MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Jealous: మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారా? మీరు చేయాల్సింది ఇదే

Jealous: మీ బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారా? మీరు చేయాల్సింది ఇదే

 Jealous: మనం ఎదుగుతుంటే చూసి ఏడ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. ఏడ్వడంతో ఆగిపోరు.. అసూయతో మనల్ని ఇంకా కిందకు లాగాలని చూస్తారు. మరి, వారి ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 13 2026, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Jealous
Image Credit : chat gpt

Jealous

నరుడి చూపుకు నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. ఒకరు మంచిగా ఆనందంగా ఉన్నా, జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతున్నా చూసి ఓర్వలేని వాళ్లు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా మన బంధువులు, ఆప్తులు అని చెప్పుకునేవాళ్లే.. మన పక్కనే ఉండి మనల్ని కిందకు లాగేయాలని చూస్తారు. మన ముందు మాత్రం.. మన విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నట్లే నటిస్తారు.. లోపల మాత్రం మనం ఓడిపోవాలని కోరుకుంటారు. మన బలహీనతలు తెలుసుకొని వాటిని మనపై ఆయుధం గా చేసి ఓడించడానికి ప్రయత్నిస్తారు. మరి.. మనల్ని చూసి అసూయ పడేవారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎప్పుడో చెప్పారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రియాక్ట్ అవ్వకూడదు...
Image Credit : our own

రియాక్ట్ అవ్వకూడదు...

మన ఎదుగుదల చూసి ఓర్వలేని బంధువులు మనల్ని ఏదో ఒక విషయంలో కించపరచడానికి, బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారి మాటలకు వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. వాళ్ల మాటలకు కోపం వచ్చినా దానిని అణచుకోవడమే ఉత్తమం అని చాణక్యుడు చెబుతున్నాడు. అంతేకాదు.. వారి మాటలకు మౌనంగా ఉండి, నవ్వుతూ ముందుకు సాగాలి. మీ మౌనమే వారి వైఫల్యం అవుతుంది.

మీ గురించి ఏ విషయాన్నీ బయట పెట్టొద్దు...

మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా మంచి లాభం వచ్చినా అలాంటి విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. విషయం తెలుసుకోవడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తారు.. ఎంత సంపాదిస్తారు లాంటి ప్రశ్నలు వేసినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పొద్దు. ‘ ఏదో ఆ దేవుడి దయ వల్ల సరిపడా వస్తోంది’ అని చెప్పి తప్పించుకోండి..

Related Articles

Related image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Related image2
Mosquito: మీ బాల్కనీ ఈ మొక్కలు ఉంటే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు..!
33
వాదించకూడదు...
Image Credit : Chatgpt

వాదించకూడదు...

చాలా మంది మనల్ని రెచ్చగొట్టి వారు సంతోషించాలని అనుకుంటారు. వారు ఏదైనా మాట్లాడితే.. మీరు అది నిజం కాదు అని వారితో వాదించాల్సిన అవసరం లేదు. వాళ్లు చెప్పిందానికి అంగీకరించండి.. మీకు పోయేది ఏమీ లేదు.

అతి వినయం...

కొన్నిసార్లు చాలా మంది మన ప్రశాంతతను బలహీనంగా పొరపడతారు. అందుకే అతి వినయంగా ఉండకూడదు. ఎవరైనా మిమ్మల్ని కించపరిస్తే...‘ మీరు మా కళ్లు తెరిపించారు.. మీలాంటి మార్గదర్శిని పొందడం నా అదృష్టం’ అని తెలివిగా చెప్పి తప్పించుకోండి.

గెలిచి చూపించండి...

మీరు చేయాలి అనుకున్న పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదు. నిశ్శబ్దంగా కష్టపడాలి. మీరు సక్సెస్ అయ్యే వరకు ఆ విషయాన్ని బయట పెట్టకూడదు. మీరు విజయం సాధించిన తర్వాత ఎవరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయమే మీ గురించి అందరికీ అర్థమయ్యేలా చెబుతుంది.

దూరంగా ఉండాలి...

అతి చనువు అగౌరవానికి దారితీస్తుంది. మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే, ప్రజలు మీకు విలువ ఇవ్వడం మర్చిపోతారు. కాబట్టి ప్రతి పిలుపుకు సమాధానం ఇవ్వకండి, లేదా ప్రతి ఆహ్వానానికి స్పందించకండి. అప్పుడు మీ విలువ పెరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangle Designs: శ్రావణ మాసం పూజకు చేతుల అందాన్ని పెంచే గాజులు..!
Recommended image2
Coin Necklace: శ్రావణమాసం స్పెషల్..ట్రెడిషనల్ కాయిన్ నెక్లెస్ డిజైన్స్
Recommended image3
Grand Children Gifts: ఈ అపర కుబేరులు తమ మనవళ్లకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారో తెలుసా?
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Mosquito: మీ బాల్కనీ ఈ మొక్కలు ఉంటే... ఇంట్లోకి ఒక్క దోమ కూడా అడుగుపెట్టదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved