Pimples: 7 రోజుల పాటు ప్రతి ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తాగితే మొటిమలు ఇట్టే మాయం
Pimples: మొటిమలతో బాధపడుతున్నవారు ఉదయాన్నే పరగడుపున ఒక ప్రత్యేకమైన డ్రింక్ తాగడం వల్ల ఆ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు. వరుసగా 7 రోజులు ఇలా తాగితే చాలు ముఖంపై మొటిమలు తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

మొటిమలు ఎందుకు వస్తాయి?
మొటిమల సమస్య ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలను వేధిస్తోంది. ముఖంపై ఉండే చర్మ రంధ్రాలు సహజంగానే 'సెబమ్' అనే నూనెను ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా నుదురు, ముక్కు, గడ్డం ప్రాంతాల్లో ఈ నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ నూనెకు మురికి, మృతకణాలు తోడైతే బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్ ఏర్పడి చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల అక్కడ మొటిమలు పుట్టుకొస్తాయి.
ఎన్ని క్రీములు వాడినా, ట్రీట్మెంట్లు తీసుకున్నా మొటిమలు మళ్లీ మళ్లీ వస్తున్నాయా? అయితే సమస్య చర్మం పైన మాత్రమే లేదని అర్థం చేసుకోండి. పదే పదే మొటిమలు వస్తున్నాయంటే మన శరీరంలోపల ఏదో అసమతుల్యత ఉందని ఇది సూచిస్తుంది.
మొటిమలను తగ్గించే అద్భుతమైన డ్రింక్
చర్మంపై మొటిమలు కనిపించడానికి చాలా ముందు నుంచే మన శరీరంలో వేడి, వాపు పెరగడం మొదలవుతుంది. వాటిిని తగ్గించడం ద్వారా మొటిమలను రాకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ వచ్చినా త్వరగా తగ్గిపోయేలా చేయవచ్చు. దీని కోసం ఒక పానీయాన్ని సిద్ధం చేసుకోవాలి.
రాత్రంతా నీటిలో నానబెట్టిన 3 లేదా 4 లవంగాలు, కొద్దిగా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా వేప ఆకుల పేస్ట్.. ఇవి తీసి రెడీగా పెట్టుకోండి. ముందుగా 3 లేదా 4 లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ లవంగాలను మెత్తగా దంచుకోండి. దానికి కొద్దిగా తేనె, నిమ్మరసం కలపండి. అలాగే కొద్దిగా వేప ఆకుల పేస్ట్ కూడా కలిపి పరగడుపున తాగండి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పదార్థాలు చాలా బాగా పనిచేస్తాయి.
మొటిమలను తగ్గించి...
ఇక్కడ చెప్పినట్టు డ్రింక్ తయారుచేసుకుని ప్రతిరోజు ఉదయం ఖాళీ పొట్టతో తాగేందుకు ప్రయత్నించండి. మన శరీరంలో వాపును తగ్గించడంతో పాటు సహజంగా శరీరాన్ని శుభ్రపరుస్తుంది. దీన్ని తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో వేడి, వాపు తగ్గిపోయి మొటిమలు మాయమవుతాయి. ఫలితంగా మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

