స్మార్ట్ చిట్కాలు మీకోసమే..

Home Loan: హోమ్ లోన్ ఈఎంఐల నుంచి త్వరగా బయటపడటం ఎలా? ఈ స్మార్ట్ చిట్కాలు మీకోసమే..

Home Loan: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలని నిజం చేసుకునే క్రమంలో మనం హోమ్ లోన్ తీసుకుంటాం. కానీ, తీరా లోన్ తీసుకున్నాక మొదలవుతుంది అసలు కథ. నెలకు 50 వేలు, 60 వేల ఈఎంఐ కడుతూ ఉంటే.. ఇంకో 20 ఏళ్ళు ఇదే కష్టమా అని వెక్స్ అయిపోతుంటాం. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 30 2026, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోమ్ లోన్ టెన్యూర్ దీర్ఘకాలిక భారం
Image Credit : Getty

హోమ్ లోన్ టెన్యూర్ - దీర్ఘకాలిక భారం

మనం హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఎక్కువ టెన్యూర్(20-30 ఏళ్లు) ఎంచుకుంటాం. ఎందుకంటే అప్పుడే మనకు కావాల్సినంత లోన్ అమౌంట్ మంజూరు అవుతుంది. కానీ, ఆ దీర్ఘకాలం పాటు ప్రతి నెల ఒకటో తేదీ రాగానే ఈఎంఐ కట్టడం అనేది మానసికంగా చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తికి లోన్ అనేది ఒక బరువులా అనిపించవచ్చు. అందుకే టెన్యూర్ ఎక్కువగా ఉన్నా, దాన్ని తెలివిగా ఎలా తగ్గించుకోవాలో ముందే ప్లాన్ చేసుకోవాలి. ఉద్యోగాన్ని ప్రేమించాలంటే హోమ్ లోన్ ఉండాలని జోక్ గా అంటుంటారు, కానీ అది నిజంగానే మనల్ని బాధ్యతాయుతంగా ఉంచుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒక అదనపు ఈఎంఐ మ్యాజిక్
Image Credit : Getty

ఒక అదనపు ఈఎంఐ మ్యాజిక్

ప్రతి సంవత్సరం 12 నెలల పాటు ఈఎంఐ కడుతూనే ఉంటాం. కానీ, ఏడాదికి ఒకసారి అదనంగా కేవలం ఒక నెల ఈఎంఐ మొత్తాన్ని ప్రిన్సిపల్ రీపేమెంట్ గా కట్టి చూడండి. ఇది మీ లోన్ కాలాన్ని ఊహించని విధంగా తగ్గిస్తుంది. ప్రారంభంలో మనం కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే పోతుంది, అసలు చాలా తక్కువగా తగ్గుతుంది. కానీ ఈ ఎక్స్ట్రా ఈఎంఐ నేరుగా అసలు నుంచి మినహాయించబడటం వల్ల, తర్వాతి నెలల నుంచి వడ్డీ భారం తగ్గి, అసలు వేగంగా క్లియర్ అవుతుంది. ఇది చాలా సులభమైన, ఎఫెక్టివ్ పద్ధతి.

Related Articles

Related image1
Home Loan: హైద‌రాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనాలంటే.. నెల‌కు ఎంత జీతం రావాలి.?
Related image2
Home Loan: రూ. 50 లక్షల హోమ్ లోన్.. ఇలా చేస్తే త్వరగా తీర్చేసి రూ. 30 లక్షలు ఆదా చేయవచ్చు
35
10 శాతం ఎస్ఐపి ఫార్ములా
Image Credit : Gemini AI

10 శాతం ఎస్ఐపి ఫార్ములా

మీరు బ్యాంకుకు కట్టే ఈఎంఐలో కేవలం 10 శాతం మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో పెట్టుబడిగా పెట్టండి. ఉదాహరణకు 50 లక్షల లోన్ కి 44,000 ఈఎంఐ అనుకుంటే, ఒక 4,400 రూపాయలు ఎస్ఐపి చేయండి. 20 ఏళ్ల తర్వాత మీరు బ్యాంకుకి అసలు, వడ్డీ కలిపి ఎంత కట్టారో(దాదాపు కోటి రూపాయలు), అంతే మొత్తం మీ ఎస్ఐపి ద్వారా కార్పస్ గా తయారవుతుంది. అంటే టెక్నికల్ గా మీరు బ్యాంకుకు కట్టిన వడ్డీ అంతా మీకు తిరిగి వచ్చినట్లే. ఈ చిట్కా పాటించడం వల్ల మీ ఇల్లు మీకు ఉచితంగా లభించిన ఫీలింగ్ కలుగుతుంది.

45
మరో ఇన్వెస్ట్మెంట్ తో లోన్ క్లోజర్
Image Credit : Getty

మరో ఇన్వెస్ట్మెంట్ తో లోన్ క్లోజర్

మీ దగ్గర ఎప్పుడైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే, దాన్ని నేరుగా లోన్ లో కట్టేయకుండా ఒక అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. బోనస్ లు వచ్చినప్పుడు లేదా శాలరీ పెరిగినప్పుడు ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో వేస్తూ పోతే, ఒక 8-10 ఏళ్లలో అక్కడ ఒక పెద్ద నిధి తయారవుతుంది. ఆ సమయంలో మీ లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో చూసుకుని, మ్యూచువల్ ఫండ్ లోని డబ్బుతో ఒకేసారి లోన్ క్లోజ్ చేసేయవచ్చు. 20 ఏళ్ల పాటు లోన్ కోసం ఎదురుచూడకుండా, సగం కాలంలోనే అప్పుల నుంచి విముక్తి పొందడానికి ఇది గొప్ప మార్గం.

55
ముందస్తు ప్రణాళిక - స్మార్ట్ ప్రిపరేషన్
Image Credit : Getty

ముందస్తు ప్రణాళిక - స్మార్ట్ ప్రిపరేషన్

ఇల్లు కొనడానికి 4-5 ఏళ్ల ముందే ప్లానింగ్ మొదలుపెట్టడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో మీరు ఎంత ఈఎంఐ కట్టాలనుకుంటున్నారో, అంత మొత్తాన్ని ఇప్పుడే ఎస్ఐపి రూపంలో జమ చేయడం స్టార్ట్ చేయండి. ఇది మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఆ డబ్బు ఫైవ్ ఇయర్స్ లో ఒక పెద్ద కార్పస్ గా మారుతుంది. ఈ మొత్తాన్ని మీరు డౌన్ పేమెంట్ కి, రిజిస్ట్రేషన్ ఖర్చులకి లేదా ఇంటి ఇంటీరియర్ వర్క్ కి వాడుకోవచ్చు. ఇలా ముందే ప్రిపేర్ అవ్వడం వల్ల లోన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. ఏ భారం లేకుండా మీ సొంత ఇంట్లోకి అడుగుపెట్టే ఆనందమే వేరు!

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
త‌ల్లి గాజులు అమ్మి వ్యాపారం మొద‌లు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
Recommended image2
Gold: బంగారాన్ని నగల రూపంలో కాకుండా ఇలా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు
Recommended image3
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Related Stories
Recommended image1
Home Loan: హైద‌రాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనాలంటే.. నెల‌కు ఎంత జీతం రావాలి.?
Recommended image2
Home Loan: రూ. 50 లక్షల హోమ్ లోన్.. ఇలా చేస్తే త్వరగా తీర్చేసి రూ. 30 లక్షలు ఆదా చేయవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved