MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Motivational: పక్కవారి మాటలకు బాధపడుతున్నారా? ఈ కథ చదివితే మనసు ప్రశాంతంగా మారుతుంది.

Motivational: పక్కవారి మాటలకు బాధపడుతున్నారా? ఈ కథ చదివితే మనసు ప్రశాంతంగా మారుతుంది.

తన కోపమే తనకు శత్రువు అని చిన్నప్పుడు పద్యాలు చదువకున్నాం. కానీ ఎంతటి ప్రశాంతమైన వ్యక్తికైనా సరే కోపం రావడం సర్వసాధారణం. అయితే కోపాన్ని ఎలా జయించాలో గౌతమ బుద్ధుడు చెప్పిన మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది. ఇంతకీ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

1 Min read
Narender Vaitla
Published : Mar 07 2025, 03:26 PM IST| Updated : Mar 07 2025, 08:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో ఉండే ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండానే బుద్ధుడిని దూషిస్తాడు. అవమానిస్తాడు, నొటికొచ్చినట్లు తిడతాడు. అయితే బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా నవ్వుతాడు తప్ప. ఆ వ్యక్తిపై అస్సలు కోపం తెచ్చుకోడు. 

దీంతో ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి.. 'నేను నిన్ను ఇంతలా తిడుతున్నా? నీకు ఎందుకు కోపం రావడం లేదు. పైగా నవ్వుతున్నావు. నీకు ఏమైనా పిచ్చా.?' అని ప్రశ్నించాడు. 

23

దానికి బుద్ధుడు ప్రశాంతంగా బదులిస్తూ.. 'ఒక మనిషి ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చే ప్రయత్నం చేస్తే, కానీ ఆ వ్యక్తి దాన్ని తీసుకోకపోతే, ఆ బహుమతి ఎవరికి ఉంటుందో చెప్పండి?' అని అంటాడు. దానికి ఆ కోపిష్టి బదులిస్తూ.. "దాన్ని ఇచ్చినవాడికే ఉంటుంది." అని సమాధానం ఇస్తాడు. 

అప్పుడు బుద్ధుడు హాస్యంగా చెప్పాడు.. "నువ్వు నన్ను తిడితే, నేను దాన్ని స్వీకరించకపోతే, ఆ కోపం నీ దగ్గరే ఉండిపోతుంది' అని బదులిస్తాడు. దీంతో ఆ కోపిష్టి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. నిజమే కదా అని ఆలోచనలో పడిపోతాడు. 
 

33

నీతి: మన జీవితంలో రకరకాల మనుషులు ఎదురవుతుంటారు. మన ప్రశాంతతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటిని మనసుకు తీసుకోకుండా హాయిగా ఓ నవ్వు నవ్వేస్తే శత్రువులు కూడా మన జోలికి రావడానికి వెనుకడుగు వేస్తారు. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved