పదే పదే ముఖాన్ని కడుగుతున్నారా? అయ్యో.. మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా?
మండే ఎండలకు, అధిక ఉష్ణోగ్రత కారణంగా ముఖంపై చెమట ఎక్కువగా పట్టడమే కాదు..చర్మం కూడా జిడ్డుగా మారుతుంది. ముఖ్యంగా వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వడదెబ్బ, మొటిమలు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటి ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాగా ఇప్పటికే మొటిమలు, చర్మ సమస్యలు లేదా జిడ్డు చర్మం ఉన్నవారికి వేసవిలో ఈ సమస్య పెరుగుతుంది. దీనిని నివారించడానికి ముఖాన్ని తరచుగా కడుతుంటారు. ఇలా చేయడం సేఫేనా?

వేసవిలో ముఖాన్ని తరచుగా కడుక్కోవడం లేదా చర్మాన్ని తరచుగా క్లీన్సర్ తో శుభ్రం చేసుకోవడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఫేస్ వాష్ (Face wash) లేదా క్లీన్సర్ (Cleanser) ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినడంతో పాటుగా ఇది మొటిమల సమస్యలను మరింత ఎక్కువ చేస్తుంది
ముఖాన్ని తరచుగా కడుక్కోవడం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ముఖాన్ని పదేపదే కడుక్కోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు తొందరగా వస్తాయి. అలాగే గరుకుదనం కారణంగా చర్మం ఎక్కువగా సాగుతుంది. దీని వల్ల చర్మంపై ముడతలు కనిపిస్తాయి. అందుకే మీ ముఖాన్ని తరచుగా కడుక్కోవద్దు.
కళ్ల కింద నల్లటి వలయాలు కనిపించడానికి కూడా ఇదే కారణం అంటున్నారు నిపుణులు. అవును.. మీరు మీ ముఖాన్ని ఎంత ఎక్కువగా కడిగితే.. ముఖంపై తేమ అంత తక్కువ అవుతుంది. అలాగే ముఖం పొడిగా మారుతుంది. కంటి చుట్టూ నల్లటి వలయాలు వస్తాయి.
తరచుగా ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది చర్మం యొక్క గ్లోను దెబ్బతీస్తుంది. ఇది మీరు నిస్తేజంగా (Dull) కనిపించేలా కూడా చేస్తుంది. అందుకే ఫేస్ వాష్ లు ఎక్కువగా చేసే ముందు జాగ్రత్తగా ఉండండి.
తరచుగా ఫేస్ వాష్ చేయడం వల్ల ఈ మైక్రోఫ్లోరాస్ ల సంఖ్య తగ్గుతుంది. అలాగే చర్మం తన సహజ ప్రకాశాన్ని కూడా కోల్పోతుంది. ముఖం కడిగిన ప్రతిసారీ కెమికల్ ఫేస్ వాష్ ఉపయోగించడం వల్ల చర్మంలో చిరాకు, దురద పెడుతుంది.
చర్మం యొక్క మాయిశ్చరైజర్ (Moisturizer) పోతుంది: ఇది చర్మం పొడిగా కనిపించేలా చేస్తుంది. తరచూ ముఖాన్ని కడుక్కోవడం ద్వారా చర్మంపై ఉండే సెబమ్ (Sebum) ను తొలగిస్తుంది,
పొడిబారిన చర్మం మొటిమలు, Skin infection అవకాశాలను పెంచుతుంది. ఇది మీ చర్మం యొక్క పిహెచ్ స్థాయిని (PH level) కూడా మరింత దిగజార్చుతుంది. చాలా కాలం పాటు ఈ అలవాటుంటే మీ చర్మం ముసలి వారి చర్మంలా కనిపించడం మొదలవుతుంది. అందుకే పదేపదే ఫేస్ వాష్ చేయకండి.
మీ చర్మంపై మొటిమలు లేదా దద్దుర్లు ఉన్నట్లయితే మీరు మీ ముఖాన్ని రోజుకు 2 నుంచి 3 సార్ల కంటే ఎక్కువసార్లు కడగకండి. జిడ్డు చర్మం (Oily skin), బ్లాక్ హెడ్స్ (Blackheads) లేదా వైట్ హెడ్స్ ఉన్నట్టైతే.. మీరు హెవీ ఫేస్ వాష్ ఉపయోగించడం మానుకోవాలి.
అలాగే చర్మాన్ని Exfoliate చేయొద్దు. అతిగా శుభ్రపరచొద్దు కూడా. ఎందుకంటే ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా అంటు వ్యాధులు, అలెర్జీలు, దద్దుర్లు, మొటిమల సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.
చర్మంపై మురికి, చెమట, జిడ్డు చర్మం ఎక్కువగా ఉంటే ఫేస్ వాష్ తో మళ్లీ మళ్లీ చర్మాన్ని కడగడం లేదా క్లెన్సర్ తో శుభ్రం చేయడానికి బదులుగా థర్మల్ వాటర్ మిస్ట్ ను ఉపయోగించొచ్చు. రోజంతా చెమట పట్టిన తర్వాత చర్మంపై దీనిని అప్లై చేయొచ్చు. ఇది చెమట, నూనె మరియు మురికిని తొలగిస్తుంది.