Rice Water: అన్నం వండిన గంజి పారబోస్తున్నారా? ఆ గంజిని రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Beauty Tips: అందాన్ని పెంచుకోవడానికి చాలా మంది ఖరీదైన క్రీములు, సీరమ్స్ రాసేస్తూ ఉంటారు. కానీ, అన్నం వండిన గంజితోనే రూపాయి ఖర్చు లేకుండా అందాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసా?

గంజి వార్చి అన్నం వండుతున్నారా?
ఈ రోజుల్లో ఎవరూ గంజి వార్చి అన్నం వండట్లేదు అనే చెప్పాలి. ఒకవేళ ఒకరిద్దరు వండినా.. ఆ గంజిని తాగకుండా పారబోస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఆ గంజి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. కానీ, కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్ని పెంచుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా, మార్కెట్లో దొరికే ఖరీదైన ఖరీదైన క్రీములతో పని లేకుండా.. ఈ గంజితో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం...
గంజిలో పోషకాలు...
అన్నం ఉడికించిన తర్వాత వచ్చే పాల వంటి తెల్లటి గంజిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని కేవలం ముఖానికి రాసుకోవడమే కాదు.. తాగితే.. చర్మం లోపలి నుంచి నిగారింపు పెంచుతుంది.
గంజి తాగడం వల్ల చర్మంలో వచ్చే మార్పులు..
సహజమైన మోశ్చరైజర్: గంజిలో ఉండే నేచురల్ స్టార్చ్ , సెరామైడ్లు చర్మంలోని తేమను బయటకు పోకుండా కాపాడతాయి. పొడిబారడం, కాలుష్యం బారి నుంచి చర్మాన్ని రక్షించి సాఫ్ట్‌గా ఉంచుతాయి.
వృద్ధాప్య ఛాయలకు చెక్: ఇందులో ఉండే ఫెరులిక్ యాసిడ్ లాంటి పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తరిమికొట్టి, ముఖంపై ముడతలు త్వరగా రాకుండా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
కాంతివంతమైన చర్మం: చాలా మంది స్కిన్ ఒకే రంగులో ఉండదు. ఈ సమస్యను గంజి తగ్గిస్తుంది. గంజి తాగడం వల్ల మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించడంలో ఇది సూపర్‌గా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే ముఖం గ్లో అవుతుంది.
మంట, మొటిమలకు స్వస్తి: మొటిమలు, ఎరుపుదనం వల్ల చర్మంలో వచ్చే మంటను తగ్గించే అల్లాంటోయిన్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి.
కొల్లాజెన్ బూస్టర్: చర్మం టైట్‌గా, యంగ్‌గా ఉండేందుకు అవసరమైన 'కొల్లాజెన్' ఉత్పత్తిని పెంచి, దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ గంజి నీరు ఎలా తాగాలి..?
అన్నం వండేటప్పుడు, గంజి ఎక్కువగా ఉండేలా కొద్దిగా ఎక్కువ నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత, ఆ తెల్లటి పాల వంటి గంజిని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. వడకట్టుకున్న ఆ గంజిని గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా చల్లారిన తర్వాత తాగొచ్చు. రుచి కోసం కొద్దిగా ఉప్పు లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. దీన్ని రోజుకు ఒక చిన్న గ్లాసు అంటే సుమారు 50-100 ml మాత్రమే తీసుకోవాలి, అతిగా తాగడం మంచిది కాదు.

