MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Thyroid : ఇవి థైరాయిడ్ లక్షణాలు కావొచ్చు జాగ్రత్త..

Thyroid : ఇవి థైరాయిడ్ లక్షణాలు కావొచ్చు జాగ్రత్త..

Thyroid : రోజు వారి పనులు సక్రమంగా చేసుకోవడానికి, ఇతర పనుల పట్ల ఆసక్తిని, శక్తిని కలిగి ఉండటానికి థైరాయిడ్ సక్రమంగా పనిచేయగలగాలి. అప్పుడే ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండగలుగుతాం..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 06 2022, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


Thyroid : మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడానికి థైరాయిడ్ హార్మోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతేకాదు పిల్లల మెదుడు చురుకుగా పనిచేయాలంటే వారిలో థైరాయిడ్ హార్లోన్లు సరైన మొత్తంలో ఉండాలి. అలాగే గర్భిణులు, వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ సమయంలో వారిలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ థైరాయిడ్ హార్మోన్ల వల్లే కడుపులోని పిల్లలు ఆరోగ్యం ఎదుగగలుగుతారు. 

28
Thyroid

Thyroid

థైరాయిడ్ హార్మోన్లు పెరిగే పిల్లలకు ఎంతగానో సహాయపడుతాయి. వారు శరీరర ఎదుగుదలకు ఇవి ఎంతో ఉపయోగపడగాయి. అలాగే పెద్దవారికి తమ రోజు వారి పనులను చేసేందుకు సరిపోయే శక్తిని అందిస్తాయి. అంతేకాదు పనిపట్ల ఆసక్తిని, సెక్స్ చేయాలన్నా ఆసక్తిని పెంచడంలో కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ ఎంతో అవసరం. కాగా కొంత మంది ఆడవారిలో థైరాయిడ్ సక్రమంగా పనిచేయదు. దాని వల్ల వారికి పీరియడ్స్ టైమింగ్స్ మిస్ అవుతాయి. అలాగే కడుపులో ఇబ్బందిగా అనిపించడం, తలనొప్పి, నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు కేవలం పని ఒత్తిడి వల్ల కలిగినవే అంటూ చాలా మంది వీటిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ ఈ లక్షణాలు థైరాయిడ్ సమస్య ఉందని చెప్పే సంకేతాలు కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

38

థైరాయిడ్ సమస్య ఉన్నావారిలో మొదటిగా కనిపించే లక్షణం నీరసం. తరచుగా నీరసంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం.

48

జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చినా థైరాయిడ్ గానే అనుమానించాలి. కడుపు ఉబ్బరంగా అనిపించడం, మలబద్దకం, డయేరియా వంటి సమస్యలు థైరాయిడ్ లక్షణాలు కూడా కావొచ్చు.
.

58

ఉన్నట్టుండి బరువు తగ్గినా, పెరిగినా అనుమానించాల్సిందే. ఎందుకంటే జీవక్రియలను థైరాయిడ్ గ్రంది నియంత్రిస్తుంది. కాబట్టి మీరు ఉన్నట్టుండి బరువు తగ్గుతుంటే హైపర్ థైరాయిడిజం గా గుర్తించాలి. అదే బరువు పెరిగితే హైపోథైరాయిడిజంగా భావించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కోసారి మనలో మెటబాలిజం లెవెల్స్ తగ్గడం లేదా పెరగడం ద్వారా కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. 
 

68


శరీర పనితీరులో హార్మోన్ల ఎఫెక్ట్ ఎలా అయితే ఉంటుందో.. మానసిక పనితీరుపై కూడా అంతే మొత్తంలో హార్మోన్ల ప్రభావం ఉంటుందట. కాబట్టి మీకు కారణం లేకుండా మూడ్ ఆఫ్ లో ఉంటే థైరాయిడ్ సమస్య వచ్చినట్టుగానే భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 

78


శరీర పనితీరులో హార్మోన్ల ఎఫెక్ట్ ఎలా అయితే ఉంటుందో.. మానసిక పనితీరుపై కూడా అంతే మొత్తంలో హార్మోన్ల ప్రభావం ఉంటుందట. కాబట్టి మీకు కారణం లేకుండా మూడ్ ఆఫ్ లో ఉంటే థైరాయిడ్ సమస్య వచ్చినట్టుగానే భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 

88

థైరాయిడ్ మనకు సోకిందనే విషయాన్ని మన ఆకలే చెబుతుంది. ఎలా అంటే ఇది ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపించదు. బరువు పెరగడం, తగ్గడం వంటి వాటితో సంబంధం లేకుండా ఆకలి వేయదు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యలను సంప్రదించి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆహారం
ఆరోగ్యం
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు
Recommended image2
Spring Onion Benifits: ఆహారంలో ఇవి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Baby Anklets: 15 గ్రాముల్లో చిన్నారుల కోసం వెండి పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved