MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • LPG: ఇన్‌ఫ్రారెడ్, ఇండ‌క్ష‌న్‌, సిలిండ‌ర్‌.. మూడింటిలో దేనికి ఎక్కువ ఖ‌ర్చు అవుతుందో తెలుసా.?

LPG: ఇన్‌ఫ్రారెడ్, ఇండ‌క్ష‌న్‌, సిలిండ‌ర్‌.. మూడింటిలో దేనికి ఎక్కువ ఖ‌ర్చు అవుతుందో తెలుసా.?

LPG: దేశంలో ఎల్పీజీ సిలిండర్ కోర‌త నేప‌థ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయ వంట విధానాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్ వంటి విద్యుత్ పరికరాల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ఖ‌ర్చు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Mar 25 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇన్‌ఫ్రారెడ్ స్ట‌వ్‌పై గంటకు ఎంత విద్యుత్ ఖర్చవుతుంది.?
Image Credit : Gemini AI

ఇన్‌ఫ్రారెడ్ స్ట‌వ్‌పై గంటకు ఎంత విద్యుత్ ఖర్చవుతుంది.?

ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ విద్యుత్ వినియోగం ప్రధానంగా దాని వాటేజ్ (Watt capacity) పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో లభించే చాలా ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌లు 2000 వాట్స్ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక గంట పాటు పూర్తి పవర్‌పై ఉపయోగిస్తే సుమారు 1.5 నుంచి 2 యూనిట్లు (kWh) విద్యుత్ ఖర్చవుతుంది. సాధారణ వంట సమయంలో పవర్ తగ్గిస్తూ పెంచుతూ ఉపయోగిస్తారు కాబట్టి సగటు వినియోగం గంటకు 1 నుంచి 1.5 యూనిట్లు ఉంటుంది. ఉదాహరణకు మీ ప్రాంతంలో విద్యుత్ ధర ఒక్క యూనిట్‌కు రూ. 7 నుంచి రూ. 8 ఉంటే గంటకు ఖర్చు రూ. 10 నుంచి రూ. 16 మధ్య ఉంటుంది. అంటే రోజుకు ఒకటి రెండు గంటలు వంట చేస్తే నెలకు సుమారు రూ. 600 వ‌ర‌కు అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండక్షన్ కుక్‌టాప్ ఎందుకు కొంచెం ఎక్కువ ఆదా చేస్తుంది?
Image Credit : Asianet News

ఇండక్షన్ కుక్‌టాప్ ఎందుకు కొంచెం ఎక్కువ ఆదా చేస్తుంది?

విద్యుత్ వంట పరికరాలలో ఇండక్షన్ కుక్‌టాప్ అత్యంత సమర్థవంతమైనది అని చెబుతారు. ఇది పని చేసే విధానం ఇన్‌ఫ్రారెడ్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇండక్షన్ బర్నర్‌ను కాదు, పాత్ర కింది భాగాన్ని నేరుగా వేడి చేస్తుంది. కాబట్టి వేడి ఎక్కువగా వృథా కాకుండా శక్తి నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఇండక్షన్ కుక్‌టాప్ వేగంగా వంట చేస్తుంది, తక్కువ విద్యుత్ ఖర్చు చేస్తుంది. అయితే దీనికి ఒక చిన్న సమస్య ఉంది. ఇండక్షన్‌లో ప్రత్యేకమైన మాగ్నెటిక్ పాత్రలను మాత్రమే ఉపయోగించాలి.

35
ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ప్రత్యేకత ఏమిటి?
Image Credit : Asianet News

ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ప్రత్యేకత ఏమిటి?

ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ పని చేసే కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో మొదట కుక్‌టాప్ పైభాగం వేడి అవుతుంది. తర్వాత ఆ వేడి పాత్రకు చేరుతుంది. ఈ ప్రక్రియలో కొంత వేడి గాల్లోకి వెళుతుంది. అందుకే ఇది ఇండక్షన్ కంటే కొంచెం ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. కానీ ఇన్‌ఫ్రారెడ్‌కు ఒక పెద్ద ప్రయోజనం ఉంది. దీనిపై మీరు మట్టి పాత్రలు, అల్యూమినియం పాత్రలు, స్టీల్, గాజు పాత్రలు, ఇలా ఏవైనా సమతలమైన పాత్రలు ఉపయోగించవచ్చు. అందుకే చాలా మంది ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్‌ను సులభమైన ఎంపికగా చూస్తున్నారు.

45
ఎల్పీజీ గ్యాస్‌తో పోలిస్తే ఏది చవక?
Image Credit : X

ఎల్పీజీ గ్యాస్‌తో పోలిస్తే ఏది చవక?

సాంప్రదాయ గ్యాస్ స్టవ్ సమర్థత చాలా తక్కువగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ సమర్థత 40 శాతం నుంచి 50 శాతం మాత్రమే అంటే సగం వేడి గాల్లో వృథా అవుతుంది. ఇక ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ విషయానికి వస్తే దాదాపు 90% వేడి నేరుగా పాత్రకు చేరుతుంది. అందుకే ఇండక్షన్ లేదా ఇన్‌ఫ్రారెడ్ వంట పద్ధతులు ఉపయోగిస్తే ఎల్పీజీతో పోలిస్తే నెలకు 20% నుంచి 30% వరకు ఖర్చు తగ్గవచ్చు. అదనంగా సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. డెలివరీ ఆలస్యం సమస్య కూడా ఉండదు.

55
ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ఎవ‌రికి బెస్ట్ ఆప్ష‌న్
Image Credit : Asianet News

ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ఎవ‌రికి బెస్ట్ ఆప్ష‌న్

మీరు ఎల్పీజీ ఖర్చు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే, ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. మ‌రీముఖ్యంగా ఇండక్షన్ పాత్ర‌లు లేకపోతే, పాత పాత్రలనే ఉపయోగించాలనుకుంటే ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ మంచి ఎంపికగా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Merchant: వినాయక పూజలో డ్యాన్స్ అదరగొట్టిన అంబానీ కోడలు..!
Recommended image2
Kasula Chain: లైట్ వెయిట్ కాసుల చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే
Recommended image3
Idli Batter: వర్షాకాలంలోనూ ఇడ్లీ, దోశ పిండి పర్ఫెక్ట్ గా పులియాలా? ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. దేశంలో తొలిసారి ఎయిర్ పోర్ట్ కింది నుంచి అండ‌ర్‌పాస్‌. ట్రాఫిక్ న‌ర‌కం నుంచి విముక్తి
Recommended image2
గెలుపు, ఓట‌మి కాదు.. జీవితానికి అస‌లు ల‌క్ష్యం ఏంటో తెలుసా? ఈ క‌థ చ‌దివితే మీకే తెలుస్తుంది.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved