- Home
- Life
- Delay Periods: ట్యాబ్లెట్స్ వేసుకోకుండా పీరియడ్స్ ను వాయిదా వేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..
Delay Periods: ట్యాబ్లెట్స్ వేసుకోకుండా పీరియడ్స్ ను వాయిదా వేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..
Delay Periods Naturally: మీరు మీ బహిష్టును వాయిదా వేసుకోవాలనుకుంటున్నారా? అయితే మిరియాలు, వెల్లుల్లి వంటి మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి. మీ పీరియడ్స్ తేదీకి కొన్ని రోజుల ముందు స్పైసీ ఫుడ్స్ స్థానంలో మీరు తేలికపాటి డైట్ తీసుకోవడం ప్రారంభించండి.

రుతుస్రావం (Menstruation) లేదా బహిష్టును ప్రతి నెలా ప్రతి మహిళ సాధారణంగా ఎదుర్కొనే సమస్య. ఈ సమయంలో వీరికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ చాలాసార్లు పూజా సమయంలో లేదా మరేదైనా కారణం వల్ల మహిళలు ఈ సమయాన్ని వాయిదా వేయాలని కోరుకుంటారు. దీని కోసం చాలా మంది ట్యాబ్లెట్లను వేసుకుంటూ ఉంటారు. వీటిని వేసుకోవడం వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ రక్తస్రావంతో పాటు పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ పీరియడ్స్ ను సహజంగా పోస్ట్ పోన్ (Delay Periods Naturally) చేయాలనుకుంటున్నారా? అయితే ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
మీరు మీ పీరియడ్స్ ను వాయిదా వేసుకోవాలనుకుంటే.. మిరియాలు, వెల్లుల్లి వంటి మసాలా ఫుడ్స్ ను తినడం మానేయండి. మీ పీరియడ్స్ తేదీకి కొన్ని రోజుల ముందు ఈ స్పైసీ ఫుడ్స్ కు బదులుగా తేలికపాటి డైట్ తీసుకోవాలి.
ఆవాలు (Mustard).. పీరియడ్స్ కు వారం ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలలో 2 టీస్పూన్ల ఆవాల పొడిని కలిపి తాగడం వల్ల రుతుస్రావం ఆలస్యం అవుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple cider vinegar).. పీరియడ్స్ రావడానికి 10 రోజుల ముందు రోజూ ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలుపుకుని తాగాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం ద్వారా పీరియడ్స్ ను 5 నుంచి 6 రోజులు పొడిగించుకోవచ్చు. ఇది కాకుండా.. ఇది శరీరం నుంచి అదనపు కొవ్వు ను, విష పదార్థాలను కూడా తొలగించడానికి సహాయపడుతుంది.
రాస్ప్బెర్రీ (Raspberry)ఆకులు.. రాస్ప్బెర్రీ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రుతుస్రావం (Menstruation) ప్రక్రియను మందగించేలా చేస్తుంది. దీని ద్వారా మీ పీరియడ్స్ వాయిదా పడుతుంది. దీని కోసం మీరు పీరియడ్స్ కు కొన్ని రోజుల ముందు నుంచి రాస్బెర్రీ లీఫ్ టీ తాగడం ప్రారంభించాలి. ఎందుకంటే ఇందులో ఫ్రాస్గారిన్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి గర్భాశయాన్ని టోనింగ్ చేయడానికి మరియు తిమ్మిరిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
మసాజ్ (Massage).. గర్భాశయ మసాజ్ లేదా కడుపు మసాజ్ రుతుచక్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. మసాజ్ కోసం ఏదైనా నూనె లేదా క్రీమ్‌ని ఉపయోగించడం వల్ల మీ కండరాలు విశ్రాంతి కలగడంతో పాటుగా శరీరంలో రక్త ప్రవాహాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది.
బొప్పాయి (Papaya).. బొప్పాయిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని ప్రేరేపిస్తుంది. ఇది గర్భాశయం యొక్క రక్త ప్రవాహంలో మార్పులకు దారితీస్తుంది. మీరు మీ బహిష్టును ఆలస్యం చేయాలనుకుంటే.. బొప్పాయి సురక్షితమైన మరియు సహజమైన మార్గం. ఇది మీ పీరియడ్స్ ను 4 నుంచి 5 రోజులు పొడిగించగలదు.