- Home
- Life
- Kalonji Seeds Vs Black Sesame Seeds: చూడటానికి ఒకేలా ఉన్నా.. కలోంజీ సీడ్స్, నల్ల నువ్వులకు తేడా ఏంటి?
Kalonji Seeds Vs Black Sesame Seeds: చూడటానికి ఒకేలా ఉన్నా.. కలోంజీ సీడ్స్, నల్ల నువ్వులకు తేడా ఏంటి?
Kalonji Seeds Vs Black Sesame Seeds: నల్ల నువ్వులు, కలోంజీ సీడ్స్ ఈ రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి. చూడగానే ఈ రెండింటి తేడాను కూడా ఎవరూ గుర్తించలేరు. కానీ, ఈ రెండింటికీ తేడా ఏంటి? దేనిని దేనికి వాడాలి?

Kalonji seeds
భారతీయ వంటకాలు అనగానే అద్భుతమైన రుచి, ఘుుమఘుమలాడే సువాసన గుర్తొస్తాయి. ఈ రుచి వెనక ఉన్న అసలు రహస్యం మన వంటింట్లో ఉండే మసాలా దినుసులే. అయితే, కొన్ని మసాలా దినుసులు చూడటానికి అచ్చం ఒకేలా ఉండి.. మనల్ని అయోమయానికి గురి చేస్తూ ఉంటాయి. అలాంటివాటిలో, కలోంజి, నల్ల నువ్వులు ముందువరసలో ఉంటాయి. రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి. రెండూ నలుపు రంగులో ఉండటం..చిన్నగా ఒకే షేప్ లో ఉంటాయి. కానీ రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాల విషయంలో మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. వీటి మధ్య తేడా ఏంటి? రోజువారీ వంటల్లో వీటిని ఎలా ఉపయోగించాలి?
కలోంజి సీడ్స్...
కలోంజి సీడ్స్ ని శాస్త్రీయంగా నైజెలా సటైవా అని పిలుస్తారు. ఈ గింజలను చాలా మంది ఉల్లి గింజలు అని కూడా పిలుస్తారు. బెంగాలీ వంటకాల్లో ఈ గింజలను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఈ గింజలు చూడటానికి చిన్నగా, నల్లగా ఉంటాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ప్రోటీన్లు, అమినో యాసిడ్లతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయాన్నే కలోంజీ సీడ్స్ నానపెట్టిన నీటిని తాగడం మంచిది. మంచి హెయిర్ గ్రోత్ కి కూడా ఈ గింజలు సహాయపడతాయి.
రోజువారీ వంటకాల్లో కలోంజి ఎలా వాడుతారంటే...
పప్పు, చట్నీలు మరింత రుచిగా ఉండాలంటే నూనెలో కరివేపాకు, ఇంగువతో పాటు కాస్త కలోంజి గింజలు వేసి తాలింపు పెట్టండి. దీని సువాసన వంటకానికి కొత్త రుచిని తెస్తుంది. కచోరీల లోపల పెట్టే స్టఫింగ్ తయారుచేసేటప్పుడు జీలకర్ర, ఇతర మసాలాలతో పాటు కలోంజి వేసి వేయిస్తే ఆ రుచే వేరు. మనం ఇష్టంగా తినే ఆవకాయ లేదా ఇతర నిల్వ పచ్చళ్లలో నల్లటి గింజలు కనిపిస్తుంటాయి కదా.. అవే కలోంజి. ఇవి పచ్చళ్లకు ప్రత్యేకమైన ఘాటు, రుచిని అందిస్తాయి.
నల్ల నువ్వులు..
నువ్వులలో ప్రధానంగా తెలుపు, నలుపు అని రెండు రకాలు ఉంటాయి. నల్ల నువ్వులు శరీరానికి వేడిని ఇస్తాయి, అందుకే చలికాలంలో వీటిని ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకుంటారు. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందుకే శీతాకాలంలో బలం కోసం నల్ల నువ్వుల లడ్డూలు తింటుంటారు.
రోజూవారీ వంటల్లో నల్ల నువ్వుల వాడకం:
మీరు తయారు చేసుకునే వెజిటబుల్ సలాడ్లపై కాస్త నల్ల నువ్వులను చల్లుకోండి. ఇది సలాడ్ పోషక విలువలను పెంచడమే కాకుండా, తినేటప్పుడు మంచి క్రంచీ రుచిని ఇస్తుంది. మఫిన్లు, కుకీలు లేదా బిస్కెట్లు బేక్ చేసేటప్పుడు పైన గార్నిష్ కోసం వీటిని వాడవచ్చు. అలాగే నాన్ , కుల్చా లేదా పరాటాలపై నల్ల నువ్వులు అద్ది కాల్చుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఈ రెండింటికీ తేడా ఎలా గుర్తించాలి..?
కలోంజి గింజలు కాస్త త్రిభుజాకారంలో, గరుకుగా ఉండి ఘాటైన వాసన (ఉల్లిపాయ, మిరియాల కలయికలా) కలిగి ఉంటాయి. నల్ల నువ్వులు మాత్రం నునుపుగా, చదునుగా ఉండి నమిలితే కమ్మని నూనె రుచిని ఇస్తాయి. ఇకపై వంటగదిలో వీటిని చూసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాడేయండి.













