- Home
- Life
- కప్పు కాఫీకి టీ స్పూన్ నెయ్యిని కలిపి తాగితే.. ఒక్క బరువేంటీ.. ఎన్నో రోగాలు తగ్గితాయి తెలుసా..?
కప్పు కాఫీకి టీ స్పూన్ నెయ్యిని కలిపి తాగితే.. ఒక్క బరువేంటీ.. ఎన్నో రోగాలు తగ్గితాయి తెలుసా..?
కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగడం అంటేనే కాస్త వింతగా అనిపిస్తుంది కదూ.. కానీ ఒక కప్పు కాఫీలో టీ స్పూన్ నెయ్యిని కలుపుకుని తాగితే ఎన్నో రోగాలు ఇట్టే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

టీ కంటే కాఫీనే ఎక్కువగా తాగుతుంటారు. చాలా మంది ఉదయం నిద్రలేవగానే బ్లాక్ కాఫీ లేదా మిల్క్ కాఫీని తాగడానికి ఇష్టపడతారు. కాఫీ తాగడం వల్ల శరీరం హుషారుగా మారడమే కాదు.. శక్తివంతంగా కూడా మారుతుంది. ముఖ్యంగా కాఫీ తాగితే చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా ఇది తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవే కాదు కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కప్పు కాఫీకి ఒక టీస్పూన్ నెయ్యిని కలిపి తాగితే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి మీకు తెలుసా..
ghee
నెయ్యి కాఫీ ప్రయోజనాలు
చాలా మంది నెయ్యని పాలతో కలిపి తాగుతుంటారు. కానీ కాఫీకి నెయ్యిని కలిపి తాగడం అనేది కాస్తవింతగానే అనిపిస్తుంది. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.
ghee
బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.
నెయ్యిలో ఒమేగా3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులతో రోజును ప్రారంభిస్తే ఆరోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉండటమే కాదు.. మళ్లీ మళ్లీ తినాలన్న కోరిక, ఆకలి కూడా తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.
ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి
పరిగడుపున టీ స్పూన్ నెయ్యిని కాఫీలో కలుపుకుని తాగితే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నెయ్యిలో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు అంతరాయం కలిగించే ఆమ్లాన్ని తటస్తం చేస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
దేశీ నెయ్యి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొందరగా కరిగిపోతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నెయ్యిని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, బ్యూటెరిక్ లు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి మొండి కొవ్వును కరిగిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడతాయి.
ఒత్తిడి తగ్గిస్తుంది
నెయ్యిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మాసనిక పరిస్థితిన మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగితే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
జీర్ణక్రియకు మంచిది
కాఫీలో నెయ్యిని కలుపుకుని తాగితే జీర్ణప్రక్రియ మెరుగ్గా జరుగుతుంది. అంతేకాదు కాలెయ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఇది ఆహారాన్ని తొందరగా జీర్ణం చేస్తుంది.
ఎలా తయారుచేయాలి
ఒక కప్పు కాఫీలో ఒక టీ స్పూన్ నెయ్యిని మిక్స్ చేయాలి. పెద్ద కప్పు కాఫీ అయితే మరో అర టీ స్పూన్ నెయ్యిని కలిపి తాగి.. కాఫీ నురుగు వచ్చే వరకు బీట్ చేయాలి. నెయ్యికి బదులుగా వెన్నను కూడా వేసుకోవచ్చు. ఇది స్వీట్ నెస్ ను తగ్గిస్తుంది.