MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Kidneys: ఒకరోజులో ఎన్ని లీటర్ల నీటిని తాగితే కిడ్నీలు సేఫ్?

Kidneys: ఒకరోజులో ఎన్ని లీటర్ల నీటిని తాగితే కిడ్నీలు సేఫ్?

Kidneys: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని అధికంగా తాగాలి. అయితే ఎన్ని లీటర్ల నీటిని తాగితే మూత్రపిండాలు సురక్షితమో తెలుసా? ఈ కాలంలో కిడ్నీల సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 20 2026, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కిడ్నీల సమస్య
Image Credit : Getty

కిడ్నీల సమస్య

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. రక్తాన్ని శుభ్రం చేయడం, శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపించడం.. ఇవే కిడ్నీల పని. అందుకే కిడ్నీలు బాగుండాలంటే మనం రోజూ తాగే నీళ్లు చాలా ముఖ్యమైనవి. కానీ చాలామందికి ఒకే సందేహం ఉంటుంది రోజుకు ఎంత నీళ్లు తాగాలి అని. చాలా మంది ఎక్కువగా తాగితే మంచిదే అనుకుంటారు, కానీ నిజానికి అది పూర్తిగా కరెక్ట్ కాదు. వైద్యులు చెప్పిన ప్రకారం నీళ్లు తప్పనిసరిగా తాగాలి. కానీ ఎంత తాగాలి అనేది ప్రతి ఒక్కరికి వేరేలా ఉంటుంది. సాధారణంగా ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు 6 నుంచి 8 గ్లాసులు, అంటే సుమారు 2 లీటర్ల వరకు నీళ్లు తాగితే సరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్ని నీళ్లు తాగాలి?
Image Credit : Getty

ఎన్ని నీళ్లు తాగాలి?

అయితే ఈ నీళ్ల లెక్క అందరికీ ఒకేలా ఉండదు. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లో పనిచేసే వారు, బయట ఎక్కువగా తిరిగే వారు, జిమ్‌కి వెళ్లే వారు లేదా ఎక్కువగా చెమటలకు గురయ్యేవారు.. వీరంతా ఎక్కువ నీళ్లు తాగడం అవసరం.కొందరికి రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల వరకు కూడా అవసరం ఉండొచ్చు. అలాగే శరీర బరువు, వయసు, ఆరోగ్య పరిస్థితి ఇవి కూడా ప్రభావం చూపిస్తాయి.దాహం వేసే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే నీళ్లు తాగాలి. నీళ్లు సరిపడినంత తాగితే మూత్రం లైట్ కలర్‌లో వస్తుంది. మూత్రం ముదురు రంగులో వస్తే శరీరానికి సరిపడా నీరు తాగడం లేదని అర్థం.

Related Articles

Related image1
Money in Dreams: కలలో డబ్బులు ఎలా కనిపిస్తే అదృష్టం? డబ్బు పోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది?
Related image2
Gold Biscuits: బంగారాన్ని ఆభరణాలుగా కొంటే లాభమా లేక గోల్డ్ బిస్కెట్లలా కొంటే మంచిదా?
34
నీళ్లు అతిగా తాగితే
Image Credit : Getty

నీళ్లు అతిగా తాగితే

నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీలపై డైరెక్ట్‌గా ఎఫెక్ట్ పడుతుంది. నీరు తక్కువైతే మూత్రం గాఢంగా మారుతుంది. అందులో మినరల్స్ ఎక్కువగా పేరుకుపోతాయి. దీని వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. చాలా కాలం ఇలా కొనసాగితే కిడ్నీల పనితీరు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. కానీ అదే సమయంలో చాలా ఎక్కువగా నీళ్లు తాగడం కూడా మంచిది కాదు. అవసరానికి మించి నీరు తాగితే వాటర్ ఇంటాక్సికేషన్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల శరీరంలో సోడియం లెవల్స్ తగ్గిపోతాయి. తలనొప్పి, వాంతులు, గందరగోళం వంటి సమస్యలు రావచ్చు.

44
చిన్న చిన్న జాగ్రత్తలు
Image Credit : Getty

చిన్న చిన్న జాగ్రత్తలు

కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే సింపుల్‌గా ఒక రూల్ ఫాలో అవ్వాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు తాగడం కాకుండా రోజంతా కొద్దికొద్దిగా తాగడం మంచిది. ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీళ్లు తాగడం, బయటకు వెళ్తే నీళ్ల బాటిల్ వెంట పెట్టుకోవడం, దాహం వేయకముందే కొద్దిగా తాగడం... ఇవన్నీ మంచి అలవాట్లు. అలాగే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ తాగడం తగ్గిస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా ప్రకారం నీళ్లు తాగాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ఈజీ.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Recommended image2
Mangalsutra Designs: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Parenting: పిల్లలకు పాకెట్ మనీ ఇస్తున్నారా? ఈ మూడు డబ్బాల సీక్రెట్ నేర్పితే.. మీ పిల్లలకు మనీ విలువ తెలిసినట్లే..!
Related Stories
Recommended image1
Money in Dreams: కలలో డబ్బులు ఎలా కనిపిస్తే అదృష్టం? డబ్బు పోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది?
Recommended image2
Gold Biscuits: బంగారాన్ని ఆభరణాలుగా కొంటే లాభమా లేక గోల్డ్ బిస్కెట్లలా కొంటే మంచిదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved