MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Chopping Board: కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డుపై లక్షలాది క్రీములు.. ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

Chopping Board: కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డుపై లక్షలాది క్రీములు.. ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

 Chopping Board: మీ ఇంట్లో చాపింగ్ బోర్డ్ ఉందా? కూరగాయలు కట్ చేసిన తర్వాత కేవలం నీటితో మాత్రమే కడుగుతున్నారా? దాని మీద ఎన్ని లక్షల క్రిములు ఉంటాయో తెలుసా? మరి, వాటిని తొలగించేలా? ఎలా శుభ్రం చేయాలో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 02 2026, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Chopping Board
Image Credit : Gemini AI

Chopping Board

కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే.. కిచెన్ శుభ్రంగా ఉండాలి. మనం వంట చేసుకునే పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ.. వాటితో పాటు.. కూరగాయలు కట్ చేసే చాపింగ్ బోర్డు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మనం కూరగాయలు కట్ చేసినప్పుడు వాటికి ఉండే రసం.. చాపింగ్ బోర్డ్ కి అంటుకుంటుంది. చాలా మంది వీటిని కేవలం నీటితో మాత్రమే శుభ్రం చేస్తారు. కానీ, మీ కటింగ్ బోర్డు చెక్కది అయితే.. దానిపై లక్షల క్రిములు నివసిస్తూ ఉంటాయి. కేవలం నీటితో శుభ్రం చేస్తే.. దాని మీద క్రిములు వదలవు. ఆరోగ్య సమస్యలు ఉండకూడదు అంటే.. దేనితో శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వంటగదిలోని వస్తువులతోనే....
Image Credit : others

వంటగదిలోని వస్తువులతోనే....

చెక్కతో చేసిన చాపింగ్ బోర్డును సరిగా శుభ్రం చేయకపోతే.. దాని మీద ఉండే క్రిములు ఆరోగ్య సమస్యలు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. దానిని సరిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కేవలం వంట గదిలో లభించే మూడు పదార్థాలతో శుభ్రం చేయచ్చు..

చెక్క కటింగ్ బోర్డును శుభ్రం చేయడానికి, దానిపై కొద్దిగా ఉప్పు చల్లి, నిమ్మరసంతో బాగా రుద్దాలి.ఇది ఎలాంటి మురికినైనా సులభంగా తొలగిస్తుంది. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత, కటింగ్ బోర్డుకు కొద్దిగా నూనె రాసి, మీ చేతులతో సమానంగా పూయాలి. దీని వల్ల కటింగ్ బోర్డు ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉంటుంది.

Related Articles

Related image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Related image2
Garuda Purana: కోట్లల్లో సంపాదించినా.. వీరికి సంతోషం దొరకదు, ఎందుకో తెలుసా?
33
 బేకింగ్ సోడా, నీరు..
Image Credit : our own

బేకింగ్ సోడా, నీరు..

మీ చాపింగ్ బోర్డుపై పసుపు,బీట్ రూట్ లేదా ఇతర కూరగాయల మరకలు ఉంటే, కొద్దిగా బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్టులాగా చేయాలి. దీనిని బోర్డుకు పూసి 5 నుంచి 10 నిమిషాల వరకు వదిలేయాలి. ఆ తర్వాత బ్రష్ తో రుద్దిగా నీటితో కడిగేస్తే సరిపోతుంది. మరకలన్నీ సులభంగా వదులుతాయి.

వెనిగర్...

వెనిగర్ ఒక సహజమైన క్లీనర్. కాబట్టి.. దీనితో చాపింగ్ బోర్డు శుభ్రం చేస్తే క్రిములు చనిపోతాయి. ఒక స్ప్రే బాటిల్ లో వెనిగర్ నింపి.. చాపింగ్ బోర్డుపై స్ప్రే చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత శుభ్రమైన క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల దుర్వాసన కూడా పోతుంది.

ఎండలో ఆరబెట్టాలి..

మీరు కటింగ్ బోర్డును కడిగిన తర్వాత, దానిని మూసి ఉన్న ప్రదేశంలో నిల్వ చేయద్దు. శుభ్రంగా కడిగిన తర్వాత.. ఎండలో ఆరపెట్టాలి. ఇలా చేయడం వల్ల క్రిములు చేరకుండా ఉంటాయి.

మీ కటింగ్ బోర్డుకు నెలకు ఒకసారి నూనె రాయండి.

దీనిని ఎక్కువ కాలం దృఢంగా , మెరిసేలా ఉంచడానికి, నెలకు ఒకసారి మినరల్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను రాయండి. ఇది చెక్క ఎండిపోకుండా, పగుళ్లు రాకుండా నివారిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Tamarind: ఇలా చేస్తే.. సంవత్సరమైనా చింతపండు నల్లగా మారదు.. ఫ్రెష్ గా ఉంటుంది..!
Recommended image2
Garuda Purana: కోట్లల్లో సంపాదించినా.. వీరికి సంతోషం దొరకదు, ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved