జీడిపప్పులో అత్యధిక పోషకాలు ఉంటాయి. గుండె ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి.
జీడిపప్పు తినడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం చెబుతోంది.
జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, బరువును నియంత్రించే సామర్థ్యం దీనికి ఉంది.
జీడిపప్పు ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లానికి మంచి మూలం. నిద్ర, మానసిక స్థితిని నియంత్రించే న్యూరోట్రాన్స్‌మిటర్లు ఇందులో ఉంటాయి.
జీడిపప్పులో మోనోశాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి.
జీడిపప్పులోని కాపర్, జింక్ మెలనిన్ (జుట్టు, చర్మానికి రంగునిచ్చేది) ఉత్పత్తిని, కొల్లాజెన్ (యవ్వనంగా, దృఢంగా ఉండే చర్మానికి) ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
జీడిపప్పులో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కళ్లను రక్షించడంలో, రెటీనా ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి.
మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ ఎముకల సాంద్రతను కాపాడటానికి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
Garlic: కుండీలో ఈజీగా వెల్లుల్లి పెంచేయచ్చు.. ఇదొక్కటి చేస్తే చాలు
Gold Ring: 2 గ్రాముల్లో అదిరిపోయే ఉంగరం డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్
రోజుకో క్యారెట్ తింటే ఒక్క నెలలోనే చర్మానికి మెరుపు
Anxiety Foods: గుండెల్లో గాభరాగా అనిపిస్తే వెంటనే వీటిని తినండి