MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • లవంగాలను ఇలా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి..

లవంగాలను ఇలా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి..

షుగర్ పేషెంట్లు తమ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అయితే లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిని ఎలా తీసుకోవాలంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 02 2022, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

షుగర్ వ్యాధికి సాధారణంగా చెడు జీవన శైలి, ఆనారోగ్యకరమైన ఆహారాలే ప్రధాన కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొంతమందికి ఈ డయాబెటీస్ జన్యుపరంగా కూడా వస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా షుగర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ డయాబెటీస్ రోగంలో ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ శరీర రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వంటగదిలో ఉండే ఒక మసాలా దినుసు డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అదే లవంగాలు. లవంగాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి సహాయపడతాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

డయాబెటీస్ లకు లవంగాల ప్రయోజనాలు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటీస్ పేషెంట్లకు లవంగాలు  ఎన్నో విధాల మేలు చేస్తాయి. లవంగాల్లో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని నిరోధిస్తాయి.  ఇన్సులిన్, గ్లూకోస్ స్థాయిలను సక్రమంగా ఉండేందుకు లవంగం నూనె ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్లోమగ్రంథిని ఆప్టిమైజ్ చేస్తాయి. క్లోమం ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. 
 

 

34

లవంగాలను ఎలా ఉపయోగించాలి

లవంగాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ముందుగా ఒక చెంచా లవంగాలను తీసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి  కప్పు నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా మరగబెట్టండి. ఆ తర్వాత దీంట్లో అర టీస్పూన్ టీ పొడిని వేసి కాసేపు మరగబెట్టండి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి వడకట్టి చల్లారిన తర్వాత  తాగండి. దీన్ని ప్రతిరోజూ టీ లా తాగితో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

44

లవంగాలు శరీర మంటను కూడా తగ్గిస్తాయి. లవంగాలను ఆర్థరైటిస్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. ఇవి చిగుళ్ల, దంత సమస్యలను కూడా తగ్గిస్తాయి. అలాగే నోటి దుర్వాసనను కూడా పోగొడుతాయి. జర్నీలో వాంతులు చేసుకునే వారు.. జర్నీస్టార్ట్ అవడానికి ముందు రెండు లవంగాలను నమిలితే వాంతి వచ్చే అవకాశమే ఉండదు. ఇవి జీర్ణ సమస్యలను కూడా పోగొడుతాయి. లవంగాలను తినడం అల్సర్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. బీపీ కూడా తగ్గుతుంది. అలాగే తలనొప్పి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Daily Wear Bangles: చేతులకు నిండుగా అందమైన గాజులు.. డైలీవేర్ కి బెస్ట్
Recommended image2
Hairstyles: నుదురు వెడల్పుగా ఉన్నవారికి సూటయ్యే హెయిర్ స్టైల్స్ ఇవి
Recommended image3
Salt Remedies: ఉప్పును ఈ ప్లేసులో పెడితే ఇంట్లో సంపద, సంతోషం రెట్టింపు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved