- Home
- Life
- Monkeypox Virus : యూకేలో మంకీపాక్స్ వైరస్ వ్యాధి నిర్ధారణ.. ఇది ఎలా వ్యాపిస్తుంది.. ఇది సోకకూడదంటే ఏం చేయాలి..
Monkeypox Virus : యూకేలో మంకీపాక్స్ వైరస్ వ్యాధి నిర్ధారణ.. ఇది ఎలా వ్యాపిస్తుంది.. ఇది సోకకూడదంటే ఏం చేయాలి..
Monkeypox Virus : మంకీపాక్స్ వైరస్ వ్యాధి కోతుల ద్వారా సోకుంతుంది. ఈ వైరస్ కేసులను మొదటి సారిగా 2018 సంవత్సరంలో యూకేలో కనుగొన్నారు. జ్వరం, కండరాల నొప్పి, వణుకు, అలసట వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.

Monkeypox Virus : కోతుల నుంచి మనుషులకు వ్యాపించే మంకీపాక్స్ వైరస్ యూకేలోని ఓ వ్యక్తికి సోకినట్టు నిర్దారణ అయ్యింది. ఇటీవల నైజీరియాకు వెళ్లిన ఇంగ్లాండుకు చెంది ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.
UKHSA ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ సాధారణంగా తేలికపాటి లక్షణాలను కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడిన రోగులు త్వరగానే కోలుకుంటారు.
మంకీపాక్స్ వైరస్ మొదటిసారిగా 2016 లో యూకేలో బయటపడింది. అక్కడ కొన్ని కేసులు నిర్ధారణ అయినట్టు బీబీసీ తెలిపింది. కాగా దీనిబారిన పడితే జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, వణుకు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
monkeypox virus
ఇక ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి సన్నిహితంగా ఉండే వారికి కూడా ఇది సోకే అవకాశం ఉంది. ఈ వైరస్ యొక్క వాహకాలుగా ఉండే అవకాశం ఉన్న.. లేదా ఇది సోకిన జంతువులను తాకడం వల్ల లేదా వైరస్ తో కలుషితమైన ఆహార పదార్థాలను తినడం ద్వారా దీనిబారిన పడే అవకాశం ఉంది. మంకీపాక్స్ వైరస్ కు చికిత్స లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ మశూచి వ్యాక్సినేషన్ ఈ వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది.
మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి.. మంకీ ఫీవర్ లేదా మంకీపాక్స్ అనేది మశూచి లాంటి వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 1970 లో మనుషుల్లో మంకీపాక్స్ సంక్రమణ మొదటి కేసు నమోదైంది. ఈ వైరస్ 11 ఆఫ్రికన్ దేశాల్లో నిర్దారణ అయ్యింది.
ఆఫ్రికాలోని అడవి జంతువుల నుంచి ఈ వ్యాధి మనుషులకు వ్యాపించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. ఇది సోకిన వారిలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్ను నొప్పి , కండరాల నొప్పులు ఉంటాయి. అంతేకాదు వీరి శరీరమంతా దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు ముందుగా ముఖంపై మొదలవుతాయి. ఆ తర్వాత చేతులకు.. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలైన కాళ్లకు వ్యాపిస్తాయి. ఈ దద్దర్లు ద్రవంతో నిండిని చిన్న చిన్న బుడగలుగా మారుతాయి.
ఇది సోకకూడదంటే..
1. మీరు కోతులు లేదా ఇతర వన్యప్రాణులను తాకకూడదు.
2. జంతువుల కాటు లేదా గీతలు మీ ఒంటిపై పడినట్టైతే.. కనీసం 15 నిమిషాల పాటు ఆ భాగాన్ని సబ్బుతో క్లీన్ చేసుకోండి.
3. మాంసాహారాన్ని బాగా ఉడికించి తినండి.
4. గార్డెనింగ్ తర్వాత సబ్బు, నీటితో మీ చేతులను శుభ్రం చేసుకోండి. జబ్బుపడిన జంతువులను చూసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.