లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణం ఇస్తుందో తెలుసా?
ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో డబ్బు అవసరం అవుతూనే ఉంటుంది. కొందరు తెలిసిన వ్యక్తుల దగ్గర అప్పు తీసుకుంటారు. మరికొందరు బ్యాంకులను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. మరి నవంబర్ నెలలో ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ ఇస్తుందో తెలుసా?

Personal Loan
సాధారణంగా పర్సనల్ లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవడం ఉత్తమం. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోకుండా ఉండొచ్చు. సాధారణంగా వ్యక్తిగత రుణాలు భద్రత లేనివి కాబట్టి బ్యాంకులు వీటిపై అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తుంటాయి. లోన్ తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఆధారంగా వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు వసూలు చేస్తుంటాయి బ్యాంకులు. ప్రస్తుతం పర్సనల్ లోన్ పై ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ SBI. ఈ బ్యాంకు వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి 10.05 నుంచి 15.05 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 1,000 నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది.
కెనరా బ్యాంకు వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి 14.50 నుంచి 16 శాతం వరకు వసూలు చేస్తుంది. అలాగే రెపో-లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానం చేసినప్పుడు సంవత్సరానికి 13.75 నుంచి 15.25 శాతం వరకు వసూలు చేస్తుంది.
HDFC బ్యాంక్ :
HDFC బ్యాంక్ పర్సనల్ లోన్ పై సంవత్సరానికి 9.99 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. అదే సమయంలో ప్రాసెసింగ్ ఛార్జీలు GST వంటివి రూ. 6,500 వరకు ఉన్నాయి.
ICICI బ్యాంక్ :
అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ICICI ఒకటి. పర్సనల్ లోన్ పై ఈ బ్యాంకు సంవత్సరానికి 10.45 నుంచి 16.50 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు GSTతో కలిపి లోన్ మొత్తంలో 2% వరకు ఉండవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ :
వ్యక్తిగత రుణాలపై కోటక్ మహీంద్రా బ్యాంక్ సంవత్సరానికి 9.98 శాతం నుంచి వడ్డీ రేట్లను వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు.. రుణ మొత్తంలో 5 శాతం వరకు ఉండవచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ పర్సనల్ లోన్ పై సంవత్సరానికి 11.99 నుంచి 18.99 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు సంవత్సరానికి 3 శాతం వరకు ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఆధారంగా 10.4 శాతం నుంచి 15.75 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. మరో బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత రుణాలపై వసూలు చేసే వడ్డీ సంవత్సరానికి 10.75 నుంచి 14.45 శాతం వరకు ఉంది.