శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. ఇక్కడ నొప్పిలేస్తుంది.. గమనించండి..
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో సమస్యలు వస్తాయి. దీనివల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం.

cholesterol
కొలెస్ట్రాల్ ఒక మైనపు పదార్థం. ఇది రక్తంలో ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే ధమనుల్లో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. మీ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే ధమనుల్లో రక్తప్రసరణ సక్రమంగా జరగదు. అంతేకాదు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే చాలాసార్లు మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుందనే విషయం అసలు తెలియదు. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి చికిత్స అందుబాటులో లేదు. మంచి ఆహారాలను తింటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అయితే కొలెస్ట్రాల్ పెరిగితే.. శరీరంలో కొన్ని చోట్ల నొప్పి కలుగుతుంది. వాటిని గమనించి టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది.
ఛాతిలో నొప్పి: మీకు తరచుగా ఛాతిలో నొప్పి వస్తుంటే.. పక్కాగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఎందుకంటే గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతేనే ఛాతీలో నొప్పి కలుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితేనే ఛాతిలో నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి కొన్ని కొన్ని సార్లు విపరీతంగా ఎక్కువవుతుంది.
కాలి నొప్పి: కాళ్ల నొప్పులకు కారణాలేన్నో ఉంటాయి. అందుకే ఇలాంటి నొప్పులను చాలా మంది లైట్ తీసుకుంటారు. పాదాలలో నొప్పి తగ్గాలని మందులను కూడా వాడుతుంటారు. కానీ వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. కాళ్లలోని ధమనులకు రక్తప్రసరణ సక్రమంగా జరగదు. దీనివల్ల పాదాలకు రక్తం సరిగా అందదు. రక్త ప్రవాహం తగ్గితే.. పాదాలలో నొప్పి కలుగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు పాదాల చర్మం రంగు మారుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే కొంతమంది పాదాలు చాలా చల్లగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ కు ఇది ఒక సూచిక.
గుండెలో నొప్పి: గుండెలో నొప్పి ఎక్కువగా ఉంటే కూడా మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్టే. కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండెలో నొప్పి ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
cholesterol
మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పోషకాలు తక్కువగా ఉండే ఆహారాలను తినడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల శరీరలో కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది. ఇవి మాత్రమే కాదు.. స్మోకింగ్ చేసేవారిలో, మద్యం తాగే వారిలో కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కరగాలంటే శారీరక శ్రమ ఎక్కువగా చేయాలి. ముఖ్యంగా రోజంతా కూర్చుని పని చేసే వ్యక్తులు ఎటువంటి శారీరక శ్రమ చేయకపోతే.. వీరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి.