నిమ్మకాయ తొక్కే కదా అని పారేస్తే.. మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే మరి.. !
నిమ్మ రసాన్ని బాగా పిండి అవసరం లేదని.. ఇక నుంచి తొక్కలను పారేయకండి. వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి తెలుసా..?

నిమ్మవల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు.. వీటివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు జుట్టు, చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పుల్లగా ఉండే నిమ్మరసంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది నిమ్మకాయ నుంచి రసాన్ని తీసి తొక్కలను మాత్రం డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ నిమ్మతొక్కలు కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
నిమ్మ తొక్కల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి.
షుగర్ వ్యాధి, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి రోగాల ప్రమాదాలాను తగ్గించడానికి దీనిలో ఉండే డీలైమొనేన్ సహాయపడుతుంది. ఈ తొక్క బరువు తగ్గడానికి కూడా సహాయపడతుంది. ఈ తొక్కల్లో ఇందుకు సహాయపడుతుంది.
lemon peel
నిమ్మకాయ తొక్కను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు, నల్లని మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. చర్మం కూడా నిగనిగలాడుతుంది. ఇకపోతే నిమ్మతొక్కల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మ తొక్కల్లో కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలుంటాయి.
నిమ్మ తొక్క నోటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు హార్ట్ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ తొక్కలు రక్తంలో కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
నిమ్మ తొక్కలను వంటగదిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం సగం నిమ్మ తొక్కను తీసుకుని దానిని బేకింగ్ సోడాలో ముంచండి. దీంతో గ్యాస్ బండను , స్లాబ్ ను క్లీన్ చేయండి. బేకింగ్ సోడాతో పాటుగా, తొక్కలకు కాస్త వెనిగర్ ను కూడా కలిపి కూడా ఉపయోగించొచ్చు.
lemon peel
వర్షాకాలంలో కీటకాలు ఒంటికి ఎక్కువగా అంటుకునే ప్రమాదముంది. అయితే స్నానం చేసేటప్పుడు నిమ్మతొక్కను శరీరానికి రుద్దడం వల్ల శరీరంపై ఉన్న కీటకాలు తొలగిపోతాయి.
వంటగదిలో ఏదైనా స్మెల్ వస్తున్నట్టైతే అక్కడ నిమ్మతొక్కలను పెట్టండి. దీంతో చెడు వాసన పోతుంది. నిమ్మతొక్కను గ్రైండ్ చేసి దానికి కొంచెం తేనెను కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం అందంగా మారుతుంది. జిడ్డంతా వదిలిపోతుంది.