Sleep Hours : రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి..? ఒక వేళ నిద్ర తక్కువైతే ఏమౌతుంది?
Sleep Hours : నిద్రలేమి, తక్కువ నిద్ర ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా నిద్రలేమి వల్ల ఎన్నో జబ్బులు సోకి.. ప్రాణాలు కూడా పోవచ్చు.

Sleep Hours : ఆహారం ఎలాగో నిద్ర కూడా మన ఆరోగ్యానికి ప్రాథమిక అవసరం. కానీ ప్రస్తుత గజిబిజీ లైఫ్ లో చాలా మంది నిద్రకు తగిన సమయం కేటాయించడం లేదు. కాలంతో పాటుగా పెరిగెత్తడం తప్పు కాదు కానీ.. నిద్రకూడా పోకుండా లైఫ్ ను లీడ్ చేస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
పొద్దంతా పనిచేసి అలసిన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. నిద్రతోనే మెదడుకు, మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. శరీరం తిరిగి పునరుత్తేజంగా మారుతుంది. దాంతో మీరు తర్వాతి రోజు ఉత్సాహంగా పని చేయగలుగుతారు.
కానీ ప్రస్తుతం నిద్రలేమి సమస్య ఎంతో మందిని పట్టి పీడిస్తుంది. రాత్రుళ్లు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు చూస్తూ.. నిద్రకు దూరమవుతున్నారని వారు కూడా ఉన్నారని పలు సర్వేలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. నిద్రలేమి సమస్య చిన్నదిగా అనిపించినప్పటికీ.. ఇది ప్రాణాలను కూడా తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
sleep
ఒక అధ్యయనం ప్రకారం.. పెద్దలు (Adults) ప్రతిరోజూ రాత్రి పూట కనీసం ఏడు గంటలన్నా నిద్రపోవాలి. ముఖ్యంగా నలభై ఏండ్ల పైబడిన వారికి ఈ ఏడుగంటల నిద్ర ఎంతో అవసరం.
ఈ అధ్యయన వివరాలు నేచర్ ఏజింగ్ అనే ప్రముఖ ప్రచురణలో ప్రచురించబడ్డాయి. ఈ అధ్యయనంలో 38 నుంచి 73 సంవత్సరాల మధ్య వయసున్న 500,000 మందికి పైగా పాల్గొన్నారు. దీనిలో నిద్రలేమి వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంపై పరిశోధన చేశారు.
అదే సమయంలో నిద్రతక్కువైతే ఏమవుతుందో అన్న విషయాలపై కూడా పరిశోధన జరిపారు. కాగా నిద్ర మరీ ఎక్కువగా పోతే శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు.
నిద్రలేమి లేదా గాఢమైన నిద్ర.. రెండూ కూడా మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇటువంటి వ్యక్తులు ఫ్యూచర్ లో చిత్తవైకల్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు వెళ్లడిస్తున్నారు.
sleep
నిద్ర రుగ్మతలు (Sleep disorders) మెదడు పై చెడుప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా నిద్ర సమస్యలు జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాదు మెమోరీ స్టోరేజ్ కూడా తగ్గుతుందట. బాగా ఆలోచించడానికి , ఏదైనా నేర్చుకోవడానికి నిద్ర ఎంతో అవసరం. కానీ మరీ ఎక్కువ నిద్రపోవడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని పలు అధ్యయనాలు ఎన్నో సార్లు చెప్పాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాలను మాత్రం వెళ్లడించలేదు.
మీ రోజు వారి పనులను చేసుకోవాలన్నా.. ఒత్తిడితో కూడిన పనులను కంప్లీట్ చేయాలన్నా.. మీకు తగినంత నిద్ర అవసరం. ముఖ్యంగా మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు కంటి నిండా నిద్రపోకపోతే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. నిద్ర ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.