MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Cooler: కూలర్ నుంచి నీచు వాసన వస్తుందా? ఇలా క్లీన్ చేస్తే ఆ సమస్య ఉండదు

Cooler: కూలర్ నుంచి నీచు వాసన వస్తుందా? ఇలా క్లీన్ చేస్తే ఆ సమస్య ఉండదు

 Cooler: మీ ఇంట్లో కూలర్ ఉందా? కూలర్ ఎంత శుభ్రం చేసినా.. మంచి నీళ్లు పోసినా కూడా నీచు లాంటి వాసన వస్తుందా? ఆ వాసనకు కూలర్ దగ్గర నిద్రపోవడం కూడా కష్టంగా ఉందా? ఒక చిన్న చిట్కా ఫాలో అయితే నీచు వాసనపోతుంది..

2 Min read
Author : ramya Sridhar
Published : May 07 2026, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Bad Smell
Image Credit : Gemini AI

Bad Smell

బయట ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండల వేడి తట్టుకోలేక ఏసీలు వాడుతూ ఉంటారు. ఏసీ కొనలేని వాళ్లు కూలర్స్ వాడుతూ ఉంటారు. అయితే, కూలర్ లో ఎప్పటికప్పుడు నీటిని మార్చినా కూడా ఒక రకమైన నీచు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కూలర్ నుంచి కూలింగ్ సంగతి పక్కన పెడితే.. ఆ వాసన భరించడం కష్టంగా ఉంటుంది. శుభ్రం చేసినా కూడా వాసన పోవట్లేదు అనుకునేవారు ఈ సింపుల్ చిట్కా ఫాలో అయితే.. పది నిమిషాల్లో ఆ దుర్వాసన పోయి.. తాజాదనం వస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  కూలర్ నుంచి దుర్వాసన రావడానికి కారణం..
Image Credit : Asianet News

కూలర్ నుంచి దుర్వాసన రావడానికి కారణం..

కూలర్ లో దుర్వాసన రావడానికి ప్రధాన కారణం.. దానిలోపల పేరుకుపోయిన పాత నీరు. అంతేకాదు.. నీటి కారణంగా కూలర్ లోపల ఉన్న గడ్డిపై నాచు పేరుకుపోతుంది. దాని వల్ల కూడా దుర్వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే.. ముందుగా కూలర్ లోని పాత నీటిని పూర్తిగా తీసేయాలి. తర్వాత శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక కప్పు వైట్ వెనిగర్ లేదా రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను శుభ్రమైన నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని కూలర్ నీటిని నింపి.. అందులో పోయాలి. ఇలా చేయడం వల్ల కూలర్ లోని బాక్టీరియా చనిపోతుంది. దుర్వాసన కూడా తగ్గిపోతుంది.

33
  కూలర్ నుంచి సువాసనలు రావాలంటే..
Image Credit : Gemini AI

కూలర్ నుంచి సువాసనలు రావాలంటే..

కూలర్ నుంచి సువాసనలు రావాలంటే మీరు కూలర్ లోని నీటిలో లావెండర్ లేదా లెమన్ గ్రాస్ వంటి కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ఇలా కలిపిన తర్వాత కూలర్ ఆన్ చేస్తే.. రూమంతా మంచి సువాసనలు వస్తాయి. కొన్ని చుక్కల రోజ్ వాటర్ , నిమ్మరసం వాడినా మంచి సువాసనలు వస్తాయి. మీకు ఆ గదిలో నిద్రపోయినా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

ఇవి కూడా శుభ్రం చేయాలి...

కూలర్ వెనక ఉండే కూలింగ్ ప్యాడ్స్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కొన్ని సార్లు దుమ్ము పేరుకుపోయి, నీటి నుంచి దుర్వాసన రావడానికి కారణం అవుతుంది. అందుకే వారానికి ఒకసారి అయినా వాటిని శుభ్రం చేయాలి. అప్పుడు దుర్వాసన రాదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image2
Onion Storage: ఇలా స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలు మొలకలు రావు, ఫ్రెష్ గా ఉంటాయి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved