Coconut Oil: ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారీ.. చాలా సింపుల్ ప్రాసెస్!
Coconut Oil: సాధారణంగా చాలామంది కొబ్బరి నూనెను బయట కొనుగోలు చేస్తుంటారు. దీని తయారీ చాలా కష్టం అనుకుంటారు. కానీ ఇంట్లోనే చాలా సింపుల్ గా, ఈజీగా స్వచ్ఛమైన కొబ్బరినూనెను తయారుచేసుకోవచ్చు. మరి లేటెందుకు ఆ ప్రాసెస్ గురించి తెలుసుకుందామా…
15

Image Credit : Gemini Ai
కొబ్బరి నూనె తయారీ విధానం
ప్రస్తుతం ఎక్కడ చూసినా చాలా పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా వంట నూనె, కొబ్బరి నూనె వంటివాటిలో కల్తీ ఎక్కువగా జరుగుతోంది. మరి అలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే కొబ్బరినూనెను ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది. దానికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే కొబ్బరితో స్వచ్ఛమైన నూనెను తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : Gemini Ai
కొబ్బరి పాలు తీయడం
- బాగా ఎండిన కొబ్బరికాయలను పగలగొట్టి, లోపల ఉండే కొబ్బరిని ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలను శుభ్రం చేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- రుబ్బిన కొబ్బరిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా పిండితే చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఆ తర్వాత మళ్లీ తగినన్ని నీళ్లు పోసి రుబ్బి, రెండోసారి కూడా పాలు తీసి పక్కన పెట్టుకోవాలి.
35
Image Credit : Gemini Ai
పాలను పులియబెట్టడం
- తీసిన కొబ్బరి పాలను ఒక పల్చటి వస్త్రం లేదా జల్లెడతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన పాలను మూత ఉన్న గిన్నెలో పోసుకోవాలి.
- ఆ గిన్నెను సుమారు 8 గంటల పాటు గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి. అప్పుడు పాలు సహజంగానే పులుస్తాయి.
- 8 గంటల తర్వాత ఆ గిన్నెను తీసుకెళ్లి ఒక 2 గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి పాలలో ఉండే కొవ్వు అంతా పైకి తేలుతుంది.
45
Image Credit : Gemini Ai
నూనెను కాగబెట్టడం
- ఫ్రిజ్ నుంచి గిన్నెను బయటకు తీశాక, పైన పేరుకున్న కొవ్వును మాత్రమే జాగ్రత్తగా తీసి ఒక కడాయిలో వేయాలి.
- దీన్ని సన్నని మంట మీద వేడి చేస్తుంటే, అందులోని తేమ అంతా పోయి నెమ్మదిగా నూనె వేరు కావడం మొదలవుతుంది.
- కొబ్బరి పిప్పి లేత గోధుమ రంగులోకి మారే వరకు సన్నని మంట మీదే కాగబెట్టాలి.
- నూనె బాగా తేలిన తర్వాత స్టవ్ ఆపేసి కాసేపు చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత వడకట్టి, తడి లేని శుభ్రమైన గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.
55
Image Credit : stockPhoto
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- వాతావరణాన్ని బట్టి కొబ్బరి పాలు పులియడానికి పట్టే సమయం మారొచ్చు.
- ఒకవేళ పాలలో దుర్వాసన వచ్చినా, బూజు పట్టినా, రంగు మారినా వాటిని వాడకూడదు.
- ఎప్పుడూ సన్నని మంటపైనే నూనెను కాగబెట్టాలి.
- తయారు చేసిన నూనె పూర్తిగా చల్లారాకే, తడి లేని శుభ్రమైన గాజు సీసాలో పోసి దాచుకోవాలి.
- ఇలా ఇంట్లోనే ఎంతో సువాసన వచ్చే కొబ్బరి నూనెను తయారు చేసుకొని వాడుకోవచ్చు. మరి ఆలస్యమెందుకు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
Latest Videos

