హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ బ్యూటీ సీక్రేట్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందం గురించి మాటల్లో చెప్పతరం కాదేమో.. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో కుర్రకారును మాయచేస్తుంటుంది. అసలు ఈ ముద్దుగుమ్మ ఇంత చక్కగా ఉండటాకి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి తెలియని వారుండదు. వారసత్వంగా ఈ చిన్నది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తన ప్రతిభతోనే మంచి పేరు సంపాదించుకుంటోంది. కాగా ఈ చిన్నది రోజుకో డ్రెస్ లో కనిపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. బికినీలు, హాట్ హాట్ స్విమ్ సూట్లు, పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతుంది. అసలు జాన్వీకపూర్ అందంలో ఆహా అనిపిస్తుంది. ఇంత అందమా అంటూ పొగడనివారంటూ అస్సలు ఉండరేమో.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అందానికి రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
janhvi kapoor
లెజెండరీ శ్రీదేవి అందం గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంలో ఈమెను మించిన వారు ఎవరూ లేరు. రాలేరు కూడా.. ఇక ఈమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన తల్లి అందాన్ని వారసత్వంగా అందిపుచ్చుకుంది. అందుకే ఈమె ఇంత అందంగా ఉంది. అయితే జాన్వీ కపూర్.. అందానికి వంటగది కూడా సహాయపడుతుందట. వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించుకుని జాన్వీ అందంగా మెరిసిపోతుందట.
గ్లో కోసం పండ్లు
బొప్పాయి, నారింజ, పుచ్చకాయ వంటి పండ్లు అందాన్ని కాపాడటానికి సహాయపడతాయి. అయితే జాన్వీ కపూర్ మిగిలిపోయిన పండ్లను ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తుందట. ఈ విషయాన్ని జాన్వీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అవకాడో
అవకాడో మన శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇవి ముఖంపై మచ్చలను, ముడతలను తొలగించడానికి సహాయపడతాయి. వృద్ధాప్య లక్షణాలను పోగొడుతుంది. అందుకే జాన్వీ కూడా అవకాడోను వాడుతున్నట్లు వెల్లడించింది.
Janhvi Kapoor
జుట్టు కోసం దేశీ నుష్కా
జాన్వీ కపూర్ అందమైన జుట్టు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె జుట్టు అందాన్ని బట్టే చెప్పొచ్చు ఆమె దానిపట్ల ఎంత జాగ్రత్తగా ఉంటుందో.. జాన్వీ తన జుట్టును మెయింటెయిన్ చేయడానికి మెంతి గింజలు, ఉసిరి, గుడ్లు వంటి దేశీ నుష్కాలను ఉపయోగిస్తుంది. జాన్వీ కపూర్ జుట్టును బీర్ వాష్ చేస్తుందట. ఇదే ఆమె జుట్టు మెరవడానికి అసలు కారణం.