MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Unsolved Mysteries: ప్రపంచంలో ఇప్పటికీ పరిష్కారం కాని 7 మిస్టరీలు.. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కని రహస్యాలివే!

Unsolved Mysteries: ప్రపంచంలో ఇప్పటికీ పరిష్కారం కాని 7 మిస్టరీలు.. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కని రహస్యాలివే!

Unsolved Mysteries: మనిషి ఎంత డెవలప్ అయినా కొన్ని ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎన్నో పరిశోధనలు చేసినా కొన్ని రహస్యాలు మాత్రం అంతుచిక్కకుండా మిగిలిపోయాయి. వాటిలో ఈ 7 రహస్యాలు గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 22 2026, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డయాట్లోవ్ పాస్ ఘటన – అసలు ఏం జరిగింది?
Image Credit : gemini ai

డయాట్లోవ్ పాస్ ఘటన – అసలు ఏం జరిగింది?

1959లో రష్యాలోని ఉరల్ పర్వత ప్రాంతంలో స్కీయింగ్‌కు వెళ్లిన తొమ్మిది మంది యువకులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారి టెంట్ లోపలి నుంచి చిరిగిపోయి ఉంటుంది. కొందరు తీవ్రమైన గాయాలతో కనిపించడం అప్పట్లో పెద్ద మిస్టరీగా మారింది. మంచు కొండలు, భయంకర వాతావరణం, ఇతర అనేక కారణాలు చర్చల్లోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి అంశానికి ఇప్పటికీ ఒకే ఒక్క సమాధానం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వోయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్ – ఈ పుస్తకంలో ఏం రాశారు?
Image Credit : gemini ai

వోయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్ – ఈ పుస్తకంలో ఏం రాశారు?

శతాబ్దాల నాటి ఓ వింత పుస్తకం ఇప్పటికీ భాషా నిపుణులకు సవాలుగా నిలుస్తోంది. దీనినే వోయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్ అంటారు. ఇందులో గుర్తుపట్టలేని లిపితో పాటు మొక్కలు, ఖగోళ వస్తువులు, వింత ఆకృతులు ఉన్నాయి. ఈ పుస్తకం ఏ భాషలో రాశారు? ఎవరు రాశారు? అసలు అందులో ఉన్న సమాచారానికి అర్థం ఏమిటి? అనే ప్రశ్నలకు ఇప్పటికీ కచ్చితమైన సమాధానం లేదు.

Related Articles

Related image1
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి
Related image2
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?
35
మేరీ సెలెస్టే – సిబ్బంది ఎక్కడికి వెళ్లారు?
Image Credit : gemini ai

మేరీ సెలెస్టే – సిబ్బంది ఎక్కడికి వెళ్లారు?

1872లో అట్లాంటిక్ మహాసముద్రంలో మేరీ సెలెస్టే అనే నౌక కనిపించింది. నౌక పెద్దగా దెబ్బతినలేదు. సరుకు కూడా ఉంది. కానీ అందులో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మాత్రం కనిపించలేదు. ఎందుకు నౌకలో ఎవరూ లేరు? ఆ తర్వాత ఏమైంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. సముద్రపు తుపాను నుంచి నౌకలో ఏర్పడిన ప్రమాదం వరకు అనేక రీజన్స్ ఉన్నప్పటికీ.. అసలు కారణం మాత్రం మిస్టరీగానే మిగిలింది.

అమీలియా ఇయర్‌హార్ట్ అదృశ్యం

ప్రపంచ ప్రఖ్యాత పైలట్ అమీలియా ఇయర్‌హార్ట్ 1937లో ప్రపంచాన్ని చుట్టివచ్చే ప్రయత్నంలో భాగంగా విమానంలో ప్రయాణిస్తూ అదృశ్యమయ్యారు. ఆమె విమానం ఎక్కడ కూలింది? ఆమెకు ఏమైంది? అనే ప్రశ్నలకు దశాబ్దాలుగా అన్వేషణ జరుగుతోంది. సముద్రంలో విమానం కూలిపోయి ఉండొచ్చనే అనుమానంతో పాటు ఆమె వేరే ప్రాంతంలో ల్యాండ్ అయి ఉండొచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. కానీ కచ్చితమైన ఆధారం ఇప్పటికీ దొరకలేదు.

45
నాజ్కా రేఖలు – ఎడారిలో ఇంత భారీ చిత్రాలు ఎందుకు?
Image Credit : gemini ai

నాజ్కా రేఖలు – ఎడారిలో ఇంత భారీ చిత్రాలు ఎందుకు?

పెరూలోని నాజ్కా ఎడారిలో నేలపై గీసిన భారీ ఆకృతులు ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పక్షులు, జంతువులు, మనుషుల ఆకారాలు, రేఖాగణిత నమూనాలు.. ఇలా వందలాది ఆకృతులు అక్కడ కనిపిస్తాయి. వేల సంవత్సరాల క్రితం వీటిని ఎలా రూపొందించారు? అసలు వాటి ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలపై పరిశోధనలు జరిగాయి. ఆధ్యాత్మిక ఆచారాల నుంచి ఖగోళ సంబంధాల వరకు అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే వాటి ఉద్దేశం ఏంటన్నది ఇంకా తెలియడం లేదు.

55
టావోస్ హమ్ – ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది?
Image Credit : gemini ai

టావోస్ హమ్ – ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది?

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఒక వింత, తక్కువ పిచ్‌ శబ్దాన్ని వింటున్నట్లు చెబుతుంటారు. అమెరికాలోని న్యూ మెక్సికోలోని టావోస్ ప్రాంతంలో వినిపించిందని చెప్తున్న ఈ శబ్దాన్నే “టావోస్ హమ్” అంటారు. కొంతమంది మాత్రమే వినగలిగే ఈ శబ్దానికి పరిశ్రమలు, వాతావరణ పరిస్థితులు, చెవిలోని అంతర్గత శబ్దాలు అని ఏవేవో చెబుతున్నారు గానీ..అసలు కారణమేంటన్నది తెలియదు.

బ్లాక్ డాలియా హత్య – హంతకుడు ఎవరు?

1947లో అమెరికాలో ఎలిజబెత్ షార్ట్ అనే యువతి హత్యకు గురైన కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు “బ్లాక్ డాలియా”గా ప్రసిద్ధి చెందింది. దర్యాప్తు సంస్థలు అనేక కోణాల్లో విచారణ జరిపినా.. హంతకుడు ఎవరో కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అనేక అనుమానితుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కేసు ఇప్పటికీ అమెరికాలో పరిష్కారం కాని హత్య కేసుల్లో ఒకటిగా నిలిచింది.

ఈ 7 ఘటనల్లో కొన్ని క్రమంగా వెలుగులోకి వస్తున్నా మరికొన్నింటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే పూర్తి ఆధారాలు లభించకపోవడంతో అవి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఫ్యాక్ట్ చెక్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎర్రబస్సు రంగు ఎందుకు మారింది? ఆర్టిసి బస్సులకు ఆకుపచ్చ, తెలుగు రంగులే ఎందుకు వేశారు?
Recommended image2
Agriculture : వర్షాలు ఆలస్యమైనా డోన్ట్ వర్రీ.. సెప్టెంబర్‌లో ఈ పంటలు వేస్తే మంచి ఆదాయం ఖాయం
Recommended image3
World Wonders: కళ్లని మాయ చేసే రెయిన్ బో బిల్డింగ్స్..ప్రపంచంలోనే అద్భుత కట్టడాలు ఇవి
Related Stories
Recommended image1
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి
Recommended image2
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved