Telugu

కొబ్బరి పాలతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!

Telugu

జుట్టు ఆరోగ్యానికి..

కొబ్బరి పాలలో కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టుకు తేమను అందించడంతోపాటు, ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.

Image credits: Pinterest
Telugu

కొబ్బరిపాలతో తలపై మసాజ్

పావు కప్పు కొబ్బరి పాలను కొద్దిగా వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇవి మంచి కండిషనర్‌లా పనిచేస్తాయి.

Image credits: Pinterest
Telugu

వారానికి ఒకసారి

అలా మసాజ్ చేసిన 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

నిమ్మరసం, కొబ్బరి పాలు

ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు తీసుకొని 2 టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.

Image credits: Freepik
Telugu

50 నిమిషాల పాటు..

ఫ్రిజ్ నుంచి తీసిన మిశ్రమాన్ని తలకు పట్టించి 45 నుంచి 50 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image credits: Freepik
Telugu

అలోవేరా, కొబ్బరిపాలు

ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, గుప్పెడు తులసి ఆకులు వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను జుట్టుకు బాగా పట్టించి కాసేపటి తర్వాత కడిగేయాలి.

Image credits: Freepik
Telugu

ఇది మర్చిపోవద్దు

కొబ్బరిపాలను మొదటిసారి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. దురద, ఎర్రబడటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆపేయాలి.

Image credits: stockphoto

Blouse Front Designs: పట్టుచీరల మీదకు బ్లౌజు ఫ్రంట్ డిజైన్లు..చూసేయండి

Blouse Designs: చీరలపైకి అదిరిపోయే ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు

Gold Bracelets: 5 గ్రాముల్లోనే అదిరిపోయే గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్లు

Pearl Jewellery: అదిరిపోయే డిజైన్ లో ముత్యాల జ్యువెలరీ.. చూస్తే ఫిదా!