ఇంట్లో ఈ మొక్కలు ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయట.. అవి ఏమిటో తెలుసా?
మన జీవనానికి మొక్కలే ఆధారం. అయితే కొన్ని రకాల మొక్కలు ఇంటి లోపల పెంచితే మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈ మొక్కల కారణంగా ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ (Positive Energy) ఆ ఇంటిలో ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఈ మొక్కలు మనకు ఆక్సిజన్ ని అందించి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఎక్కువ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచితే వాతావరణం అందంగా కనిపిస్తుంది. మొక్కలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొక్కలు లేకపోతే మనం లేము. అయితే ఇంట్లో కొన్ని మొక్కలను పెంచితే అష్టైశ్వర్యాలు (Ashtaishwaryas) కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇంటి లోపల కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటే అవి మనకు ఆ ఆక్సిజన్ (Oxygen) ను అందించి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి ఇంటికి ఫ్రెష్ లుక్ తెస్తాయి. అయితే ఇంటి లోపల పెంచుకునేందుకు కొన్ని రకాల మొక్కలు అనువుగా ఉన్నాయి. వీటిని పెంచుకుంటే ఆర్థికపరంగా (Financially) మెరుగుపడతారు. కొన్ని మొక్కలు ఎక్కువ చోట్ల కూడా ఆక్రమించవు. వీటిని ఇంటి మూల ఉంచిన ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. కొన్ని రకాల మొక్కలను ఇంటి లోపల పెంచితే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మనీ ప్లాంట్ (Money Plant): మనీ ప్లాంట్ మొక్క ఉండే ఇంటిలో డబ్బులు ఎక్కువగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. అయితే ఇది మనకు నేరుగా డబ్బులు ఇవ్వదు. రాత్రి పగలు మనకు ఆక్సిజన్ను అందించి ఆరోగ్యంగా (Healthy) ఉండేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యానికి కంటే ముఖ్యమైన ఆస్తి మనకు ఇంకేం కావాలి. కనుక నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యాన్ని అందించి ఆర్థికపరంగా మెరుగుపరుస్తుంది. అందుకే దీన్ని మనీప్లాంట్ అంటారు. ఇది ఇంటి లోపల కూడా చక్కగా పెరుగుతుంది.
జడే ప్లాంట్ (Jade Plant): ఈ మొక్కలు ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ (Negative energy) ని బయటికి పంపుతాయి. ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి కుటుంబంలో ఆనందాన్ని, మనశ్శాంతిని తెస్తాయి. ఈ మొక్కలను ఇంటి లోపల పెంచుకోవడం సులభం. ఈ మొక్కలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని చూసినప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది
లక్కీ బాంబూ (Lucky bamboo): లక్కీ బాంబూ చెట్టు ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న వారికి అదృష్టం (Good luck) వరిస్తుంది. ఈ మొక్కలు భారీ వెదురు చెట్టు జాతికి సంబంధించినవే. కాకపోతే ఇవి చిన్న వెదురు చెట్లు. ఈ చెట్లను మనము ఆఫీసులో ఇంటిలో టేబుల్ పైన ఉంచిన ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ చెట్టు ఉన్న ఇంటికి అదృష్టం పట్టుకుందని చాలామంది నమ్ముతారు. ఈ చెట్టును గుంపుగానే బిగించి ఉంచి ఎప్పుడు వీటి వేర్లను నీటిలోనే ఉంచాలి.
స్నాక్ ప్లాంట్ (Snake plant): స్నాక్ ప్లాంట్ ఇంటి లోపలి గాలిని శుద్ధి చేస్తాయి. ఈ మొక్కను ఇంటికిలో ఉంచుకుంటే ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోయి ధనలాభం (Monetary gain) కలుగుతుంది. ఏ వ్యాపారం చేపట్టిన అందులో ఆర్థిక లాభాలు కలుగుతాయి. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం స్నాక్ ప్లాంట్ మొక్కలను ఇంటిలో ఉంచుకోవడం మంచిది.
ఏరికా పామ్ (Erica Palm): ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇంటిలో ఏ మూలన అయినా ఈ మొక్కను ఉంచుకోవచ్చు. ఇంటికి ఒక ప్రత్యేకమైన తాజా లుక్ (Fresh look) ను అందిస్తుంది. ఈ మొక్కలు ఇంట్లో పెంచితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ ఇంటిలో వారికి సంతోషం, ఏ పని చేపట్టిన అభివృద్ధి కలుగుతాయి. కనుక ఇంటి లోపల ఈ మొక్కలను పెంచుకోవడం మంచిది.