Beauty Tips: మేకప్ అందంగా నాచురల్ గా రావాలంటే.. ఈ పొరపాట్లు చేయకండి!
Beauty Tips: కొందరు ఆడవాళ్లు వేసుకునే మేకప్ వాళ్ళకి ఎంతో అందాన్ని తీసుకువస్తుంది. కానీ కొందరు మేకప్ వేసుకునే సమయంలో తెలియక చేసిన పొరపాట్లు వారికి ఉన్న అందాన్ని కూడా పాడు చేస్తాయి. అందుకే మేకప్ వేసుకునే సమయంలో చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం.
ఈరోజుల్లో ఆడవాళ్లు చాలామంది మేకప్ లేకుండా బయటికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. హెవీ మేకప్ వేసుకోకపోయినా ఫౌండేషన్ రాసుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, కాజల్ పెట్టుకునే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. అయితే కొంతమంది చేసుకునే మేకప్ వారికి ఎంతో అందాన్ని తీసుకువస్తే కొంతమంది చేసుకునే మేకప్ వారిని వయసులో మరింత పెద్దగా కనిపించేలాగా చేస్తుంది.
దానికి కారణం వాళ్ళకి మేకప్ మీద పూర్తిగా అవగాహన లేకపోవడం. అందుకే మేకప్ సమయంలో మీరు చేసే పొరపాట్లు ఏమిటో ఇక్కడ చూద్దాం. సాధారణంగా ఫౌండేషన్ ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తాం అనుకొని ఎక్కువగా ఫౌండేషన్ వాడుతూ ఉంటారు.
దీని వలన త్వరగా చర్మం పాడవుతుంది. అలాగే మేకప్ కి ఈ ఫౌండేషన్ సూత్రధారి. కాబట్టి బేస్ కలపటం లో బాగా అవగాహన కలిగి ఉండాలి. అలాగే లిప్స్టిక్ వేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అది క్వాలిటీ గా ఉండాలి, ఆ షేడ్ మన ఫేస్ కి నప్పుతుందా లేదా చూసుకోవాలి. అలా కాకుండా మన దగ్గర ఉంది కదా అని ఏదో ఒక లిప్స్టిక్ వేసుకొని వెళ్లిపోతే మీరు రెడీ అయిన డ్రెస్సింగ్ కి, వేసుకునే మేకప్ కి మ్యాచ్ అవ్వదు. దానివల్ల ఉన్న అందం పోతుంది.
అలాగే కంటికి మేకప్ చేసుకోవటంలో కూడా ఏమాత్రం అవగాహన లేకపోయినా మీరు వయసులో మరింత పెద్దవారు లాగా కనిపిస్తారు. కాబట్టి కంటికి వేసుకునే ఐషాడో మీ ఫేస్ కి నప్పుతుందో లేదో ముందు టెస్ట్ చేసుకోండి. అలాగే కొన్నిసార్లు స్మోకీ ఐ మేకప్ కూడా మిమ్మల్ని పెద్దవాళ్ల లాగా చేస్తుంది.
కాబట్టి మీరు చేసుకునే మేకప్ మీకు నప్పుతున్నదీ, లేనిది ముందుగా తెలుసుకోవడం అవసరం. అలాగే పగటిపూట ఎలాంటి డీప్ క్రీం ని ఉపయోగించకండి. రాత్రిపూట మాత్రమే ఈ క్రీమ్ ని ప్రిఫర్ చేయండి. సో, ఈ పొరపాట్లు చేయకుండా కొంచెం అవగాహనతో మేకప్ వేసుకుంటే చక్కనైన అందం మీ సొంతం.