MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Savings Account: మీ బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉంచొచ్చు? ఎంత లిమిట్ దాటితే ఐటీ నోటీసులు వస్తాయి?

Savings Account: మీ బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉంచొచ్చు? ఎంత లిమిట్ దాటితే ఐటీ నోటీసులు వస్తాయి?

Savings Account: ఎంతోమందికి తమ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు ఉంచుకోవచ్చో తెలియదు. కొంతమంది పెద్ద మొత్తంలో డబ్బును ఉంచుతారు. అలాగే భారీగా నగదు లావాదేవీలు చేస్తారు. ఇలా ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 05 2026, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉంచొచ్చు?
Image Credit : our own

బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉంచొచ్చు?

బ్యాంకు ఖాతాలోని సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? అనే విషయంపై ప్రజల్లో అవగాహన తక్కువ. ఎక్కువ డబ్బుంటే ఏం జరుగుతుంది? ఇలా ఎన్నో సందేహాలు ఎక్కువ మంది ఉంటాయి. జీతం తీసుకునే ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు అందరూ రోజువారీగా సేవింగ్స్ ఖాతాలోని డబ్బును వాడుతూనే ఉంటారు. కానీ ఇందులో ఎంత డబ్బు ఉంచొచ్చనే దానిపై మాత్రం అవగాహన తక్కువ. 

నిజానికి ఆదాయపు పన్ను చట్టంలో సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచే డబ్బుపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. అంటే మీ ఆదాయానికి తగ్గట్టు ఎంత డబ్బయినా దాచుకోవచ్చు. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు జమ చేసినా, లేదా మీ ఆదాయ వివరాలకు పొంతన లేని లావాదేవీలు జరిపినా, బ్యాంకులు ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు పంపే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆదాయపు పన్ను నియమాలు
Image Credit : Gemini AI

ఆదాయపు పన్ను నియమాలు

ఎక్కువ డబ్బు ఖాతాలో జమ అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని అడగవచ్చు. అప్పుడు జీతం, వ్యాపార ఆదాయం, ఆస్తి అమ్మకం, బహుమతి, ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ లేదా వారసత్వ ఆస్తి వంటి వాటికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అందుకే, పెద్ద లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసరం.

Related Articles

Related image1
Gold Haaram: పొడవాటి బంగారు హారాలు.. ఒక్కటి వేసుకుంటే చాలు
Related image2
Mutton: గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు?
33
ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది
Image Credit : our own

ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది

సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బుపై పన్ను ఉండదు. కానీ ఆ డబ్బుపై బ్యాంక్ ఇచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను విధిస్తారు. అయితే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద, అర్హులైన వారికి సేవింగ్స్ అకౌంట్ వడ్డీపై కొంత మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80TTB కింద అదనపు పన్ను ప్రయోజనం ఉంటుంది.

కాబట్టి, సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్కువ డబ్బు ఉన్నంత మాత్రాన పన్ను పడుతుందనేది అపోహ మాత్రమే. కానీ, మీ ఆదాయానికి అనుగుణంగా అన్ని లావాదేవీలు చట్టబద్ధంగా, సరైన పత్రాలతో ఉండటం, అలాగే ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో సరిగ్గా చూపించడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే అనవసరమైన పన్ను చిక్కుల నుంచి సులభంగా బయటపడొచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image2
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image3
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Related Stories
Recommended image1
Gold Haaram: పొడవాటి బంగారు హారాలు.. ఒక్కటి వేసుకుంటే చాలు
Recommended image2
Mutton: గొర్రె మాంసాన్ని మటన్ అని పిలిస్తే.. మరి మేక మాంసాన్ని ఏమంటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved