సెక్స్ సమయంలో కండరాల తిమ్మరి వస్తోందా? తగ్గాలంటే ఇలా చేయండి..
సెక్స్ ను పూర్తిగా ఆస్వాదించాలంటే కండరాల తిమ్మిరి అడ్డొస్తోందా? నిజానికి ఈ నొప్పి వల్ల చాలా మంది సెక్స్ ను మధ్యలోనే ఆపేస్తారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
కండరాల తిమ్మిరి ప్రత్యేకించి లైంగిక జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. అయితే చాలా మంది ఆడవారు తమ పీరియడ్స్ కారణంగానే ఈ సమస్య వస్తుందని అనుకుంటారు. కొన్ని సార్లే అలా జరుగుతుంది. నిజానికి సెక్స్ సమయంలో తిమ్మిరి రావడం సర్వ సాధారణ విషయం. ముఖ్యంగా సెక్స్ సమయంలో పాదాలు లేదా కాళ్ళలో తిమ్మిరి వస్తుంటుంది. కొన్నిసార్లు పొత్తికడుపులో కూడా తిమ్మిరి వస్తుంది. అసలు సెక్స్ సమయంలో కండరాల తిమ్మరి ఎందుకు కలుగుతుంది? దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సెక్స్ సమయంలో కండరాల తిమ్మిరి ఎందుకు వస్తుంది?
ఫస్ట్ టైం సెక్స్ సమయంలో తిమ్మిరి కలగడం సర్వ సాధారణ విషయం. కొన్నిసార్లు మీరు భావప్రాప్తి పొందినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. మరికొన్నిసార్లు ఇది మీ శరీరంలో అసమతుల్యత వల్ల కలగొచ్చు. సెక్స్ సమయంలో మీరు కలిగే కొన్ని సాధారణ సమస్యలు..
నిర్జలీకరణం
కండరాల అలసట
అధిక చెమట
సెక్స్ సమయంలో కండరాల తిమ్మిరి రాకూడదంటే ఇలా చేయండి
స్థానాలను మార్చండి
సెక్స్ భంగిమలను మార్చడం వల్ల తిమ్మిరి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అయితే కొత్త పద్ధతులను అవలంబించడం, మీ కండరాలపై ఎక్కువ ఒత్తిడి తేవడం వల్ల కండరాల తిమ్మిరి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితిలో మీరు ఎక్కువ ఒత్తిడి లేదా బలం అవసరం లేని స్థానాలను ఎంచుకోండి.
మీ ఆహారంలో మార్పులు చేయండి
మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ శరీరంలో పొటాషియం లోపిస్తే కూడా కండరాల బలం తగ్గుతుంది. కండరాల తిమ్మిరి సమస్య వస్తుందని మీకు తెలుసా? పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తిమ్మిరి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అరటిపండ్లు, నారింజ, బంగాళాదుంపలు, టమోటాలు, పనీర్, పైనాపిల్ వంటి పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి.
విటమిన్ ఇ
విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే కండరాల తిమ్మిరి వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. ఈ పోషకం సోయాబీన్స్, నువ్వులు, ఆలివ్ తో సహా అనేక గింజలు, పండ్లు, వివిధ రకాల నూనెలలో పుష్కలంగా ఉంటుంది. ఇది బ్రోకలీ, బచ్చలికూర వంటి ఆకుకూరలలో కూడా ఉంటుంది.
విటమిన్ బి కాంప్లెక్స్
ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు ఏదో ఒక పోషక లోపం మనపై తీవ్రమైన ప్రభావాలను చూపిస్తుంది. ముఖ్యంగా మన శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి కలుగుతుంది. గుడ్లు, చేపలు, ఓట్ మీల్, వేరుశెనగ, సోయాబీన్ మొదలైన వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి కాకుండా విటమిన్ బి కాంప్లెక్స్ లోపం కూడా కండరాల తిమ్మిరిని కలిగిస్తుంది. అందుకే ఈ విటమిన్ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి.
ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఇవే కాకుండా.. మీ కండరాలను బలోపేతం, మీ లైంగిక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడానికి ఇలా చేయండి..
నీళ్లను ఎక్కువగా తాగండి.
ఫోర్ ప్లే లేకుండా సెక్స్ చేయకండి.
రెగ్యులర్ గా వ్యాయామం చేయండి
ధూమపానం మానుకోండి
ఆల్కహాల్ ను తీసుకోవడం పరిమితం చేయండి
నిజానికి నేరుగా సెక్స్ చేస్తున్నప్పుడు కండరాల నొప్పులు రావడం చాలా సహజం. అందుకే కండరాల తిమ్మిరి వంటి సమస్యలను నివారిస్తేనే మీరు శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు.