సొంత ఇంటి కల నెరవేరాలంటే ఈ పరిహారాలు తప్పక పాటించండి!
చాలా మంది సొంత ఇంటి (Own home) కోసం చాలా కలలుకంటూంటారు (Dream). కానీ సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతోంది.

చేతిలో డబ్బులు ఉన్న సొంత ఇంటి కల నెరవేర్చుకోవడంలో అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఈ ఆటంకాలన్నింటిని అధిగమించి సొంత ఇంటి కలను త్వరగా నెరవేర్చుకోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎన్నో ప్రయత్నాలు చేసి సొంత ఇంటి కల నెరవేర్చుకునే తరుణంలో ఏదో ఒక విధంగా ఆటంకాలు (Interruptions) ఎదురవుతుంటాయి. దీంతో అద్దె ఇంటిలోనే (Rental house) జీవనాన్ని గడుపుతూంటారు. అటువంటి వారికి సొంత ఇల్లు స్వప్నంగానే మిగిలిపోతుంది. ఇలా సొంత ఇంటి కోసం ప్రయత్నించేవారు అంగారకుడిని పూజించడం మంచిది. గృహానికి, రుణానికి అధిపతి అంగారకుడు.
అంగారకుడిని (Mars) ఎవరైతే నిత్యం పూజిస్తారో.. వారికి సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీంతో అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది. కనుక అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. నవగ్రహాలలో (Navagrahas) సూర్యుడు, చంద్రుడు తరువాత వచ్చేటటువంటి మూడవ గ్రహం అంగారకుడు.
అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తుంటారు. క్రిష్ణపక్షంలో (Krishnapaksha) వచ్చేటటువంటి చతుర్దశి రోజున అంగారకుని భక్తిశ్రద్ధలతో (Devotional) ఆరాధన చేయాలి. ఈయన మంగళవారానికి అధిపతి. కాబట్టి క్రిష్ణాంగారక చతుర్దశి మంగళవారం వచ్చిందంటే ఆ రోజును చాలా విశేషమైన తిథిగా భావిస్తారు.
క్రిష్ణాంగారక చతుర్దశి (Krishnangaraka Chaturdashi) ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున తప్పనిసరిగా కుజవ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించాలి. క్రిష్ణాంగారక చతుర్దశి వరకు ఆగలేని వారు ప్రతి రోజూ కుజగ్రహ ఆరాధన చేయడంతో పాటు కుజుడిని పూజించాలి. అలాగే కుజుడి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని (Subrahmanyeshwara Swamy) పూజించాలి. దీంతో త్వరగా గృహ యోగం కలుగుతుంది.
అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుజుడి అనుగ్రహం కలిగి గృహ యోగం త్వరగా కలగాలంటే మంగళవారం నియమాలను (Tuesday rules) కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మంగళవారం రోజున ఇంటిలోని ప్రతి ఒక్కరూ కందిపప్పును (Red gram) తినకూడదు. అదేవిధంగా ఎరుపుకు సంబంధించినటువంటి పువ్వులు, ఫలాలను కూడా తినకూడదు.
అయితే దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు.. కానీ మీరు మాత్రం వీటిని స్వీకరించకూడదు. ఇలా మంగళవార నియమాలను పాటిస్తే అంగారకుని అనుగ్రహం (Grace) మీకు కలుగుతుంది. దీంతో సొంత ఇంటి ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైన అవి తొలగిపోయి అన్నీ అనుకూలంగా (Compatible) మారుతాయి. దీంతో అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది.
అందుకని అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి.. మంగళవార నియమాలను క్రమం తప్పకుండా ఇంటిల్లపాదీ పాటించండి (Follow).. దీంతో సొంత ఇంటి కల త్వరగా నెరవేరడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties) కూడా తొలగిపోతాయి.