MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Potato Storage: మొలకలు రాకుండా బంగాళాదుంపలు నెల రోజుల పాటూ ఇలా నిల్వ చేయండి

Potato Storage: మొలకలు రాకుండా బంగాళాదుంపలు నెల రోజుల పాటూ ఇలా నిల్వ చేయండి

Potato Storage: ఎండలు ముదిరిపోతున్నాయి.  బంగాళాదుంపలు ఒకేసారి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మొలకలు త్వరగా వచ్చేస్తాయి. బంగాళాదుంపలు మొలకలు రాకుండా ఉండాలంటే వాటిని ఎలా నిల్వ చేయాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 15 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగాళాదుంప స్టోరేజి టిప్స్
Image Credit : Getty

బంగాళాదుంప స్టోరేజి టిప్స్

వేడుక ఏదైనా విందులో మాత్రం కచ్చితంగా బంగాళాదుంప ఉండాల్సిందే. ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్న ఆలుగడ్డ వేపుడు తింటే ఆ రుచే వేరు, అందుకే ప్రతి ఇంట్లో బంగాళాదుంపలు ఉంటాయి. ఆలు టిక్కా నుంచి సాంబార్ వరకు అన్నింట్లోనూ దీన్ని వాడతాం. అందుకే చాలా ఇళ్లలో కేజీ నుంచి రెండు మూడు కేజీలు ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. కానీ తెచ్చిన కొద్ది రోజులకే బంగాళాదుంపలకు మొలకలొచ్చి మెత్తగా మారిపోతాయి. అలాంటి వాటిని తినడం కూడా మంచిది కాదు. బంగాళాదుంపలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
పచ్చని బంగాళాదుంప
Image Credit : Getty

పచ్చని బంగాళాదుంప

ఆలుగడ్డ పాడైనా కూడా ఆ విషయం చాలా మందికి తెలియక వండేస్తూ ఉంటారు. మొలకలు వచ్చిన బంగాళాదుంపలు, ముఖ్యంగా ఆకుపచ్చ రంగు వచ్చిన దుంపలు తినడం మంచిది కాదు. చిన్నగా మొలకలు వస్తే వాడేయొచ్చు. దుంప పచ్చగా మారినా, దానిపై తెల్లటి బూజు పట్టినా, చెడు వాసన వస్తున్నా వెంటనే పడేయాలి. మరీ మెత్తగా, ముడతలు పడి నీరు కారుతున్నా కూడా ఆ దుంపలు వాడటానికి పనికిరావు.

బంగాళాదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం చాలా ముఖ్యం. మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉండే చోట వీటిని పెట్టకూడదు. ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. తీవ్రమైన వేడికి దుంపలు త్వరగా ఎండిపోయి మొలకలు వస్తాయి. వంటగదిలోని అల్మరాలో వీటిని పెట్టడం మంచిది.

Related Articles

Related image1
Sobhita Dhulipala: ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్న శోభిత.. నేటి హీరోయిన్లకు రోల్ మోడల్
Related image2
Venus Jupiter Conjuction: శుక్ర గురు గ్రహాల ద్విదశ యోగం.. ఈ 4 రాశుల వారు ధన వర్షానికి సిద్ధమైపోండి
34
సూర్యకాంతి పడనివ్వకండి
Image Credit : Getty

సూర్యకాంతి పడనివ్వకండి

బంగాళాదుంపలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే, వాటిపై నేరుగా సూర్యరశ్మి పడనివ్వకూడదు. ఎండ తగలడం వల్ల దుంపలు పచ్చగా మారతాయి, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే బంగాళాదుంపలను ఎప్పుడూ చీకటిగా ఉండే చోట పెట్టాలి. పేపర్ బ్యాగులు, కార్డ్‌బోర్డ్ పెట్టెలు లేదా మూసివున్న అల్మరాల్లో నిల్వ చేయడం ఉత్తమం.

బంగాళాదుంపలను గాలి బాగా తగిలే ప్రదేశంలో నిల్వ చేయాలి. వాటిని బుట్టలో, మూతలేని డబ్బాలో లేదా పేపర్ బ్యాగ్‌లో పెట్టడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లలో లేదా గాలి చొరబడని కంటైనర్లలో అస్సలు పెట్టొద్దు.

44
ఫ్రిజ్ లో పెట్టవచ్చా?
Image Credit : Getty

ఫ్రిజ్ లో పెట్టవచ్చా?

చాలామంది బంగాళాదుంపలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెడతారు. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి రుచి, ఆకృతి రెండూ పాడవుతాయి. ఒకవేళ మీరు దుంపలను కోసినా లేదా తొక్క తీసినా, వాటిని నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. కానీ అలా ఎక్కువసేపు ఉంచలేరు. 24 గంటల్లోపే వాటిని వాడేయాలి.

ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి కొంతమంది ఒకే డబ్బాలో పెడతారు.  చాలా ఇళ్లలో ఉల్లిపాయల పక్కనే ఆలుగడ్డల బుట్ట ఉంటుంది. కానీ ఉల్లిపాయల నుంచి వెలువడే వాయువు వల్ల బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తి పాడైపోతాయి. అందుకే, ఈ రెండింటినీ వేర్వేరుగా నిల్వ చేయడం చాలా మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 30 వేల‌తో మొద‌లై నెల‌కు రూ. 30 ల‌క్ష‌లు.. అవినాష్ స‌క్సెస్ స్టోరీ, ఇలా చేస్తే మీకు కూడా సాధ్య‌మే
Recommended image2
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు
Recommended image3
Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి
Related Stories
Recommended image1
Sobhita Dhulipala: ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్న శోభిత.. నేటి హీరోయిన్లకు రోల్ మోడల్
Recommended image2
Venus Jupiter Conjuction: శుక్ర గురు గ్రహాల ద్విదశ యోగం.. ఈ 4 రాశుల వారు ధన వర్షానికి సిద్ధమైపోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved