Magical Drink: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే నెల రోజుల్లో జుట్టు పెరగడం చూస్తారు
Magical Drink: జుట్టు ఊడిపోయే సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతిరోజూ ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టును పెంచుకోవచ్చు. ప్రత్యేకమైన ఈ పానీయాన్ని తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలి?

అందమైన జుట్టు కోసం
జుట్టు బలంగా, నల్లగా, పొడవుగా ఉంటేనే ఎవరైనా అందంగా కనిపిస్తారు. కొంతమంది జుట్టు కోసం సప్లిమెంట్లు వాడడం, కాస్మొటిక్ సర్జరీలు చేయించుకోవడం, రసాయనాలు కలిపిన మందులు వాడడం వంటివి చేస్తారు. ఇవి జుట్టును మరింతగా బలహీనపరిచే అవకాశం ఉంది. అలాగే అవి చాలా ఖరీదైనవి కూడా. ప్రతిరోజూ ఒక గ్లాసు ప్రత్యేకమైన డ్రింక్ తాగడం ద్వారా జుట్టును పొడవుగా, ఒత్తుగా పెంచుకోవచ్చు. మీరు ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకునే అవకాశం ఉంది. రసాయన చికిత్సలు, ఉత్పత్తులు ఉపయోగిస్తే జుట్టుపై చెడు ప్రభావం తప్ప దానిలో పెరుగుదల కనిపించదు. జుట్టు శరీరంలో పోషక లోపం వల్ల కూడా జుట్టురాలే సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి జుట్టుకు కావలసిన పోషకాలను అందించడం ద్వారా దాని పెరుగుదలను ప్రేరేపించాలి.
డ్రింక్ ఇలా చేయండి
యోగా గురువు కైలాష్ బిష్ణోయ్ చెబుతున్న ప్రకారం ఒక ప్రత్యేకమైన పానీయం మీ జుట్టును పొడవుగా పెరిగేలా చేస్తుంది. ప్రతి ఉదయం దీన్ని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఆ పానీయం ఎలా తయారు చేయాలో కూడా వివరించారు. దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్, కొన్ని ఉసిరి ముక్కలు వేసి అవి జ్యూస్ చేసుకోవాలి. తగినంత నీటిని పోయాలి. దాన్ని వడకట్టి ఆ నీటిని ప్రతి ఉదయం తాగుతూ ఉండాలి. ఇలా మీరు రెండు వారాలు తాగితే ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఒక నెల రోజులు పాటు ప్రతిరోజు తాగితే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. జుట్టు పొడవుగా, మందంగా, ఒత్తుగా కావాలనుకునేవారు జీవితాంతం ఈ పానీయాన్ని తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మెరిసే చర్మం
ఈ పానీయం కేవలం జుట్టుకే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జుట్టును బలంగా ఎదిగేలా చేసే ఈ ప్రత్యేకమైన డ్రింకు చర్మానికి మెరుపును అందిస్తుంది. ఈ డ్రింక్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. ఎప్పుడైతే రక్తం శుద్ధిగా ఉంటుందో చర్మంపై మెరుపు కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు వంటివి కూడా తగ్గుతాయి. చర్మానికి సహజమైన మెరుపు వచ్చి ముడతలు, గీతలు వంటివి రావు. మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు. కాబట్టి ఈ డ్రింక్ మీకు చర్మానికి, జుట్టుకు కలిపి ఉపయోగపడుతుంది. కేవలం ఒక రెండు వారాలు తాగి చూడండి. మీ చర్మంలో, జుట్టులో మంచి ఫలితాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి.

