MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Railway Rules: టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అయితే ఏం చేయాలి? రిఫండ్ వస్తుందా?

Railway Rules: టికెట్ తీసుకున్న తర్వాత రైలు మిస్ అయితే ఏం చేయాలి? రిఫండ్ వస్తుందా?

Railway Rules: రైల్వే సంస్థ మనకు చాలా సదుపాయాలు ఇస్తుంది. కానీ, వాటిని తెలుసుకోకపోతే మనమే చాలా నష్టపోతాం. మరి, ఎప్పుడైనా టికెట్ కొన్న తర్వాత రైలు మిస్ అయితే.. మనకు ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయా అని ఆలోచించారా?

2 Min read
Author : ramya Sridhar
Published : May 23 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Indian Railway
Image Credit : Getty

Indian Railway

భారతదేశంలో చాలా మంది ఎక్కువగా రైలు ప్రయాణాలే చేస్తూ ఉంటారు. ట్రెయిన్ జర్నీ సౌకర్యంగానే ఉంటుంది. కానీ.. రైలు ఎక్కడమే అసలైన సవాలు. రైళ్లు చాలా సార్లు టైమ్ కి రావు. ఒక్కోసారి మనం వెళ్లి స్టేషన్ లో కూర్చొన్నా.. ఆలస్యంగా వస్తాయి.. మరోసారి.. మనం వెళ్ళేలోగా.. ట్రైన్ మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

మనం ఇంటి నుంచి ముందుగానే బయలుదేరినప్పటికీ.. ట్రాఫిక్ కారణంగానే.. మరేదైనా కారణం వల్ల గానీ.. రైలు మిస్ అవ్వడం చాలా మందికి జరిగే ఉంటుంది. మరి.. మనం టికెట్ తీసుకున్న తర్వాత రైలు ఎక్కలేకపోయాం కదా.. మనకు ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయా? మనం కొన్న టికెట్ కి రీఫండ్ చేస్తారా? రైల్వే అధికారులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 జనరల్ టికెట్ కొనుగోలు చేస్తే....
Image Credit : Getty

జనరల్ టికెట్ కొనుగోలు చేస్తే....

జనరల్ అంటే రిజర్వేషన్ లేకుండా టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైలు మిస్ అయితే.. వారికి కొన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇదే టికెట్ తో అదే కేటగిరికి చెందిన మరో రైలు లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. సాధారణంగా, ఒక జనరల్ టికెట్ మూడు గంటల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆలోగా అదే మార్గంలో ప్రయాణించే మరో రైలు ఎక్కొచ్చు. అయితే... జనరల్ టికెట్ తీసుకొని ప్రీమియమ్ రైలు ఎక్కితే మాత్రం.. ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

మెయిల్/ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, రాజధాని, శతాబ్ది, లేదా వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో జనరల్ టిక్కెట్లు చెల్లవు. ఈ రైళ్లలో జనరల్ టిక్కెట్టుతో ప్రయాణిస్తూ టికెట్ కలెక్టర్ కి దొరికిపోతే భారీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

Related Articles

Related image1
Train Owner: మనదేశంలో రైలుకు యజమాని అయినా ఏకైక వ్యక్తి.. అది కూడా రైల్వే శాఖ చేసిన తప్పు వల్లే
Related image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
33
రిజర్వేషన్ చేసుకున్న తర్వాత రైలు మిస్ అయితే...
Image Credit : Getty

రిజర్వేషన్ చేసుకున్న తర్వాత రైలు మిస్ అయితే...

మీరు ముందుగానే రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న రైలు మిస్ అయితే... ఆ టికెట్ తో మరో రైలులో ప్రయాణించలేరు. అలా చేస్తే.. కచ్చితంగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఒక వేళ ప్రయాణికుడు జరిమానా చెల్లించడానికి నిరాకరించింనా, లేదా వాగ్వాదానికి దిగినా.. ఆ ప్రయాణికుడిని రైల్వే పోలీసులకు అప్పగించవచ్చు. చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

ట్రైన్ మిస్ అయితే రిఫండ్ రాదా..?

మీరు ట్రైన్ మిస్ అయిన వెంటనే TDR (టికెట్ డిపాజిట్ రసీదు) దాఖలు చేయాలి. దాదాపు టికెట్ డబ్బులు తిరిగి మనకు రిఫండ్ అయితే రాదు. అయితే, రైలు మూడు గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయ్యి.. టైమింగ్స్ మారడం వల్ల మీరు ఆ రైలులో ప్రయాణించలేకపోతే.. అప్పుడు టికెట్ మనీ రిఫండ్ అయ్యే అవకాశం ఉంటుది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు ఒక స్టేషన్ లో ట్రైన్ మిస్ అయితే... తర్వాతి రెండు స్టేషన్ల వరకు మీ సీట్లను ఎవరికీ కేటాయించరు. అంటే.. తర్వాతి రెండు స్టేషన్ సమయానికి మీరు చేరుకొని.. అక్కడ రైలు ఎక్కితే.. మీ సీటు మీకే ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Party Wear Dresses: ఈ డ్రెస్సులు వేసుకుంటే పార్టీలో అందరి చూపు మీ వైపే
Recommended image2
Smart Product: కిచెన్ లో ప్రతి ఒక్క మహిళకు కచ్చితంగా కావాల్సిన ప్రొడక్ట్ ఇది.. ఎలా వాడాలో తెలుసా?
Recommended image3
Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..!
Related Stories
Recommended image1
Train Owner: మనదేశంలో రైలుకు యజమాని అయినా ఏకైక వ్యక్తి.. అది కూడా రైల్వే శాఖ చేసిన తప్పు వల్లే
Recommended image2
Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved