Pesarattu: రాత్రిపూట అన్నం మానేసి... నెల రోజులు పెసరట్టు తింటే ఏం జరుగుతుంది...?
Pesarattu:పెసరపప్పు ప్రోటీన్ కి మంచి సోర్స్. అలాంటి పెసరపప్పుతో చేసిన పెసరట్టుని ప్రతిరోజూ రాత్రి డిన్నర్ లో తినడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

నెలరోజులు పెసరట్టు తింటే జరిగే మ్యాజిక్..
మన దేశంలో రాత్రిపూట కూడా చాలా మంది హెవీగా తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా అన్నం, టిఫిన్స్ తింటూ ఉంటారు. అయితే, రాత్రిపూట బరువు తగ్గాలని కొందరు అన్నం మానేసి.. రోటీ, చపాతీ లాంటివి తింటూ ఉంటారు. అయితే, వాటికి బదులు.. ఒక నెల రోజుల పాటు రాత్రి భోజనంలో పెసరట్టు తింటే ఏం జరుగుతుంది? ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే పెసరట్టు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది..
పెసరట్టులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల పెసరట్టులో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. రాత్రిపూట అన్నం తింటే.. కార్బోహైడ్రేట్స్ శరీరంలో ఎక్కువగా చేరతాయి. అదే అన్నానికి బదులు పెసరట్టు తింటే..శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల కండరాల పునరుద్దరణ జరగడమే కాకుండా, లేట్ నైట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది.
2.జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది...
పెసరట్టు మీకు సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులోని ఫైబర్ పేగుల కదలికలను సులభతరం చేసి, గట్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. నెల రోజులపాటు క్రమం తప్పకుండా తినడం వల్ల... ఉదయం నిద్ర లేచినప్పుడు కడుపులో చాలా తేలికగా ఉంటుంది.
3.బరువు తగ్గడం...
రాత్రిపూట అన్నం మానేసి పెసరట్టు తీసుకోవడం వల్ల కేలరీల వినియోగం తగ్గుతుంది. పెసరట్టులో కొవ్వు శాతం తక్కువగా, ప్రోటీన్ , ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది అతిగా తినే అలవాటును నియంత్రించి, బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతంగా తోడ్పడుతుంది.
4. రోజంతా ఉత్సాహం
భారీగా అన్నం తిని పడుకున్నప్పుడు మరుసటి రోజు ఉదయం నీరసంగా, బద్ధకంగా అనిపించడం సహజం. పెసరట్టులోని ప్రోటీన్-ఫైబర్ కాంబినేషన్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. దీనివల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే శరీరం ఎంతో చురుగ్గా, రీఫ్రెషింగ్‌గా ఉంటుంది.
5. చర్మానికి సహజమైన కాంతి..
పెసరపప్పులో ఫోలేట్, బి-విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట జీర్ణక్రియపై భారం పడకుండా ఉండటం, మంచి పోషకాలు శరీరానికి అందడం వల్ల నెల రోజుల తర్వాత మీ చర్మంలో సహజమైన గ్లో కనిపిస్తుంది.
అసిడిటీ ఉన్నవారు తినవచ్చా? పెసరపప్పు అసిడిటీకి చాలా మంచిది. అయితే, పిండి రుబ్బేటప్పుడు లేదా పెసరట్టు వేసేటప్పుడు ఎక్కువ నూనె, ఘాటైన మసాలాలు వాడకుండా ఉంటే అసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది.
రాత్రిపూట అన్నం మానేసి, ఇలా హెల్దీగా పెసరట్టుతో డిన్నర్ ముగించడం అనేది శరీర బరువుతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక మంచి అలవాటు!













