MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • IRCTC Coffee with Karnataka : ఈ వానాకాలంలో అందమైన కాఫీ తోటలు చుట్టిరండి, బడ్జెట్లోనే హైదరాబాద్ నుండి కూర్గ్, మైసూర్ ట్రిప్

IRCTC Coffee with Karnataka : ఈ వానాకాలంలో అందమైన కాఫీ తోటలు చుట్టిరండి, బడ్జెట్లోనే హైదరాబాద్ నుండి కూర్గ్, మైసూర్ ట్రిప్

ఐర్సిటిసి హైదరాబాద్ నుండి దేశంలోని అనేక ప్రాంతాలను టూర్ ప్లాన్స్ రెడీ చేసింది. ఇందులో ఈ వర్షాకాలం ప్రయాణానికి కేవలం తెలుగువారికే సరిగ్గా సరిపోయే ప్యాకేజీ ఒకటుంది. అదే ‘కాఫీ విత్ కర్ణాటక’. 

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 15 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాఫీ విత్ కర్ణాటక టూర్..
Image Credit : gemini

కాఫీ విత్ కర్ణాటక టూర్..

Coffee with Karnataka : వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి అందాలు రెట్టింపు అవుతాయి. ఎండాకాలంలో బీడుబారిన భూములు పచ్చని చీరకట్టినట్లు మారిపోతాయి... చెట్లు కొత్త చిగుర్లు తొడుక్కుంటాయి. వరదనీటితో జలజలాపారే నదులు... నిండుకుండలా మారే చెరువులు, వాగులు... కొండలపైనుండి జాలువారే జలపాతాలు... ఆ అందాలు కనువిందు చేస్తాయి. ఇలా వర్షాకాలంలో సరికొత్త అందాలతో పర్యాటకులకు ఆకట్టుకునే ప్రాంతమే కర్ణాటకలోని కూర్గ్.

మైసూరు సమీపంలోని కూర్గ్ అందమైన హిల్ స్టేషన్. కొండ అంచుల్లో అందమైన కాఫీ తోటలతో కూడిన ఈ ప్రాంతాన్ని ''ఇండియన్ స్కాట్లాండ్'' అంటారు. కావేరీ నది ఒడ్డున అందమైన ప్రాంతాలు, జలపాతాలు ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాలను కవర్ చేసేలా IRCTC టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేవలం రూ.11260 కే కూర్గ్, మైసూర్ టూర్
Image Credit : chat gpt

కేవలం రూ.11260 కే కూర్గ్, మైసూర్ టూర్

IRCTC (ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రతి బుధవారం హైదాబాద్ నుండి కర్ణాటకలోని ప్రాంతాలను చుట్టివచ్చేలా టూర్ ప్లాన్ ప్రకటించింది. కాఫీ విత్ కర్ణాటక పేరిట ప్రకటించిన ఈ వీకెండ్ టూర్ ప్యాకేజీలో కూర్గ్, మైసూరు అందాలను చుట్టిరావచ్చు. కేవలం రూ.11260 కే 5 రాత్రులు/6 రోజుల టూర్ ఉంటుంది. ట్రైన్ (స్లీపర్/3AC), రోడ్డు ప్రయాణం ఉంటుంది. తెలుగు ప్రజలు వర్షాకాలంలో ఈ టూర్ కి వెళితే ఏడాదికి సరిపడా అనుభూతులు పొందవచ్చు.

Related Articles

Related image1
IRCTC Maharashtra Tour Package : కేవలం రూ.5770 కే మహారాష్ట్ర టూర్.. షిరిడి, త్రయంబకేశ్వర్, పంచవటి, నాసిక్ యాత్ర
Related image2
IRCTC Godavari Temple Tour : కేవలం రూ.5670 కే 4 రోజుల వీకెండ్ టూర్.. హైదరాబాద్ నుండి ఈ ఆంధ్రా ఆలయాలు, అందాలను చుట్టిరండి
35
IRCTC కాఫీ విత్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ధరలివే...
Image Credit : chat gpt

IRCTC కాఫీ విత్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ధరలివే...

ఐఆర్సిటిసి కాఫీ విత్ కర్ణాటక టూర్ కోసం రెండు రకాల ప్యాకేజీలు సిద్దంచేసింది.

1 నుండి 3 ప్రయాణికుల ప్యాకేజీ ధరలు

కంఫర్ట్ (3ఏసి) ప్యాకేజీ

సింగిల్ షేరింగ్ : రూ.35110

ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.19750

ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.15400

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.10950

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.9700

స్టాండర్డ్ (SL) ప్యాకేజీ

సింగిల్ షేరింగ్ : రూ.33080

ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.17720

ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.13370

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.8920

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.7670

4 నుండి 6 ప్రయాణికుల ప్యాకేజీ ధరలు

కంఫర్ట్ (3ఏసి) ప్యాకేజీ

ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.16160

ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.13770

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.10950

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.9700

స్టాండర్డ్ (SL) ప్యాకేజీ

ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.14130

ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.11750

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.8920

అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.7670

45
IRCTC కాఫీ విత్ కర్ణాటక టూర్ ఎలా సాగుతుంది?
Image Credit : Asianet News

IRCTC కాఫీ విత్ కర్ణాటక టూర్ ఎలా సాగుతుంది?

Day 1 (బుధవారం) 

 కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రంతా కాచిగూడ-మైసూరు ఎక్స్ ప్రెస్ లో జర్నీ ఉంటుంది.

Day 2 (గురువారం)

ఉదయమే మైసూరుకు చేరుకుంటారు. అక్కడినుండి 115 కిలోమీటర్ల దూరంలోని కూర్గ్ కు మధ్యాహ్నం వరకు చేరుకుంటారు. హోటల్లో ప్రెష్ అప్ అయ్యాక అబ్బేయ్ ఫాల్స్, ఓంకారేశ్వర ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి కూర్గ్ లోనే బస చేయాలి

Day 3 (శుక్రవారం) 

కూర్గ్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ అనంతరం తలకావేరి, భాగమండల సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం రాజాస్ సీట్ విజిట్ ఉంటుంది. రాత్రి కూర్గ్ లో బస.

Day 4 (శనివారం)

హోటల్లో టిఫిన్ చేసి మైసూరుకు బయలుదేరాలి. మార్గమధ్యలో కావేరీ నిసర్గధామ, టిబెటన్ మానస్టెరీ, బృందావన గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రి మైసూరు హోటల్లో బస ఉంటుంది.

Day 5 (ఆదివారం)

మైసూరు హోటల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం చాముండి హిల్స్ సందర్శన ఉంటుంది. ప్రఖ్యాత మైసూరు ప్యాలస్ అందాలను ఆస్వాదించాలి. మధ్యాహ్నం మైసూరు రైల్వే స్టేషన్ నుండి హైదరాబాద్ కు తిరుగుపయనం ఉంటుంది.

Day 6 (సోమవారం)

కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.

55
IRCTC కాఫీ విత్ కర్ణాటక ప్యాకేజీలో కల్పించే సదుపాయాలివే....
Image Credit : stockPhoto

IRCTC కాఫీ విత్ కర్ణాటక ప్యాకేజీలో కల్పించే సదుపాయాలివే....

ఈ కాఫీ విత్ కర్ణాటక ప్యాకేజీ కింద ఐఆర్సిసిటిసి రైలు టికెట్లు, వెహికిల్ ఖర్చులు, బ్రేక్ ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సందర్శన టికెట్లు యాత్రికులే భరించాలి. లంచ్, డిన్నర్ తో పాటు స్నాక్స్ వంటివి కూడా యాత్రికులే సమకూర్చుకోవాలి. రైల్లో భోజనం కూడా ప్రయాణికులదే. టూర్ గైడ్ తో పాటు ఇతర ఏ సర్వీసులైనా యాత్రికులు సొంతంగా భరించుకోవాలి.

ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీల వివరాల కోసం కాంటాక్ట్ చేయండి.

ఐఆర్సిటిసి - సౌత్ సెంట్రల్ జోన్,

9-1-129/1/302,3rd ప్లోర్, ఆక్స్ ఫార్డ్ ప్లాజా

S.D రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.

మొబైల్ నంబర్ : 8287932229/ 8287932228/ 9701360701

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bengaluru Food: బెంగళూరు వెళితే ఈ 10 ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు
Recommended image2
Silver Necklace: ఫ్యాషన్‌ కోరుకునేవారికి ఈ సిల్వర్ నెక్లెస్ లు బెస్ట్!
Recommended image3
Bridal Jewellery: ఈ ఒక్క హాత్ ఫుల్ డిజైన్ తో సింపుల్ బ్రైడల్ లుక్
Related Stories
Recommended image1
IRCTC Maharashtra Tour Package : కేవలం రూ.5770 కే మహారాష్ట్ర టూర్.. షిరిడి, త్రయంబకేశ్వర్, పంచవటి, నాసిక్ యాత్ర
Recommended image2
IRCTC Godavari Temple Tour : కేవలం రూ.5670 కే 4 రోజుల వీకెండ్ టూర్.. హైదరాబాద్ నుండి ఈ ఆంధ్రా ఆలయాలు, అందాలను చుట్టిరండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved