MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Dry Fruits Storage: డ్రై ఫ్రూట్స్ మెత్తబడుతున్నాయా? ఇలా చేస్తే నెలలపాటు ఫ్రెష్ గా ఉంటాయి!

Dry Fruits Storage: డ్రై ఫ్రూట్స్ మెత్తబడుతున్నాయా? ఇలా చేస్తే నెలలపాటు ఫ్రెష్ గా ఉంటాయి!

Dry Fruits Storage: డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు. కానీ వీటిని కొనుగోలు చేసిన కొన్నిరోజులకే మెత్తబడటం, పాడైపోవడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని సింపుల్ టిప్స్ తో, డ్రై ఫ్రూట్స్ ని నెలల పాటు ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : May 02 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డ్రై ఫ్రూట్స్ నిల్వ చేసే విధానం
Image Credit : Asianet News

డ్రై ఫ్రూట్స్ నిల్వ చేసే విధానం

డ్రై ఫ్రూట్స్ పోషకాలు నిండిన సూపర్ ఫుడ్‌. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. శక్తిని పెంచడం నుంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వరకు డ్రై ఫ్రూట్స్ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సరైన మోతాదులో వీటిని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

అయితే వచ్చిన సమస్యల్లా వీటిని స్టోర్ చేయడమే. చాలామంది వీటిని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. సరిగ్గా స్టోర్ చేయకపోతే త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో డ్రై ఫ్రూట్స్ ని కొన్ని నెలలపాటు తాజాగా ఉంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎయిర్ టైట్ బాక్సుల వాడకం
Image Credit : Getty

ఎయిర్ టైట్ బాక్సుల వాడకం

సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ని సరిగ్గా స్టోర్ చేయకపోతే త్వరగా మెత్తబడటం, వాసన రావడం లేదా బూజు పట్టడం లాంటివి జరుగుతుంటాయి. అలా జరగకూడదంటే డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి ఎప్పుడూ గాలి చొరబడని (ఎయిర్‌టైట్) డబ్బాలనే వాడాలి. మీరు మామూలు డబ్బాల్లో పెడితే, గాలి తగిలి అవి త్వరగా మెత్తబడిపోతాయి. ఎయిర్‌టైట్ డబ్బాల్లో ఆక్సిజన్ తగలడం తగ్గి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.

Related Articles

Related image1
Curd: ఎండాకాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టొచ్చా? పెడితే ఎన్ని రోజుల్లోపు వాడాలి?
Related image2
Instant Mango Pickle: ఈ సింపుల్ టిప్స్ తో మామిడికాయ పచ్చడిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు!
35
చల్లగా, పొడిగా ఉండే ప్లేస్ లో..
Image Credit : unsplash

చల్లగా, పొడిగా ఉండే ప్లేస్ లో..

డ్రై ఫ్రూట్స్‌ను ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉండే చోట పెట్టాలి. వేడి తగిలితే బూజు వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ అది తప్పు. వంటగదిలోని షెల్ఫ్‌లలో సూర్యరశ్మి పడని, చల్లగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవడం మంచిది.

45
కొద్దిగా వేయించి స్టోర్ చేయడం
Image Credit : Google

కొద్దిగా వేయించి స్టోర్ చేయడం

డ్రై ఫ్రూట్స్ పాడయ్యే సూచనలు కనిపిస్తే, వాటిని కొద్దిగా వేయించి (టోస్ట్ చేసి) మళ్లీ స్టోర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఓవెన్ ఉంటే, నాలుగు నుంచి ఐదు నిమిషాలు టోస్ట్ చేయండి. ఓవెన్ లేకపోతే, ఓ బాణలిలో వేసి చిన్న మంటపై వేయించుకోవచ్చు. ఇలా చేస్తే అవి మళ్లీ కరకరలాడతాయి.

55
ప్లాస్టిక్ డబ్బాలు వద్దు..
Image Credit : Asianet News

ప్లాస్టిక్ డబ్బాలు వద్దు..

డ్రై ఫ్రూట్స్‌ని ప్లాస్టిక్ డబ్బాల్లో అస్సలు పెట్టకూడదు. ప్లాస్టిక్‌ డబ్బాలో పెడితే అవి త్వరగా పాడయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి వాటికి బదులు,  గాజు సీసాలు వాడటం మంచిది. ముఖ్యంగా, వెలుతురు లోపలికి వెళ్లని రంగు సీసాలు వాడటం ఇంకా మంచిది. దీనివల్ల డ్రై ఫ్రూట్స్ తాజాదనం ఎక్కువ రోజులు నిలుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Curd: ఎండాకాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టొచ్చా? పెడితే ఎన్ని రోజుల్లోపు వాడాలి?
Recommended image2
Instant Mango Pickle: ఈ సింపుల్ టిప్స్ తో మామిడికాయ పచ్చడిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved