Telugu

పచ్చి మిర్చిని ఇంట్లోనే ఈజీగా ఇలా పెంచేయండి!

Telugu

నాణ్యమైన విత్తనాలు

పచ్చిమిర్చి మొక్కలు నాటేందుకు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. అప్పుడే మొక్కలు బాగా పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

సరైన మట్టి

నీరు నిలిచిపోయే గట్టి మట్టిలో మొక్కలు నాటొద్దు. నీరు సులువుగా ఇంకిపోయేలా గుల్లగా ఉండే మట్టిని ఎంచుకోవాలి. అప్పుడే వేర్లు బాగా పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

తగినంత స్థలం

మొక్క పెరిగేందుకు తగినంత స్థలం ఉండాలి. కనీసం 12 అంగుళాల సైజు ఉన్న కుండీ లేదా గ్రోబ్యాగ్ ఎంచుకోవాలి.

Image credits: Getty
Telugu

నీరు పోసే విధానం

రోజూ మొక్కలకు ఎక్కువ నీళ్లు పోయొద్దు. అలా చేస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. మట్టి తడి ఆరిన తర్వాతే మళ్లీ నీళ్లు పోయడం మంచిది.

Image credits: Getty
Telugu

సరైన వెలుతురు

పచ్చిమిర్చి మొక్కలకు సూర్యరశ్మి అవసరం. కాబట్టి ఎండ సరిగ్గా తగిలే చోట పెడితే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

ఎరువుల వాడకం

మొక్కలు చక్కగా పెరగాలంటే సమయానుసారం సేంద్రియ ఎరువులు వేయాలి. అప్పుడే మొక్కకు పోషకాలు బాగా అందుతాయి.

Image credits: Getty
Telugu

పురుగుల నివారణ

ఆకులు ముడుచుకుపోవడం, పురుగులు పట్టడం లాంటివి గమనిస్తే వెంటనే వేప నూనె మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.

Image credits: Getty

Double Layered Chains: బడ్జెట్ లో గ్రాండ్ లుక్ ఇచ్చే టూ లేయర్ నక్లెస్

Papaya: రోజూ బొప్పాయి తింటే ఊహించని ప్రయోజనాలు

Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు

Black Beads: డైలీవేర్ నుంచి పార్టీవేర్ వరకు ఈతరం మెచ్చే మంగళసూత్రాలు