Inspirational story: పులి, జింక కథ.. మీ ఆలోచన మార్చేయడం ఖాయం.
ఈ సృష్టిలో ప్రతీ అంశం మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో విజయాన్ని ఎలా సాధించాలి.? కష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలి.? లాంటి పాఠాలను నేర్పిస్తుంటాయి. అలాంటి ఒక గొప్ప సందేశం ఇచ్చే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పులి, జింకల మధ్య సాగే పోరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటి మధ్య జరిగే పోరు చూసే వాళ్లను కట్టి పడేస్తాయి. నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్ వంటి ఛానెల్స్‌లో ఇలాంటి వీడియోలు చూస్తుంటాం. పులి, జింకల మధ్య జరిగే పోటీలో 90 శాతం జింకలు ఓడిపోతుంటాయి. చివరికి పులికి ఆహారమవుతాయి.
అయితే జాగ్రత్తగా గమనిస్తే.. జింక గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. అదే పులి విషయానికొస్తే దాని వేగం గంటకు 60 మాత్రమే. మరి మెజారిటీ సమయాల్లో జింక పులి చేతిలో ఎందుకు చనిపోతుంది. అంత వేగంగా పరిగెత్తే జింక, పులికి ఎలా చిక్కుతుంది. ఈ విషయం గురించి ఆలోచేస్తే ఒక సమాధానం దొరుకుతంది.
జింక ప్రతీ క్షణం తనను వెంటాడుతున్న పులిని దృష్టిలో పెట్టుకొని పరిగెడుతుంది. పదే పదే వెనక్కి తిరిగి పులిని చూస్తుంటుంది. దీంతో వేగం తగ్గి పులికి దొరికిపోతుంది. అదే పులికి మాత్రం జింక ఒక్కటే టార్గెట్. జింకను పట్టుకోవడమే ఏకైక లక్ష్యంగా పరిగెడుతుంది. అందుకే జింకను సింపుల్‌గా పట్టేసుకుంటుంది.
దీనిని మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. జీవితంలో మనం ముందుకు వెళ్లే క్రమంలో చాలా మంది వారి నెగిటివ్ థాట్స్‌తో మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. మనం వాటి గురించి పట్టించుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంటే. జింకలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్నదో పెద్దదో లక్ష్యాన్ని ఏర్పార్చుకొని ఆ లక్ష్యం కోసమే మీ ఫోకస్ అంతా పెట్టి ముందుకు వెళ్తే, విజయం ముమ్మాటికీ మీ సొంతమవుతుంది.