Men's Health: ఈ వ్యాధులు మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రమాదకరం.. తేలిగ్గా తీసిపారేయకండి..
Men's Health: కొన్ని రకాల రోగాలు మహిళలతో పోల్చితే పురుషులకే మరింత ప్రమాదకరంగా మారతాయని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. అవేంటంటే..

పురుషుల, మహిళల శరీరాలు భిన్నంగా ఉంటాయి. అలాగే వారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా భిన్నంగానే ఉంటాయి. వ్యాధులకు సంబంధించినంత వరకు.. మహిళలు, పురుషులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు (Health professionals) హెచ్చరిస్తున్నారు. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడొచ్చంటున్నారు. అయినప్పటికీ కొన్ని రకాల వ్యాధులు మహిళల కంటే పురుషులనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
depression man
డిప్రెషన్ (Depression): సాధారణంగా మహిళలు భావోద్వేగపరంగా వీక్ గా ఉంటారని చాలా మంది నమ్ముతారు. అయితే డిప్రెషన్ సమస్య ఆడవారిలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు తమ కష్టాలను ఇతరులతో చెప్పుకుంటారు. కానీ పురుషులు అమ్మాయిల్లా కాదు. వారి భావాలను ఎవరికీ చెప్పుకోరు. దీంతో వారు లోపల ఉక్కిరిబిక్కిరి అవుతారు. దీంతో డిప్రెషన్ బారిన పడొచ్చు.అందుకే వీలైనంత వరకు ఏదైనా సమస్య లేదా కష్టంగా అనిపిస్తే.. మీ భావాలను ఇతరులతో చెప్పుకోండి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
గుండె జబ్బులు (Heart disease): గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంటుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అందుకే వీళ్లు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి.
డయాబెటిస్ (Diabetes): మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా బయటి ఫుడ్, ఆయిలీ ఫుడ్ ను తింటారు. దీని వల్ల వారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి (Cholesterol level) పెరుగుతుంది. ఇది తరువాత మధుమేహానికి (diabetes)కారణమవుతుంది. అందుకే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలి. అలాగే క్రమం తప్పకుండా మీ రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేస్తూ ఉండాలి.
liver disease
కాలేయ వ్యాధి (Liver disease): ఈ వ్యాధి కూడా స్త్రీలలో కంటే పురుషులకే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మద్యం సేవించే వ్యసనం మగవారికే ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారి కాలేయం ఎక్కువగా ప్రభావితమవుతుంది. దీంతో కాలెయ సంబంధిత రోగాలు వస్తాయి.
ఊపిరితిత్తుల వ్యాధి (Lung disease): మహిళల కంటే పురుషులే ఎక్కువగా ధూమపానం (Smoking) చేయడం మీరు తరచుగా చూసే ఉంటారు. అలాగే ఇంటి నుంచి బయటకు రావడం వల్ల వారు ఎక్కువ దుమ్ము, కాలుష్యానికి గురవుతారు. ఈ విధంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కూడా పురుషులకే ఎక్కువగా వస్తాయి.