MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Ginger Garlic Paste: ఇదొక్కటి కలిపితే... అల్లం వెల్లుల్లి పేస్టు 6 నెలలైనా ఫ్రెష్ గా ఉంటుంది..!

Ginger Garlic Paste: ఇదొక్కటి కలిపితే... అల్లం వెల్లుల్లి పేస్టు 6 నెలలైనా ఫ్రెష్ గా ఉంటుంది..!

Ginger Garlic Paste: చాలా రకాల వంటలకు అల్లం, వెల్లుల్లి పేస్టు మంచి రుచిని అందిస్తుంది. అయితే, అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదా? ఈ చిట్కా ఫాలో అయితే సరిపోతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 13 2026, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అల్లం వెల్లుల్లి పేస్టు..
Image Credit : others

అల్లం వెల్లుల్లి పేస్టు..

చికెన్, పన్నీర్ కర్రీ దగ్గర నుంచి.. బిర్యానీల వరకు.. రుచి పెరగాలంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్టు పడాల్సిందే. కేవలం రుచి మాత్రమే కాదు.. కమ్మనైనా వాసన కూడా ఇస్తుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ లో ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు రుబ్బుకోవాలి అంటే కుదిరే అవకాశమే లేదు. అందుకే, ముందుగానే.. ఈ పేస్టును తయారు చేసుకొని నిల్వ చేసుకుంటూ ఉంటారు. కానీ, సరిగా నిల్వచేయకపోతే... వెంటనే పాడైపోతుంది. వాసన కూడా రాదు. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే... అల్లం వెల్లుల్లి పేస్టు 6 నెలలు అయినా.. తాజాగా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అల్లం, వెల్లుల్లి పేస్టు తయారీ విధానం...
Image Credit : stockPhoto

అల్లం, వెల్లుల్లి పేస్టు తయారీ విధానం...

కావాల్సిన పదార్థాలు... అల్లం 250 గ్రాములు( పైన పొట్టు తీసి, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి), వెల్లుల్లి 250 గ్రాములు ( పొట్టు తీసినది), ఉప్పు 1 టేబుల్ స్పూన్, అర టీ స్పూన్ పసుపు, వంట నూనె 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు.

తయారీ విధానం...

క్లీనింగ్, డ్రైయ్యింగ్.. అల్లాన్ని బాగా కడిగి పొట్టు తీసిన తర్వాత, ఒక పొడి క్లాత్ పై ఆరబెట్టాలి. తడి కొంచెం కూడా లేకుండా.. పూర్తిగా ఆరబెట్టాలి. వెల్లుల్లి రెబ్బలను వొలుచుకుని, వాటిని కూడా తడి లేకుండా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పాడవ్వకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే.. నీరు పొరపాటున కూడా తగలకూడదు. కాబట్టి, రెండూ పూర్తిగా పొడిగా ఉంచుకోవాలి. తర్వాత, అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న ముక్కలుగా కోయడం వల్ల మెత్తటి పేస్టులా మెదుగుతుంది. మిక్సీ జార్‌లో కోసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇవి మెత్తగా మెదగాలంటే.. నీరు పోయకూడదు. నీటికి బదులుగా, అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. మిక్సీని ఒకేసారి తిప్పకుండా, పల్స్ మోడ్‌లో ఆపుతూ ఆపుతూ మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.

33
ఎలా స్టోర్ చేయాలి?
Image Credit : stockPhoto

ఎలా స్టోర్ చేయాలి?

ఈ అల్లం వెల్లుల్లి పేస్టులో ఉప్పు వేయడం వల్ల ప్రిజర్వేటివ్ గా పని చేసి బాక్టీరియా చేరకుండా చూస్తుంది. దీనిలో పసుపు వేయడం వల్ల... అల్లం వెల్లుల్లి పేస్టు రంగు మారకుండా, ఫ్రెష్ గా ఉంచడంలో సహాయపడుతుంది. నూనె వేయడం వల్ల.. అల్లం వెల్లుల్లి పేస్టుకు మంచి టెక్స్చర్ ఇవ్వడమే కాకుండా.. గాలి తాకకుండా సీల్ చేస్తుంది. అంతేకాదు, నీరు వేయడం వల్ల తొందరగా బూజు పట్టేస్తుంది. అందుకే.. నీరు వేయకుండా.. నూనె వేసి ఈ పేస్టు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పేస్టుని..గాజు కంటైనర్ లో స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. రోజువారీ వాడకం కోసం ఫ్రిజ్ నార్మల్ షెల్ఫ్‌లో పెడితే 3 నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు.

ఐస్ ట్రేలో వేసి క్యూబ్స్‌లా చేసి, జిప్‌లాక్ కవర్లలో వేసి ఫ్రీజర్‌లో పెడితే 6 నెలల పైన నాణ్యత తగ్గకుండా ఉంటుంది. సేవ్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ని రెగ్యులర్ గా వాడుకునేటప్పుడు.. తడి స్పూన్ మాత్రం వాడకూడదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ తాజా సువాసనతో, మార్కెట్లో దొరికే దానికంటే సురక్షితంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Paya: చిక్కటి మటన్ పాయా ఇలా వండారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు.. ఇడ్లీ, దోశెతో అదిరిపోతుంది
Recommended image2
Pearl Choker:మెడ నిండుగా ముత్యాల చోకర్...చూడటానికి రెండు కళ్లు సరిపోవు
Recommended image3
Gold Mangalsutra: చీరల మీదకు సూపర్ గా సెట్ అయ్యే బంగారు మంగళసూత్రాలు!
Related Stories
Recommended image1
Curd: కేవలం గంటలో పాలను గడ్డ పెరుగులా మార్చేయచ్చు..ఈ సింపుల్ చిట్కా తెలిస్తే చాలు..!
Recommended image2
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved