Beauty tips: ఈ పిండి ఒక్కటి చాలు.. ముఖానికి అప్లై చేస్తే మొటిమలు పోయి చర్మం మెరుస్తుంది
Beauty tips: ముఖాన్ని మెరిపించేందుకు బ్యూటీ పార్లర్ కు వెళుతున్నారా? అవసరం లేదు... కేవలం సజ్జల పిండిని ముఖానికి అప్లై చేయండి చాలు. ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. మొటిమలు కూడ రావు.

సజ్జలతో అందం
సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. సజ్జల్లో పిండిపదార్థాలు, ప్రోటీన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే సజ్జలు చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. సజ్జల్లో ఉన్న సహజ పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తాయి. ఇంట్లోనే సజ్జలతో అద్భుతమైన ఫేస్‌ప్యాక్ సిద్ధం చేసుకోవచ్చు. సజ్జల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, జింక్, బీ విటమిన్లు, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలోని మృత కణాలను తొలగించి కొత్త కణాల పెరుగుదలకూ సహాయపడతాయి. అలాగే చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి, సహజమైన కాంతిని తెస్తాయి.
సజ్జలు చర్మానికి ఎలా మేలు చేస్తుంది?
సజ్జపిండిలో ఉన్న ఫైబర్, ఖనిజాలు చర్మంలో పై ఉన్న ధూళి, మలినాలను తొలగిస్తాయి. క్రమం తప్పకుండా వాడితే ట్యాన్, బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. చర్మానికి మెరుపు వస్తుంది. ఈ పిండిలో ఉండే ఐరన్, జింక్ వంటి పదార్థాలు చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీని వల్ల చర్మం సహజంగా మెరిసిపోతుంది. వీటలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు వయసు పెరిగేకొద్దీ వచ్చే ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి. చర్మం యవ్వనంగా ఉంటుంది. సజ్జలకు సహజంగానే బ్యాక్టీరియా నిరోధక గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను తగ్గించి మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గుతాయి.
ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేయాలి?
ఇంట్లోనే సజ్జ ఫేస్‌ప్యాక్ చేయడం చాలా సులభం.ఒక టీస్పూన్ సజ్జపిండి తీసుకోండి. దానికి ఒక టీస్పూన్ పెరుగు, అరక టీస్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సమంగా రాయాలి. 15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.
స్క్రబ్ కూడా చేసుకోవచ్చు
సజ్జపిండి, రోజ్ వాటర్ కలిపి స్క్రబ్‌లా వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా రుద్దితే మృత కణాలు తొలగిపోతాయి. ట్యాన్ కూడా తగ్గుతుంది. కానీ గట్టిగా రుద్దకూడదు, చర్మానికి మంట పుడుతుంది. సజ్జపిండి సహజ పదార్థమే అయినా కొందరికి చర్మానికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు చేతి మణికట్టు వద్ద లేదా మెడ దగ్గర చిన్నగా ప్యాచ్ టెస్ట్ చేయండి. ఎలాంటి ర్యాష్‌లు లేదా మంటలు వస్తే వాడకండి.
సజ్జలతో ఉపయోగాలు
సజ్జలు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో, చర్మానికి కూడా అంతే ప్రయోజనం ఇస్తాయి. సహజమైన పదార్థాలతో తయారైన ఈ ఫేస్‌ప్యాక్ రసాయనాలు లేకుండా చర్మాన్ని కాపాడుతుంది. కానీ ఎలాంటి DIY ప్యాక్ అయినా జాగ్రత్తగా, పరిమితంగా వాడితేనే మంచి ఫలితాలు ఇస్తుంది. క్రమం తప్పకుండా వాడితే మీ చర్మం కూడా సహజంగా మెరిసిపోతుంది.