Cockroach: ఒక్క బాటిల్ ఉంటే చాలు.. ఇంట్లోకి జీవితంలో బొద్దింకలు రావు
Cockroach: ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? వాటి కోసంస్ప్రేలు, కెమికల్స్ వాడకుండానే వాటిని తరిమికొట్టేందుకు ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. ఇంట్లో దొరికే వస్తువులతోనే బొద్దింకలను సమస్య లేకుండా చేయొచ్చు.

బొద్దింకలకు బాటిల్ ట్రాప్
ఇంట్లో ఒక్కసారి బొద్దింకలు చేరాయంటే, వాటిని వదిలించుకోవడం పెద్ద టాస్క్. మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నా, అవన్నీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. డీప్ క్లీన్ చేసి కెమికల్స్ కొట్టినా, ఒకటి రెండు నెలల్లో మళ్లీ కనిపిస్తాయి. అందుకే ఈ రోజు బొద్దింకలను శాశ్వతంగా ఎలా వదిలించుకోవాలో చెబుతున్నాం.
ఈ సూపర్ ఐడియాకు కావాల్సినవి
బొద్దింకలను వదిలించుకోవడానికి మీకు 1 లీటర్ ఖాళీ వాటర్ బాటిల్, 5 నుంచి 6 టీ స్పూన్ల వెనిగర్, 1 టీ స్పూన్ డిటర్జెంట్ లిక్విడ్, చిన్న బ్రెడ్ ముక్క, 100 ఎంఎల్ నీళ్లు, 2 టీ స్పూన్ల బేకింగ్ సోడా కావాలి.
బాటిల్ కింద భాగంలో లిక్విడ్ రెడీ చేయండి
ఇప్పుడు బాటిల్‌ను మధ్యలోకి కట్ చేయండి. అడుగు భాగంలో వెనిగర్, డిటర్జెంట్ లిక్విడ్, బ్రెడ్ ముక్క, బేకింగ్ సోడా వేయండి. తర్వాత అందులో 100 ఎంఎల్ నీళ్లు పోసి బాగా మిక్స్ చేయండి.
వెనిగర్, బ్రెడ్ వాసన
ఇప్పుడు కట్ చేసిన బాటిల్ పై భాగాన్ని ఫొటోలో చూపించినట్లుగా ఉల్టా చేసి పెట్టండి. బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్లేస్‌లో దీన్ని ఉంచాలి. వెనిగర్, బ్రెడ్ వాసనకు బొద్దింకలు ఆ బాటిల్ దగ్గరకు వస్తాయి.
బొద్దింకల సంఖ్య
ఫుడ్ కోసం వెతుక్కుంటూ వచ్చే బొద్దింకలు బాటిల్ అడుగు భాగానికి చేరి అక్కడే ఇరుక్కుపోతాయి. పైకి రాలేక అందులోనే ఉండిపోతాయి. తర్వాత ఆ బాటిల్‌ను తీసుకెళ్లి బయట పారేయొచ్చు. ఇలా నాలుగైదు రోజులు చేస్తే బొద్దింకల బెడద పూర్తిగా తగ్గుతుంది.













