MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ 9 పనులు సరిగ్గా చేస్తే.. పేదరికం నుంచి బయటపడటం పక్కా!

ఈ 9 పనులు సరిగ్గా చేస్తే.. పేదరికం నుంచి బయటపడటం పక్కా!

ప్రతీ ఒక్కరూ సుఖంగా, గౌరవంగా బ్రతకాలి అనుకుంటారు. కానీ అలా జీవించడానికి చాలామందికి పేదరికం అడ్డు వస్తుంది. డబ్బుల కొరత వల్ల అనుకున్నది చేయలేకపోతున్నామని చాలామంది బాధపడుతారు. కానీ కొన్ని పనులు సరిగ్గా చేయడం ద్వారా పేదరికం నుంచి బయటపడవచ్చు. 

2 Min read
Kavitha G
Published : Nov 13 2025, 07:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
పేదరికం నుంచి బయటపడాలంటే చేయాల్సిన పనులు
Image Credit : Getty

పేదరికం నుంచి బయటపడాలంటే చేయాల్సిన పనులు

పేదరికం అనేది కేవలం డబ్బులు లేకపోవడమే కాదు. అది ఒక మనస్తత్వం, ఒక పరిస్థితి, కొన్నిసార్లు వారసత్వంగా వచ్చిన బాధ కూడా. చాలా మంది పేదరికం నుంచి బయటపడాలని కోరుకుంటారు. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియక దారితప్పుతారు. పేదరికం నుంచి బయటపడటానికి కష్టపడి పని చేస్తే సరిపోదు. మంచి ఆలోచన, సరైన దిశ, క్రమశిక్షణ, ఆర్థిక జాగ్రత్త వంటివి అవసరం. పేదరికం నుంచి బయటపడేందుకు తప్పకుండా చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

28
ఆలోచనల్లో మార్పు అవసరం
Image Credit : freepik

ఆలోచనల్లో మార్పు అవసరం

అన్నింటికంటే ముందు మన ఆలోచన మార్చుకోవాలి. పేదరికం మనసులో మొదలవుతుంది. “నాకది సాధ్యం కాదు”, “నా పరిస్థితి అలాగే ఉంటుంది” అనే ఆలోచనలను తొలగించాలి. దానికి బదులు “నేను ఏదైనా నేర్చుకోగలను”, నాకు అన్నీ సాధ్యమే అనే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని ఉపయోగించగల మార్గాలు వెతకాలి. 

అవసరంలేని ఖర్చులను తగ్గించడం

చాలా మంది తక్కువ ఆదాయం ఉన్నా, అవసరం లేని చోట ఖర్చు చేస్తుంటారు. ఫోన్ లు, బ్రాండెడ్ దుస్తులు, కాస్ట్లీ ఫుడ్ మొదలైనవి. ఆదాయం ఎంత తక్కువైనా, దానిలో కొంత భాగాన్ని సేవింగ్స్ కి కేటాయించడం అలవాటు చేసుకోవాలి. ప్రారంభంలో తక్కువైనా, అది క్రమంగా ఆర్థిక స్థిరత్వానికి దారి తీస్తుంది.

Related Articles

Related image1
డబ్బులు వృథా కావొద్దంటే ఈ 5 చిట్కాలు కచ్చితంగా ఫాలో కావాల్సిందే!
Related image2
లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణం ఇస్తుందో తెలుసా?
38
నెగిటివ్ వ్యక్తులకు దూరంగా..
Image Credit : Getty

నెగిటివ్ వ్యక్తులకు దూరంగా..

మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఆలోచనలను ప్రభావితం చేస్తారు. ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడేవారు, ప్రతి పనిలో నిరుత్సాహపరిచే వారికి దూరంగా ఉండాలి. ఎదగాలనే తపన ఉన్న వ్యక్తులతో కలవాలి. మనసుకు బలం ఇచ్చే వాతావరణం పేదరికం నుంచి బయటపడటానికి మంచి పునాది అవుతుంది.

48
స్పష్టమైన లక్ష్యం
Image Credit : our own

స్పష్టమైన లక్ష్యం

ఎవరైనా విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం అవసరం. “ఏడాదికి ఎంత ఆదాయం పెంచుకోవాలి?”, “ఎన్ని నెలల్లో అప్పులు తీర్చాలి?”, “ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి?” అనే ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాలి. రాసుకున్న లక్ష్యాలు జీవితానికి దిశను చూపుతాయి. క్రమశిక్షణతో ఆ లక్ష్యాల దిశగా చిన్న చిన్న అడుగులు వేస్తే, పెద్ద మార్పులు తప్పకుండా కనిపిస్తాయి.

58
కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం
Image Credit : Getty

కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం

టెక్నాలజీ మార్పులతో అవకాశాలు మారుతున్నాయి. ఆన్‌లైన్ కోర్సులు, యూట్యూబ్ లెక్చర్లు, లేదా వర్క్‌షాప్స్ ద్వారా ఎవరైనా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. కంప్యూటర్ స్కిల్స్, మార్కెటింగ్, అకౌంటింగ్, లేదా క్రాఫ్ట్ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అలా కొత్తగా నేర్చుకున్న స్కిల్ ద్వారా ఆదాయం పొందవచ్చు. పేదరికం నుంచి బయటపడాలంటే నిరంతర అభ్యాసం తప్పనిసరి.

68
అప్పులపై నియంత్రణ
Image Credit : Getty

అప్పులపై నియంత్రణ

పేదరికంలో ఉన్నవారు ఎక్కువగా అప్పులు తీసుకునే అలవాటు కలిగి ఉంటారు. అవసరం లేని అప్పులు జీవితాన్ని బంధించేస్తాయి. అవసరమైన చోట మాత్రమే అప్పు తీసుకోవాలి. అది కూడా తిరిగి చెల్లించే ప్రణాళిక ముందుగానే చేసుకోవాలి. అప్పులపై ఆధారపడకుండా ఆదాయ మార్గాలను పెంచే దిశగా ఆలోచించాలి.

78
ఆరోగ్యం, సమయపాలన
Image Credit : Getty

ఆరోగ్యం, సమయపాలన

శరీరం బలహీనమైతే, మనసు కూడా బలహీనమవుతుంది. మంచి ఆరోగ్యం లేకుండా సంపద సృష్టి అసాధ్యం. అలాగే సమయాన్ని వృథా చేయడం కూడా పేదరికాన్ని కొనసాగించే మార్గం. ఉదయాన్నే లేవడం, టైంకి నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రణాళిక ప్రకారం పనులు చేయడం వంటి అలవాట్లు జీవితాన్ని మారుస్తాయి.

88
ప్రభుత్వ పథకాలు
Image Credit : Getty

ప్రభుత్వ పథకాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. వాటి ఉద్దేశం ప్రజలకు ఆర్థిక బలం ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, వ్యాపార ప్రారంభానికి ప్రోత్సాహం ఇవ్వడం. కాబట్టి ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అవి కూడా మన ఎదుగుదలకు సహాయపడవచ్చు.

ధైర్యం, ఓర్పు

ధైర్యం, ఓర్పు పేదరికం ఒక్క రోజులో రాదు, అలాగే దాని నుంచి బయటపడటం కూడా ఒక్క రోజులో జరగదు. కానీ క్రమంగా, పట్టుదలతో పనిచేస్తే ఫలితం తప్పక వస్తుంది. పేదరికం మన పరిస్థితి కావొచ్చు కానీ, మన భవిష్యత్తు కాదు. సరైన ఆలోచన, క్రమశిక్షణ, సేవింగ్స్, నేర్చుకునే ఉత్సాహం కలవారిని ఎవరూ ఆపలేరు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
పర్సనల్ పైనాన్స్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved