MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Cleaning Hacks: నల్లగా మాడిపోయిన గిన్నెలను ఇలా 5 నిమిషాల్లో తెల్లగా మెరిపించేయండి

Cleaning Hacks: నల్లగా మాడిపోయిన గిన్నెలను ఇలా 5 నిమిషాల్లో తెల్లగా మెరిపించేయండి

Cleaning Hacks: వంటగదిలో గిన్నెలు మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.  కూర మాడిపోయినప్పుడు, పాలు అడుగుంటినా కూడా గిన్నెలు నల్లగా మారుతాయి.  బొగ్గులా మారిన గిన్నెలను కూడా తెల్లగా మెరిపించే చిట్కాలు కొన్ని ఉన్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 02 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గిన్నెలను మెరిపించే చిట్కాలు
Image Credit : You tube

గిన్నెలను మెరిపించే చిట్కాలు

వంట చేసేటప్పుడు పాలు మాడిపోవడం, కూర మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు గిన్నె నల్లగా మారిపోతుంది. సాధారణంగా తోమితే ఆ నలుపుదనం పోదు. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా నల్లగా మారిన గిన్నెలను తిరిగి స్టీలు గిన్నెల్లా మెరిపించేయచ్చు. ఇందుకోసం మీరు మాడిపోయిన గిన్నె నిండా నీళ్లు , అందులో చెంచా ఉప్పు, ఒక చెంచా బేకింగ్ సోడా, సగం ప్యాకెట్ ఈనో , కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్ లేదా పౌడర్ వంటివి సిద్ధం చేసుకోవాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలా చేయండి
Image Credit : Getty

ఇలా చేయండి

ముందుగా మాడిపోయిన గిన్నెలో మాడు మునిగేంత వరకు నీళ్లు పోయాలి. సుమారు 2 లీటర్ల నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు ఆ గిన్నెను గ్యాస్ స్టవ్ మీద పెట్టండి.  నీళ్లలో ఒక చెంచా ఉప్పు వేయండి. ఉప్పు మాడిన పొరను వదలగొట్టడానికి  సాయపడుతుంది. ఆ తర్వాత, ఒక చెంచా బేకింగ్ సోడా కూడా కలపండి. ఇది మొండి మరకలను తొలగించడంలో బాగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
Pregnant Women: గర్భిణీలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.5000 గిఫ్టుగా అందుకోండిలా
Related image2
Venus Transit: మార్చిలో శుక్ర సంచారంతో ఈ 4 రాశులకు డబుల్ హ్యాపీనెస్
33
ఈనో కలిపి
Image Credit : social media

ఈనో కలిపి

ఈనో పొడి వాడడం ద్వారా గిన్నెలకు పట్టిన మాడును వదిలించేయవచ్చు. ఇది నీటిలో బుడగలు (Effervescence) సృష్టించి, గిన్నెకు అంటుకున్న నల్లటి మాడును సులభంగా వేరు చేస్తుంది. కాబట్టి స్టమ్ మీద పెట్టిన గిన్నెలో ఈనో పొడి కలపండి.  చివరగా, కొద్దిగా బట్టలు ఉతికే డిటర్జెంట్ వేసి నీటిని బాగా మరగనివ్వండి. నీళ్లు మరుగుతున్నప్పుడు, గిన్నె అడుగున అంటుకున్న నల్లటి పొరలు వాటంతట అవే పైకి తేలడం ప్రారంభమవుతాయి. నీళ్లు బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. గిన్నెను కనీసం 1 గంట పాటు అలాగే వదిలేయండి. నీళ్లు చల్లారే కొద్దీ మాడిన పొరలు పూర్తిగా మెత్తబడతాయి.

గంట తర్వాత  ఒక గరిటెతో గిన్నె అడుగు భాగాన్ని బాగా గీరండి. ఇప్పుడు మాడిన పొరలు ఎలాంటి శ్రమ లేకుండా ఊడి వచ్చేస్తాయి. ఆ నీటిని పారబోసి మామూలు స్క్రబ్బర్‌తో తోమితే స్టీలు గిన్నెలు తళతళలాడిపోతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Pregnant Women: గర్భిణీలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.5000 గిఫ్టుగా అందుకోండిలా
Recommended image2
Venus Transit: మార్చిలో శుక్ర సంచారంతో ఈ 4 రాశులకు డబుల్ హ్యాపీనెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved